ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారా ఆసియా క్రీడలు 2022లో పురుషుల - 60 కేజీల జే1 జూడో ఈవెంట్‌లో రజత పతకాన్ని సాధించిన కపిల్ పర్మార్ కు ప్రధాన మంత్రి అభినందనలు

प्रविष्टि तिथि: 23 OCT 2023 6:33PM by PIB Hyderabad

చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన పారా ఆసియా క్రీడలు-2022లో పురుషుల - 60 కేజీల జే1 జూడో ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న కపిల్ పర్మార్‌ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ సామజిక మాధ్యమంలో లో సందేశాన్ని పోస్ట్ చేశారు. 

“ఆసియా పారా గేమ్స్‌లో జూడోలో పురుషుల - 60 కేజీల జే1 విభాగంలో అద్భుతమైన రజతం సాధించినందుకు కపిల్ పర్మార్‌కు అభినందనలు. బరిలో అతని పట్టుదల, పరాక్రమం చూడదగినవి. ఆయన విజయాన్ని కొనసాగించాలని, భవిష్యత్తులో మరెన్నో ప్రశంసలు పొందాలని కోరుకుంటున్నాను! ” అని ప్రధానమంత్రి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 


(रिलीज़ आईडी: 1970882) आगंतुक पटल : 88
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil