ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రసిద్ధ క్రికెటర్ శ్రీ బిషన్ సింగ్ బేడీ మృతిపై ప్రధాని ప్రగాఢ సంతాపం
प्रविष्टि तिथि:
23 OCT 2023 5:21PM by PIB Hyderabad
ప్రముఖ క్రికెటర్ శ్రీ బిషన్ సింగ్ బేడీ కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ప్రసిద్ధ క్రికెటర్ శ్రీ బిషన్ సింగ్ బేడీ మరణవార్త నన్నెంతో కలచివేసింది. క్రికెట్‌పై ఆయన ప్రేమాభిమానాలు అపారం.. మైదానంలో అంకితభావం అచంచలం. అద్భుత బౌలింగ్‌తో భారతదేశానికి ఆయన ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించి ఆదర్శప్రాయంగా నిలిచారు. భవిష్యత్తరం క్రికెటర్లకు ఆయన సదా స్ఫూర్తిప్రదాతగా నిలిచిపోతారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతి... ఓం శాంతి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1970865)
आगंतुक पटल : 86
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam