సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పరిశుభ్రత మరియు పెండింగ్‌ల తొలగింపుపై ప్రత్యేక ప్రచారం 3.0ని విజయవంతంగా పూర్తి చేసింది.


2 లక్షల కేజీల చెత్తను తొలగించారు, రూ. 3.62 కోట్ల ఆదాయం సమకూరింది.

1000 కంటే ఎక్కువ బహిరంగ ప్రచారాలు నిర్వహించబడ్డాయి, 1900 కంటే ఎక్కువ ప్రదేశాలు గుర్తించబడ్డాయి మరియు శుభ్రం చేయబడ్డాయి.

పౌర సమస్యలు మరియు పౌర సమస్యల అభ్యర్థనలను పరిష్కరించే పూర్తి లక్ష్యం సాధించబడింది.

Posted On: 14 NOV 2023 11:47AM by PIB Hyderabad

పరిశుభ్రతను సంస్థాగతీకరించడానికి మరియు ప్రభుత్వంలో పెండింగ్‌ను తగ్గించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టి మరియు లక్ష్యంతో స్ఫూర్తి పొంది, సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ దాని క్షేత్ర కార్యాలయాలలో 2023 అక్టోబర్ 2 నుండి 31 అక్టోబర్ 2023 వరకు ఉత్తమ పద్ధతులను అవలంబించడంపై దృష్టి సారించి పరిశుభ్రతను సంస్థాగతీకరించడం, పెండెన్సీని పూర్తిచేయడం, మెరుగైన స్థల నిర్వహణ మరియు వివిధ కమ్యూనికేషన్ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించడం కోసంప్రత్యేక ప్రచారం 3.0లో పాల్గొన్నారు. 

 

మొత్తం 1013 బహిరంగ ప్రచారాలు నిర్వహించబడ్డాయి. 1972 ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేశారు. 2,01,729 కిలోల చెత్తను తొలగించారు,  రూ. 3.62 కోట్ల ఆదాయం సంపాదించారు అలాగే 29670 చదరపు అడుగుల స్థలం ఖాళీ చేయబడింది. 49,984 ఫైళ్లను సమీక్షించగా, అందులో 28,574 ఫైళ్లు తొలగించబడ్డాయి. 841 ఈ-ఫైళ్లు కూడా మూసివేయబడ్డాయి. ప్రత్యేక ప్రచారం 3.0 సమయంలో సాధించిన విజయాలపై 1837  సోషల్ మీడియా పోస్ట్‌లు ప్రచురించబడ్డాయి. ప్రజా ఫిర్యాదులు, పౌర ఫిర్యాదుల అభ్యర్థనలను పరిష్కరించడంలో మంత్రిత్వ శాఖ 100% లక్ష్యాన్ని సాధించింది. 21 ఎం పీ సూచనలు, 2 పీ ఎం ఓ సూచనలు మరియు 7 పార్లమెంటరీ హామీలను పరిష్కరించింది. రోజువారీ పురోగతిని ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది మరియు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ మరియు పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్ కి చెందిన ఎస్ సీ పీ డీ ఎం  పోర్టల్‌లో అప్‌లోడ్ చేయబడింది. ప్రచార సమయంలో మంత్రిత్వ శాఖ అనేక ఉత్తమ పద్ధతులను అవలంబించింది. కొన్ని ముఖ్యమైన ఉత్తమ అభ్యాసాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

 

i.స్టోర్ రూమ్‌ని రిక్రియేషన్ సెంటర్‌గా మార్చడం

ii. సరస్సు ను శుభ్రపరచడం

III. వ్యర్థం నుండి ఉత్తమమైన చొరవ

IV. చెత్త స్థలం యొక్క సుందరీకరణ

చెత్త గదిని యోగా కేంద్రంగా మార్చడం

మంత్రిత్వ శాఖ కార్యదర్శి మరియు సీనియర్ అధికారులు వివిధ క్షేత్ర కార్యాలయాలను సందర్శించి, స్వచ్ఛతా ప్రచారం పురోగతిని సమీక్షించారు మరియు మునుపటి ప్రచారంలో ఖాళీగా ఉన్న వినియోగాన్ని సమీక్షించారు.

 

శ్రీ అపూర్వ చంద్ర, సెక్రటరీ ప్రత్యేక ప్రచారం 3.0 సందర్భంగా బెంగళూరులోని మంత్రిత్వ శాఖ యొక్క ఫీల్డ్ కార్యాలయాలను సందర్శించారు.

 

ఉత్తమ అభ్యాసం1: స్టోర్ రూమ్‌ని వినోద కేంద్రంగా మార్చడం

 

ప్రత్యేక ప్రచారం 3.0 సమయంలో, మంత్రిత్వ శాఖ ప్రధాన సెక్రటేరియట్‌లోని ఒక స్టోర్ రూమ్‌ను గ్రౌండ్ ఫ్లోర్‌లో, శాస్త్రి భవన్‌లో జిమ్ మరియు టేబుల్ టెన్నిస్ సౌకర్యంతో ప్రత్యేక వినోద కేంద్రంగా మార్చింది.

 

ఉత్తమ అభ్యాసం2: సరస్సును శుభ్రపరచడం

 

సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్  కోల్‌కతా క్యాంపస్‌లోని 60,000 చదరపు అడుగుల నీటి సరస్సు ను పూర్తి గా శుభ్రపరిచింది, నీటి అడుగున పర్యావరణ వ్యవస్థను సంరక్షించడానికి మరియు చేపలు మరియు కొబ్బరి చెట్లను పెంచుతోంది. పునరుజ్జీవింపబడిన సరస్సు ఇప్పుడు మత్స్య సాగు మరియు కొబ్బరి సాగు యొక్క ద్వంద్వ ప్రయోజనాన్ని అందిస్తుంది, నీరు మరియు చెట్ల పరిశుభ్రతను కాపాడుతూ టెండర్ ద్వారా ఆదాయాన్ని పొందుతుంది.

 

 

ఉత్తమ అభ్యాసం 3: చెత్త నుంచి సౌందర్యం ప్రచారం 

 

ఎస్ ఆర్ ఎఫ్ టీ ఐ  "బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్" కార్యక్రమాన్ని మూడు దశల్లో అమలు చేసింది. ప్రారంభంలో, షూటింగ్ ప్రయోజనాల కోసం ఉపయోగించే కళగా మార్చడానికి క్యాంపస్ అంతటా విస్మరించబడిన చెత్తను విద్యార్థుల బృందం గుర్తించింది. తదనంతరం, సేకరించిన చెత్త షూటింగ్ లొకేషన్‌లలో ప్రాసెస్ చేయబడి, టేబుల్‌లు, బెంచీలు మరియు సర్కస్ ప్రాప్‌లు వంటి వినూత్నమైన మరియు ఉపయోగపడే ఉత్పత్తులు గా రూపాంతరం చెందాయి. చివరగా, ఈ ఉత్పత్తులు చలనచిత్ర సెట్‌ల అంశాలుగా మారాయి ఫలితంగా 30,000 రూపాయల ఖర్చు ఆదా అవుతుంది మరియు విద్యార్థులందరికీ ప్రాప్యతను అందిస్తుంది.

 

ఉత్తమ అభ్యాసం 4: చెత్త ప్రాంతాన్ని సుందరీకరణ చేసింది 

 

సుందరీకరణ లో అవగాహన కల్పించే ప్రయత్నంలో, ఎస్ ఆర్ ఎఫ్ టీ ఐ లో కొత్తగా నిర్మించిన గార్బేజ్ ప్రాంతాన్ని పెయింటింగ్స్, స్ఫూర్తిదాయకమైన కోట్స్ మరియు పూల మొక్కలతో అలంకరించింది

 

ఉత్తమ అభ్యాసం 5: చెత్త గదిని యోగా కేంద్రంగా మార్చడం

 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్  ప్రచారం సమయంలో ఒక పెద్ద గదిని గుర్తించింది, దానిని ఉపయోగించలేని వస్తువులను ఉంచడానికి స్టోర్ రూమ్‌గా ఉపయోగించారు. మంచి సౌర కాంతి ప్రసరించే గది  లో చెత్త పారవేయడం తో  చెత్త గది గా వుండేది అది శుభ్రపరచిన తర్వాత, ఈ గది యోగా గదిగా మార్చబడింది, ఇది అధ్యాపకులకు మరియు విద్యార్థులకు యోగా సాధన కోసం ప్రయోజనం చేకూరుస్తుంది.

 

***



(Release ID: 1976893) Visitor Counter : 46