రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి సందర్భంగా లక్నోలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నాయకత్వంలో ఐక్యతా పరుగు


భారతదేశ ఐక్యత, సమగ్రతకు జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలి.. శ్రీ రాజ్‌నాథ్ సింగ్

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించి మేరా యువ భారత్ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గోవాలి.. శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పిలుపు

Posted On: 31 OCT 2023 12:18PM by PIB Hyderabad

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నాయకత్వంలో  ఐక్యతా పరుగు నిర్వహించింది. 2023 అక్టోబర్ 31న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్ హజ్రత్‌గంజ్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రతిమ నుంచి 1.5 కిలోమీటర్ల మేర జరిగిన ఐక్యతా పరుగును జెండా ఊపి ప్రారంభించారు.కేడీ  సింగ్ బాబు స్టేడియం వరకు సాగిన పరుగులో  పాఠశాల విద్యార్థులు, ఎన్‌సిసి క్యాడెట్లు, క్రీడాకారులు, ఔత్సాహికులు, హెచ్‌ఏఎల్ సిబ్బందితో సహా వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన వారితో  ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ స్వాతంత్య్రానికి, దేశ నిర్మాణానికి దోహదపడిన వారిని స్మరించుకోవడానికి  జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని  అన్నారు.  'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' నిర్మాణానికి కృషి చేయడానికి ప్రజలకు జాతీయ ఐక్యతా దినోత్సవం అవకాశం కల్పిస్తుందని   ఆయన అన్నారు.

స్వాతంత్య్రానంతరం దేశ నిర్మాణంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్  పోషించిన పాత్రను రక్షణ శాఖ మంత్రి వివరించారు. స్వతంత్ర భారతదేశంలో  రాచరిక రాష్ట్రాలను విలీనం చేయడంలో పటేల్  దృఢ సంకల్పంతో పనిచేశారని అన్నారు. విలీన సమయంలో సర్దార్ పటేల్ అబ్దుతమైన  దౌత్య నైపుణ్యాలు ప్రదర్శించారని తెలిపిన శ్రీ శ్రీ రాజ్‌నాథ్ సింగ్ భారత సివిల్ సర్వీసెస్ వ్యవస్థ నిర్మాణం  వంటి ఇతర అంశాల్లో కీలక పాత్ర పోషించారని అన్నారు.  . “సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి భారతదేశ ఐక్యత, సమగ్రతను నిర్ధారించింది. 2014లో శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన  ప్రభుత్వం పటేల్  జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది." అని మంత్రి అన్నారు. 

  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించి మేరా యువ భారత్ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గోవాలని యువతకు   శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పిలుపు ఇచ్చారు.  ‘మేరా యువ భారత్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొని దేశాభివృద్ధికి యువత తమ వంతు కృషి చేయాలని అన్నారు. జాతీయ సమగ్రత,ఐక్యత కోసం కృషి చేయాలని అన్నారు. 

గుజరాత్‌లోని కెవాడియాలో ప్రపంచంలోనే అతిపెద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ ని నెలకొల్పిన  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని రక్షణ శాఖ మంత్రి అభినందించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ భారతదేశ ఐక్యతకు ప్రతీక అని, జాతీయ సమైక్యత సందేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన కృషి యువతకు స్ఫూర్తిదాయకం అని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్  అన్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య & శ్రీ బ్రజేష్ పాఠక్, ఉత్తరప్రదేశ్  మంత్రులు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్  చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సిబి  అనంతకృష్ణన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సిబ్బంది,  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఇతర అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.

రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న రక్షణ ఉత్పత్తి, పరిశోధన అభివృద్ధి సంస్థలు,, డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ), ఇండియన్ కోస్ట్ గార్డ్ , డైరెక్టరేట్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్‌లోని వివిధ విభాగాలు ' రన్ ఫర్ యూనిటీ' , జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా 160కి పైగా ప్రదేశాలలో 'రాష్ట్రీయ ఏక్తా దివస్' ప్రతిజ్ఞ ను నిర్వహించాయి. 

 

***



(Release ID: 1973592) Visitor Counter : 187