నాడు పోస్టు చేయడమైనది:
26 OCT 2023 9:10PM by PIB Hyderabad
ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘షాట్పుట్ ఎఫ్-55’లో కాంస్య పతకం గెలుచుకున్న ముత్తురాజాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. అతడి శక్తి, పట్టుదల ప్రపంచ వేదికపై భారత్ ప్రతిభను ప్రకాశింపజేశాయని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ పురుషుల ‘షాట్పుట్ ఎఫ్-55’లో అద్భుత ప్రతిభతో కాంస్యం సాధించిన ముత్తురాజాకు అభినందనలు. అతని శక్తి, పట్టుదల ప్రపంచ వేదికపై భారత్ ప్రతిభా ప్రదర్శనను ప్రతిబింబించాయి. ఇతర క్రీడాకారులు కూడా అసమాన రీతిలో రాణిస్తూ తమ కలలు నెరవేర్చుకునే విధంగా ఈ విజయం స్ఫూర్తినిస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.