ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కాళరాత్రి మాతకు ప్రధానమంత్రి ప్రార్థనలు

प्रविष्टि तिथि: 21 OCT 2023 8:32AM by PIB Hyderabad

   నవరాత్రి వేడుకలలో భాగంగా మహాసప్తమి నేపథ్యంలో కాళరాత్రి మాతను ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు మహాసప్తమి తిథి నేపథ్యంలో దుష్టశక్తులను దునుమాడిన కాళరాత్రి మాత పాదాలకు శిరసాభివందనం చేస్తున్నాను. అన్ని బాధలనుంచీ విముక్తి ప్రసాదించే శుభఫలదాయని అయిన మాత ప్రతి ఒక్కరిపైనా కరుణా కటాక్షాలు కురిపించాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/RT
 


(रिलीज़ आईडी: 1969802) आगंतुक पटल : 132
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada