ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాగేమ్స్‌ మహిళల ‘1500 మీ. టి-20’ విభాగంలో కాంస్యం సాధించిన పూజకు ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 28 OCT 2023 8:35PM by PIB Hyderabad

   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌ మహిళల ‘1500 మీటర్ల టి-20’ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత క్రీడాకారిణి పూజను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయంలో ఆమె చూపిన ప్రతిభ, పట్టుదలను ఆయన ప్రశంసించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారా గేమ్స్‌ మహిళల ‘1500 మీటర్ల టీ-20‘ విభాగంలో పూజ అత్యుత్తమ ప్రదర్శనతో కాంస్య పతకం సాధించిడం అద్భుతం! ఆమెకు నా హృదయపూర్వక అభినందనలు. ఆమె చూపిన ప్రతిభ, పట్టుదల ఈ అసాధారణ విజయానికి తోడ్పడ్డాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(Release ID: 1972832) Visitor Counter : 134