సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రసార సేవల (నియంత్రణ) బిల్లు, 2023 ను రూపొందించిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
Posted On:
10 NOV 2023 5:10PM by PIB Hyderabad
*మొత్తం ప్రసార రంగానికి ఏకీకృత చట్టపరమైన వ్యవస్థ
* ప్రోగ్రామ్ కోడ్, అడ్వర్టైజ్‌మెంట్ కోడ్ అమలు జరిగేలా చూసేందుకు ప్రసార సమీక్ష కమిటీలు
* ప్రస్తుతం పనిచేస్తున్న ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కమిటీ ఏర్పాటు
*ఆర్థిక సామర్థ్యం ఆధారంగా జరిమానా విధింపు
* దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా ప్రసారాలు
...
ప్రసార సేవల (నియంత్రణ) బిల్లు, 2023 పై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈరోజు సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఆహ్వానించింది.దేశంలో కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్‌ల (నియంత్రణ) చట్టం 1995 మూడు దశాబ్దాలుగా అమలులో ఉంది కేబుల్ నెట్‌వర్క్‌లతో సహా ఇతర ప్రసార సాధనాల ద్వారా నిరంతరం ప్రసారం అవుతున్న కార్యక్రమాల నాణ్యతను పర్యవేక్షించే ప్రాథమిక చట్టంగా కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్‌ల (నియంత్రణ) చట్టం పనిచేస్తుంది. ఇటీవల కాలంలో ప్రసార రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సాంకేతిక అభివృద్ధితో డిటిహెచ్,ఐపీటీవీ,ఓటిటీ లాంటి అనేక సమగ్ర మార్గాల ద్వారా కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి.
ప్రసార రంగం ముఖ్యంగా కేబుల్ టీవీలో డిజిటల్ ప్రసారాలు ఎక్కువ కావడంతో కార్యక్రమాలను క్రమబద్దీకరించడానికి నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. వ్యాపారాన్ని సులభతరం చేయడం, ప్రోగ్రామ్ కోడ్, అడ్వర్టైజ్‌మెంట్ కోడ్‌కు కట్టుబడి ప్రసార, పంపిణీ వ్యవస్థలు ఆపరేటర్‌ల ద్వారా కార్యక్రమాలు ప్రసారం చేసేలా చూసేందుకు నియంత్రణ వ్యవస్థ పనిచేస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న నియంత్రణ వ్యవస్థ స్థానంలో సమగ్ర చట్ట నిబంధనలతో నూతన నియంత్రణ వ్యవస్థ అమలులోకి రావాల్సిన అవసరం ఉంది.
మారిన అవసరాలు, ప్రసార రంగంలో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని ముసాయిదా బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ (నియంత్రణ) బిల్లు, 2023ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. దేశంలో ప్రసార సేవలను నియంత్రించేందుకు, ప్రస్తుతం అమలులో ఉన్న కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ (నియంత్రణ) చట్టం, 1995 స్థానంలో నూతన చట్టాన్ని తీసుకురావడానికి ప్రస్తుతం దేశంలో ప్రసార రంగాన్ని నియంత్రించడానికి అమలు చేస్తున్న ఇతర విధాన మార్గదర్శకాల స్థానంలో కొత్త మార్గదర్శకాలు తీసుకురావడానికి ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు. .
నియంత్రణ ప్రక్రియలను బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ (నియంత్రణ) బిల్లు క్రమబద్ధీకరిస్తుంది, ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్, డిజిటల్ వార్తల ప్రసారం బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ (నియంత్రణ) బిల్లు పరిధిలోకి వస్తాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అంశాలు, సాంకేతిక అంశాలకు వర్తించే నిబంధనలను బిల్లులో పొందుపరిచారు. కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీలు, స్వీయ నియంత్రణ కోసం బ్రాడ్‌కాస్ట్ అడ్వైజరీ కౌన్సిల్, వివిధ నెట్‌వర్క్ ఆపరేటర్ల కోసం విభిన్న కరీరాక్రమాలు, అడ్వర్టైజ్‌మెంట్ కోడ్, వైకల్యాలున్న వ్యక్తుల కోసం కార్యక్రమాల ప్రసారం, చట్టబద్ధమైన జరిమానాలు లాంటి వివిధ అంశాలను బిల్లులో పొందుపరిచారు. చర్యలు మరియు మొదలైనవాటిని అందించడానికి ప్రయత్నిస్తుంది.
బిల్లు లో ఆరు అధ్యాయాలు, 48 సెక్షన్లు, మూడు షెడ్యూళ్లు ఉన్నాయి.
ముఖ్య ముఖ్యాంశాలు:
1.మదింపు , ఆధునీకరణ: వివిధ ప్రసార కార్యక్రమాలను ఒకే విధమైన చట్ట వ్యవస్థ కిందకి తీసుకురావడం, నియంత్రించడానికి బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ (నియంత్రణ) బిల్లు అవకాశం కల్పిస్తుంది.నియంత్రణపెండింగ్ లో ఉన్న ఏకీకృత నిబంధనల, నవీకరణ అంశాలు అమల్లోకి వస్తాయి. నియంత్రణ ప్రక్రియను బిల్లు క్రమబద్ధీకరిస్తుంది,. మరింత సమర్థవంతంగా, సమకాలీనంగా అమలు అవుతుంది. ఐటీ చట్టం, 2000 చట్టం క్రింద రూపొందించిన నిబంధనలు పరిధిలో పనిచేస్తున్న ఓవర్-ది-టాప్ (OTT) ప్రసారాలు, డిజిటల్ వార్తలు మరియు ప్రస్తుత వ్యవహారాలు నూతన బిల్లు పరిధిలోకి వస్తాయి.
2. సమకాలీన నిర్వచనాలు,భవిష్యత్తు-సన్నద్ధమైన నిబంధనలు: అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు మరియు సేవలకు అనుగుణంగా, బిల్లు సమకాలీన ప్రసార నిబంధనలకు సమగ్ర నిర్వచనాలను పరిచయం చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న ప్రసార సాంకేతిక అంశాలకు సంబంధించిన నిబంధనలను కలిగి ఉంటుంది.
3. స్వీయ నియంత్రణ ప్రాధాన్యత : బిల్లులో ప్రతిపాదించిన 'కంటెంట్ మూల్యాంకన కమిటీ ఏర్పాటు వల్ల స్వీయ-నియంత్రణ సాధ్యమవుతుంది. ఇప్పటికే ఉన్న ఇంటర్-డిపార్ట్‌మెంటల్ కమిటీని మరింత భాగస్వామ్య విస్తృత 'ప్రసార సలహా మండలి'గా పని చేస్తుంది.
4. విభిన్న ప్రోగ్రామ్ కోడ్, అడ్వర్టైజ్‌మెంట్ కోడ్: విభిన్న ప్రోగ్రామ్ కోడ్, అడ్వర్టైజ్‌మెంట్ కోడ్ వల్ల కార్యక్రమాలు,ప్రకటనలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. పరిమిత పరిధి గల ప్రసారాలపై స్వీయ నియంత్రణ అమలు చేయడానికి ప్రసారకర్తలకు అవకాశం కలుగుతుంది..
5. దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా ప్రసారాలు : నిబంధనల ప్రకారం దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా ప్రసారాలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల దివ్యాంగుల నిర్దిష్ట అవసరాలను బిల్లు పరిష్కరిస్తుంది.
6. చట్టబద్ధమైన జరిమానాలు : ముసాయిదా బిల్లు చట్టబద్ధమైన జరిమానాలను ప్రవేశపెడుతుంది: నేర తీవ్రత ఆధారంగా ఆపరేటర్లు , ప్రసారకర్తలకు సలహా, హెచ్చరిక, నిందలు లేదా ద్రవ్య జరిమానాలు. జైలు శిక్ష మరియు/లేదా జరిమానాల కోసం నిబంధన పొందుపరిచారు. దీనివల్ల నియంత్రణకు సమతుల్య విధానం అమలు అవుతుంది.
7. సరిపోయే జరిమానాలు : సంస్థ ఆర్థిక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జరిమానా విధిస్తారు. జరిమానా విధించడానికి పెట్టుబడి, టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
8. మౌలిక సదుపాయాల ఉమ్మడి వినియోగం, ప్లాట్‌ఫారమ్ సర్వీసెస్ రైట్ ఆఫ్ వే: బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్ ఆపరేటర్‌ల మధ్య మౌలిక సదుపాయాల వినియోగం, ప్లాట్‌ఫారమ్ సేవల క్యారేజీకి సంబంధించిన నిబంధనలను కూడా బిల్లు కలిగి ఉంది. పునరావాసం, మార్పులను మరింత సమర్ధవంతంగా పరిష్కరించడానికి రైట్ ఆఫ్ వే విభాగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. నిర్మాణాత్మక వివాద పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది.
దేశంలో పారదర్శకత, స్వీయ నియంత్రణ ,భవిష్యత్-సన్నద్ధమైన ప్రసార సేవలు అందుబాటులోకి తేవడం లక్ష్యంగా ముసాయిదా బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ (నియంత్రణ) బిల్లు, 2023 కు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ రూపకల్పన చేసింది.
ముసాయిదా బిల్లుపై మంత్రిత్వ శాఖ నిపుణులు, ప్రసార సేవలు అందిస్తున్న సంస్థలు సాధారణ ప్రజలతో సహా సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు, సూచనలు ఆహ్వానించింది. ఈ పత్రికా ప్రకటన తేదీ నుంచి 30 రోజులలోపు jsb-moib[at]gov[dot]in ఇమెయిల్‌లో వ్యాఖ్యలు, అభిప్రాయాలు పంపవచ్చు.
ప్రతిపాదిత బిల్లు https://mib.gov.in/sites/default/files/Public%20Notice_0.pdf లింక్‌లో అందుబాటులో ఉంది
****
(Release ID: 1976448)
Visitor Counter : 197
Read this release in:
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam