ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రపంచ ఆరోగ్య సంస్థ 76వ ఆగ్నేయ ఆసియా కమిటీ ప్రాంతీయ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య శాఖ డాక్టర్ మాండవీయ
ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సంరక్షణ అందించాలనే లక్ష్యంతో సమగ్ర సంపూర్ణ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం భారతదేశంలో అమలు జరుగుతోంది.. డాక్టర్ మాండవీయ
“ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ల ద్వారా 200 కోట్ల మందికి ఆరోగ్య సంరక్షణ.. డాక్టర్ మాండవీయ
183 కోట్ల మందికి ఉచిత ఔషధాలు సరఫరా .. డాక్టర్ మాండవీయ
87 కోట్లకు పైబడి రోగనిర్ధారణ సేవలు .. కేంద్ర మంత్రి
"ఎబి-హెచ్‌డబ్ల్యుసి కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అమలు చేస్తున్న విధానం వల్ల వైద్యం కోసం ప్రజలు చేస్తున్న ఖర్చు తగ్గి ఇతర దేశాలకు ఆదర్శంగా మారుతుంది".. డాక్టర్ మాండవీయ
Posted On:
30 OCT 2023 1:10PM by PIB Hyderabad
ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 76వ ఆగ్నేయ ఆసియా కమిటీ ప్రాంతీయ కమిటీ సమావేశంలో ఈ రోజు కేంద్ర ఆరోగ్య శాఖ డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. డాక్టర్ మాండవీయ తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 76వ సెషన్‌కు ఛైర్‌పర్సన్‌గా డాక్టర్ మాండవీయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ కార్యాలయం డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్, మాల్దీవులు ఆరోగ్య శాఖ మంత్రి అహ్మద్ నసీమ్, తైమూర్ లెస్టే ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ఎలియా ఆంటోనియో డి అరౌజో డోస్ రీస్ అమరల్, శ్రీలంక ఆరోగ్య మంత్రి డాక్టర్ సీతా ఆరంబెపోలా, నేపాల్ ఆరోగ్య మంత్రి శ్రీ మోహన్ బహదూర్ బాస్నెట్, భారతదేశంలో డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి చో హుయ్ చోల్, బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రి జాహిద్ మాలిక్, , ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పొంగ్‌సాధోర్న్ పోక్‌పెర్మ్‌డీ, భూటాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాత్కాలిక కార్యదర్శి శ్రీ పెంబా వాంగ్‌చుక్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ మాండవీయ తెలిపారు. "ఆరోగ్యమే అత్యంత విలువైన సంపద.ఆరోగ్యంతో ఉంటే ఈ పనిని అయినా సులభంగా పూర్తి చేయవచ్చు" అని డాక్టర్ మాండవీయ అన్నారు. ప్రతి పనిని సాధించవచ్చు" అని పేర్కొన్నారు. " ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సంరక్షణ అందించాలనే లక్ష్యంతో సమగ్ర సంపూర్ణ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం భారతదేశంలో అమలు జరుగుతోంది. ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి భారతదేశం ప్రాధాన్యత ఇస్తోంది. సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సంరక్షణ అందించడానికి సమగ్ర సంపూర్ణ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ దేశంలో అమలు జరుగుతోంది" అని మంత్రి వివరించారు.
సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల (AB-HWC) పురోగతిని మంత్రి వివరించారు. . "అక్టోబర్ 24, 2023 నాటికి, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ను 211 కోట్లకు పైగా ప్రజలు సందర్శించారు. 183 కోట్లకు పైబడి ఉచిత ఔషధాలు సరఫరా అయ్యాయి.87 కోట్ల వరకు వైద్య పరీక్షలు జరిగాయి" అని డాక్టర్ మాండవీయ వివరించారు. న్ల కంటే ఎక్కువ సార్లు రోగనిర్ధారణ సేవలను పొందుతున్న వ్యక్తులతో ప్రభావం ప్రతిధ్వనిస్తోంది”. ప్రభుత్వం నిర్వహించిన 26 కోట్ల ఆరోగ్య సంరక్షణ శిబిరాల ద్వారా దాదాపు 36 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందారని మంత్రి తెలిపారు. న్ల
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ,ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సాడు[పాయల కల్పన మిషన్ వంటి కార్యక్రమాలు డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి మౌలిక సదుపాయాలను గణనీయంగా బలోపేతం చేశాయని మంత్రి తెలిపారు. , దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు. సంపూర్ణ సమగ్ర ఆరోగ్య విధానాన్ని అమలు చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా సేవలు అందించే కార్యక్రమంపై ప్రభుత్వం దృష్టి సారించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు.
న్యూ ఢిల్లీలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంగణంలో డాక్టర్ మాండవీయ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఆగ్నేయ ఆసియా ప్రాంత దేశ ప్రజలకు సంపూర్ణ సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న కృషికి భారతదేశం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణానికి భారతదేశం 239.5 కోట్ల రూపాయలు అందిస్తుందని ఆయన చెప్పారు. ప్రాంతీయ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడం, ఉత్తమ విధానాలను పంచుకోవడం, వినూత్న పరష్కార మార్గాలను అభివృద్ధి చేయడం కోసం ఆరోగ్య నిపుణుల మధ్య సహకారం, పరిశోధన, జ్ఞాన మార్పిడి కోసం భారతదేశం కేంద్రంగా కార్యక్రమాలు అమలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది.
విజ్ఞాన భాగస్వామ్యాన్ని ఎక్కువ చేసి పరస్పర సహకారంతో సమస్యలు పరిష్కరించి ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలన్న భారతదేశం ప్రతిపాదనకు అనుగుణంగా సౌత్-ఈస్ట్ ఆసియా రీజినల్ ఫోరమ్ రూపుదిద్దుకుంది అని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ సుధాన్ష్ పంత్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందించే అంశంలో సభ్యదేశాలు సాధించిన పురోగతి పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు., "ప్రగతి పర్యవేక్షణ, జవాబుదారీతనం కోసం సామర్థ్యాలను పెంపొందించడం, పట్టణ ఆరోగ్య సంరక్షణ ద్వారా వైద్య సేవలు కీలక రంగాలపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించడం అవసరం.ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో జాతీయ ఆరోగ్య వ్యవస్థ,ప్రాంతీయ స్థాయి ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధికి కృషి జరగాలి" అని ఆయన పేర్కొన్నారు.
వర్చువల్ విధానంలో మాట్లాడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ప్రపంచం, ఆగ్నేయ ఆసియా ప్రాంతం సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో 76వ సదస్సు జరుగుతోందని అన్నారు. ప్రపంచ జనాభాలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఆగ్నేయాసియా ప్రాంతంలో నివసిస్తున్నారని తెలిపిన డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ వ్యాధుల తీవ్రత కూడా ఎక్కువగా ఉందన్నారు. క్షయవ్యాధిని ఎదుర్కోవడానికి ఆగ్నేయ ఆసియా దేశాలు చేస్తున్న కృషిని ప్రశంసించిన డాక్టర్. టెడ్రోస్ 'అందరికీ ఆరోగ్యం' విధానం వల్ల ఫలితాలు వస్తాయని అన్నారు. ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 76వ సెషన్‌కు ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన డాక్టర్ మాండవీయను ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆగ్నేయాసియా ప్రాంతంలోని 11 సభ్య దేశాలు 7 ఉష్ణమండల వ్యాధులను నిర్మూలించాయని ఆయన తెలిపారు.
సభ్య దేశాలు సాధించిన పురోగతి పట్ల హర్షం వ్యక్తం చేసిన డాక్టర్ పూనమ్ 1,50,000 కంటే ఎక్కువ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లను నిర్వహించడంలో భారతదేశం సాధించిన విజయాన్ని ప్రశంసించారు.
కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ మనస్వి కుమార్, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
***
(Release ID: 1973221)
Visitor Counter : 91