సహకార మంత్రిత్వ శాఖ

‘సహకార ఎగుమతులపై జాతీయ సదస్సు’లో కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగిస్తారు.నేషనల్ కోఆపరేటివ్ ఫర్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్ సీ ఈ ఎల్) అక్టోబరు 23, సోమవారం న్యూఢిల్లీలో దీనిని నిర్వహించనుంది.


శ్రీ అమిత్ షా ఎన్ సీ ఈ ఎల్ యొక్క లోగో, వెబ్‌సైట్ మరియు బ్రోచర్‌ను కూడా ప్రారంభిస్తారు. ఎన్ సీ ఈ ఎల్ సభ్యులకు సభ్యత్వ ధృవీకరణ పత్రాలను పంపిణీ చేస్తారు.

ఎగుమతి మార్కెట్‌లకు అనుసంధానం కోసం సహకార సంఘాలను మాధ్యమం గా మార్చడం, భారతీయ వ్యవసాయ-ఎగుమతుల సంభావ్యత మరియు ఇతర సహకార సంఘాలకు ఉన్న అవకాశాలతో సహా విస్తృత శ్రేణి సమస్యలు ఈ సదస్సులో చర్చించబడతాయి.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మరియు సహకార మంత్రి యొక్క సమర్థ మార్గదర్శకత్వంలో, దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు సహకార మంత్రిత్వ శాఖ గత 27 నెలల్లో 54 కార్యక్రమాలు చేపట్టింది.

సహకార సంస్థల ద్వారా ఎగుమతిని ప్రోత్సహించడానికి జాతీయ స్థాయి సహకారాన్ని ఏర్పాటు చేయడం అటువంటి కార్యక్రమాలలో ఒకటి, ఇది "సహకార్ సే సమృద్ధి" యొక్క మోడీ ప్రభుత్వ దార్శనికతను సాకారం చేయడంలో ముఖ్యమైన దశ.

Posted On: 22 OCT 2023 1:52PM by PIB Hyderabad

నేషనల్ కోఆపరేటివ్ ఫర్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్ సీ ఈ ఎల్) అక్టోబరు 23, సోమవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ‘సహకార ఎగుమతులపై జాతీయ సదస్సు’లో కేంద్ర హోం  మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగిస్తారు. శ్రీ అమిత్ షా ఎన్ సీ ఈ ఎల్ యొక్క లోగో, వెబ్‌సైట్ మరియు బ్రోచర్‌ను కూడా ప్రారంభిస్తారు అలాగే ఎన్ సీ ఈ ఎల్ సభ్యులకు సభ్యత్వ ధృవీకరణ పత్రాలను పంపిణీ చేస్తారు. ఎగుమతి మార్కెట్లకు అనుసంధానం కోసం సహకార సంఘాలను మాధ్యమం గా చేయడం, భారతీయ వ్యవసాయ-ఎగుమతుల సంభావ్యత మరియు ఇతర సహకార సంఘాల అవకాశాలతో సహా విస్తృత శ్రేణి సమస్యలు సదస్సులో చర్చించబడతాయి.

 

సహకార రంగం ద్వారా ఎగుమతుల కోసం ఒక చత్ర సంస్థగా పనిచేయడానికి జాతీయ-స్థాయి బహుళ-రాష్ట్ర సహకార సంఘాన్ని స్థాపించాల్సిన అవసరాన్ని శ్రీ అమిత్ షా నొక్కిచెప్పిన తర్వాత ఎన్ సీ ఈ ఎల్ ఉనికిలోకి వచ్చింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మరియు సహకార మంత్రి యొక్క సమర్థ మార్గదర్శకత్వంలో, దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ గత 27 నెలల్లో 54 కార్యక్రమాలు చేపట్టింది. సహకార సంస్థల ద్వారా ఎగుమతిని ప్రోత్సహించడానికి జాతీయ స్థాయి సహకారాన్ని ఏర్పాటు చేయడం అటువంటి కార్యక్రమాలలో ఒకటి, ఇది "సహకార్ సే సమృద్ధి" యొక్క మోడీ ప్రభుత్వ దార్శనికతను సాకారం చేయడంలో ముఖ్యమైన దశ.

 

నేషనల్ కోఆపరేటివ్ ఫర్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ అనేది 25 జనవరి, 2023న బహుళ-రాష్ట్ర కో-ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 2002 కింద నమోదు చేయబడిన సహకార రంగ ఎగుమతుల కోసం కొత్తగా స్థాపించబడిన చత్ర సంస్థ.  2025 నాటికి ప్రస్తుతం ఉన్న రూ. 2,160 కోట్ల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో దాని పరిధిలో పెద్ద సంఖ్యలో సహకార సంఘాలు ఉన్నాయి.

 

ఎగుమతులపై ఆసక్తి ఉన్న ప్రాథమిక సహకార సంఘాల స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు అన్ని సహకార సంఘాలు రూ. 2,000 కోట్ల అధీకృత వాటా మూలధనాన్ని కలిగి ఉన్న ఎన్ సీ ఈ ఎల్ లో సభ్యత్వం పొందేందుకు అర్హులు. దేశం యొక్క భౌగోళిక పరిమితులను దాటి విస్తృత మార్కెట్‌లను అందుకోవడం  ద్వారా భారతీయ సహకార రంగంలో లభించే మిగులు ఉత్పత్తిని ఎగుమతి చేయడంపై దృష్టి పెట్టడం దీని లక్ష్యం.

 

సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి చేపట్టిన వివిధ కార్యక్రమాలపై సహకార మంత్రిత్వ శాఖ అధికారుల ప్రదర్శనతో సదస్సు ప్రారంభమవుతుంది. సదస్సు యొక్క రెండవ భాగంలో ఎగుమతి మార్కెట్‌లకు అనుసంధానం కోసం సహకార సంస్థలను మాధ్యమం గా మార్చడం, సంభావ్యత వంటి అనేక అంశాలపై సాంకేతిక సదస్సులు ఉంటాయి. భారతదేశ వ్యవసాయ ఎగుమతులు మరియు సహకార సంస్థలకు అవకాశాలు, భారతదేశాన్ని ప్రపంచంలోని పాల వేదిక గా మార్చడం మరియు సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రణాళిక వంటి సదస్సులు ఉంటాయి.

 

సహకార ఎగుమతిపై జాతీయ సదస్సు లో ఎన్ సీ ఈ ఎల్ యొక్క సహకార సభ్యులు, జాతీయ సహకార సమాఖ్యలతో సహా వివిధ సహకార రంగాల ప్రతినిధులు, వివిధ దేశాల రాయబార కార్యాలయాల ప్రతినిధులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సహా 1000 కంటే ఎక్కువ మంది పాల్గొంటారు. ఆన్‌లైన్ మోడ్ ద్వారా పెద్ద సంఖ్యలో సహకార సభ్యులు మరియు వాటాదారులు కూడా చేరతారు.

 

గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీ సి ఎం ఎం ఎఫ్  - అమూల్), ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ (ఇఫ్కో), క్రిషక్ భారతి కోఆపరేటివ్ (క్రిబ్కో) మరియు నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) మరియు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ సీ డీ సి) నాలుగు ప్రముఖ సహకార సంస్థలు సంయుక్తంగా ఎన్ సీ ఈ ఎల్ ని స్థాపించారు.

 

***



(Release ID: 1970009) Visitor Counter : 69