ప్రధాన మంత్రి కార్యాలయం
ఎఫ్ఐడిఇ గ్రాండ్ స్విస్ ఓపెన్ లో అగ్ర స్థానాన్నిచేజిక్కించుకొన్న భారతదేశం
శ్రీ విదిత్ గుజరాతీ ని మరియు వైశాలీ గారి ని వారు సాధించిన అసాధారణమైన గెలుపున కు గాను అభినందించినప్రధాన మంత్రి
Posted On:
06 NOV 2023 8:23PM by PIB Hyderabad
ఎఫ్ఐడిఇ (‘ఫిడే’) గ్రాండ్ స్విస్ ఓపెన్ లో శ్రీ విదిత్ గుజరాతీ మరియు వైశాలీ గారు లు సాధించిన అసాధారణమైన గెలుపుల కు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారి ని ప్రశంసించారు.
టోరొంటో లో 2024 లో జరిగే కేండిడేట్స్ టూర్నామెంట్ కోసం కూడ ఈ ఇద్దరు క్రీడాకారులు అర్హత ను సంపాదించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘ఫిడే గ్రాండ్ స్విస్ ఓపెన్ ఆటల పోటీ లో అగ్ర స్థానాన్ని భారతదేశం చేజిక్కించుకోవడం తో ఇది ఒక అంతులేని గర్వకారకమైన క్షణం అని చెప్పాలి. శ్రీ@viditchess కు మరియు @chessVaishali గారికి వారి శ్రేష్ఠమైన గెలుపు నకు మరియు టోరంటో లో జరుగనున్న ప్రతిష్టాత్మక 2024 కేండిడేట్స్ ఆటల పోటీ లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకొన్నందుకు గాను ఇవే అభినందన లు. చదరంగం లో భారతీయ కౌశలాని కి మరొక ఉదాహరణ గా ఇది ఉంది. భారతదేశం నిజం గా ఎంతో ఉత్సాహపడుతోంది.’’ అని పేర్కొన్నారు.
********
DS/ST
(Release ID: 1975364)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam