ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పోలీసు అమరుల సంస్మరణ దినం నేపథ్యంలో పోలీసుల నిరంతర అంకితభావానికి ప్రధానమంత్రి ప్రశంస

प्रविष्टि तिथि: 21 OCT 2023 8:22AM by PIB Hyderabad

   పోలీసు అమవీరుల సంస్కరణ దినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వారికి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“పోలీసు అమరుల సంస్మరణ దినం సందర్భంగా వారి నిరంతర అంకితభావాన్ని మనం ప్రశంసించి తీరాలి. అనేక సవాళ్లను ఎదుర్కొనడంలో పౌరుల భద్రతకు హామీ ఇస్తూ మార్గనిర్దేశం చేస్తున్న పోలీసు సిబ్బంది సమాజానికి మూలస్తంభాలుగా నిలుస్తున్నారు. కర్తవ్య నిర్వహణలో భాగంగా వారు అచంచల నిబద్ధతతో అందిస్తున్న సేవలు ధీరోదాత్త స్ఫూర్తికి ప్రతీకలు. విధి నిర్వహణలో ప్రాణత్యాగానికి సైతం వెరవని వారి సాహసానికి నా నివాళి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS


(रिलीज़ आईडी: 1969801) आगंतुक पटल : 152
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam