ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం లో తొలిరీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) ను అక్టోబరు 20 వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ ఆర్ఆర్ టిఎస్ కారిడార్ లో ప్రాధాన్యంకలిగిన భాగాన్ని ప్రధాన మంత్రిప్రారంభిస్తారు; సాహిబాబాద్ ను దుహాయి డిపో తో కలిపే రేపిడ్ ఎక్స్ రైలు కు కూడా ఆయన పచ్చజెండాను చూపుతారు

దేశం లో అభివృద్ధి పరుస్తున్నటువంటి ఆర్ఆర్ టిఎస్ ఒక అత్యంతఆధునిక  ప్రాంతీయ గతిశీల పరిష్కారం అనిచెప్పాలి; ప్రపంచం లో అత్యుత్తమమైన వ్యవస్థల తో దీనినిపోల్చవచ్చును

ఆర్ఆర్ టిఎస్ ను అభివృద్ధి పరచడం వల్ల ఆర్థికకార్యకలాపాలు పెరుగుతాయి; ఉపాధి కి, విద్య కు మరియుఆరోగ్య సంరక్షణ రంగాల లో అవకాశాలు మెరుగవుతాయి; అంతేకాకుండా, వాయు కాలుష్యం లో చెప్పుకోదగినంత గా తగ్గింపు కూడా ఉంటుంది

పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాను కు అనుగుణం గా, ఆర్ఆర్ టిఎస్ నెట్ వర్క్ లో  రైల్ వే స్టేశన్ లు, మెట్రో స్టేశన్ లు, బస్సు సర్వీసు లు మొదలైనటువంటివాటి ని కలుపుకొని విస్తృతమైన మల్టి మాడల్ కనెక్టివిటి కి అవకాశాలు ఉంటాయి

బెంగళూరు మెట్రో లో భాగం అయిన ఈస్ట్ వెస్ట్ కారిడార్తాలూకు రెండు లైనుల ను దేశ ప్రజల కు అంకితం చేయనున్న ప్రధాన మంత్రి

Posted On: 18 OCT 2023 4:23PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 20 వ తేదీ నాడు ఉదయం పూట దాదాపు గా 11గంటల 15 నిమిషాల కు ఉత్తర్ ప్రదేశ్ లోని సాహిబాబాద్ రేపిడ్ ఎక్స్ స్టేశన్ లో దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ ఆర్ఆర్ టిఎస్ కారిడార్ లో ప్రాధాన్యం కలిగివున్నటువంటి భాగాన్ని ప్రారంభించనున్నారు. భారతదేశం లో రీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) యొక్క ప్రారంభాన్ని సూచించేటటువంటి రాపిడ్ ఎక్స్ ట్రేన్ సర్వాసు కు కూడా పచ్చజెండా ను చూపుతారు. ఈ రైలు సాహిబాబాద్ ను దుహాయీ డిపో తో కలుపుతుంది. మధ్యాహ్నం సుమారు 12 గంటల వేళ కు ప్రధాన మంత్రి సాహిబాబాద్ లో ఒక సార్వజనిక కార్యక్రమాని కి అధ్యక్షత వహించనున్నారు. దేశం లో ఆర్ఆర్ టిఎస్ ను ప్రవేశపెట్టిన సందర్భం లో సార్వజనిక సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. దీనికి అదనం గా, ఆయన బెంగళూరు మెట్రో లో భాగం అయినటువంటి ఈస్ట్ వెస్ట్ కారిడార్ లో విస్తరణ జరిగిన రెండు లైనుల ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు.

 

దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ ఆర్ఆర్ టిఎస్ కారిడార్

దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ ఆర్ఆర్ టిఎస్ కారిడార్ లో 17 కిలో మీటర్ ల పొడవు కలిగిన ప్రాయారిటి లైను ను ప్రారంభించడం జరుగుతుంది. ఇది సాహిబాబాద్ ను దుహాయీ డిపో తో కలుపుతుంది. ఈ మార్గం లో గాజియాబాద్, గుల్ ధర్ మరియు దుహాయి స్టేశన్ లు ఉంటాయి. దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ కారిడార్ కు 2019 మార్చి నెల 8 వ తేదీ నాడు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.

 

 

  • శ్రేణి రవాణా సంబంధి నూతన మౌలిక సదుపాయాల నిర్మాణం ద్వారా దేశం లో ప్రాంతీయ సంధానం రూపు రేఖల ను మార్చాలన్న ప్రధాన మంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా, రీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) ప్రాజెక్టు ను అభివృద్ధి పరచడం జరుగుతున్నది. ఈ ఆర్ఆర్ టిఎస్ అనేది కొత్త రైలు-ఆధారిత, సెమీ-హై-స్పీడ్, హై-ఫ్రీక్వెన్సీ కమ్యూటర్ ట్రాన్సిట్ సిస్టమ్ అని చెప్పవచ్చు. గంట కు 180 కిలో మీటర్ ల వేగం తో ప్రయాణించడాని కి అనువుగా రూపొందించిన ఆర్ఆర్ టిఎస్ ఒక పరివర్తన పూర్వకమైనటువంటి ప్రాంతీయ అభివృద్ధిశీల కార్యక్రమం గా ఉన్నది. దీనిని ప్రతి 15 నిమిషాల కు ఇంటర్ సిటీ ప్రయాణం కోసమని అధిక వేగవంతమైన రైళ్ళ ను అందించడం కోసం రూపుదిద్దడమైంది. దీనిలో అవసరాల ను బట్టి రైళ్ల ఫ్రీక్వెన్సీ ని ప్రతి 5 నిమిషాల కు ప్రవేశపెట్టే వెసులుబాటు సైతం ఉంటుంది.

 

 

  • సిఆర్ లో అభివృద్ధి కై మొత్తం 8 ఆర్ఆర్ టిఎస్ కారిడార్ లను గుర్తించడమైంది. వాటిలో మూడు కారిడార్ ల ను ఒకటో దశ లో అమలు పరచాలని ప్రాధాన్యాన్ని ఇవ్వడమైంది. వీటిలో దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ కారిడార్; దిల్లీ-గురుగ్రామ్-ఎస్ బి-అల్ వర్ కారిడార్ లతో పాటు దిల్లీ-పానీపత్ కారిడార్ లు ఉన్నాయి. దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ ఆర్ఆర్ టిఎస్ ను 30,000 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో అభివృద్ధి చేయడం జరుగుతున్నది. ఇది గాజియాబాద్, మురాద్ నగర్ మరియు మోదీనగర్ పట్టణ కేంద్రాల మీదు గా పోతూ ఒక గంట కంటే తక్కువ ప్రయాణ కాలం లో దిల్లీ ని మేరఠ్ తో కలుపుతుంది.

 

 

ఆర్ఆర్ టిఎస్ ను అత్యాధునికమైన రీజనల్ మొబిలిటీ సాల్యూశన్ గా దేశం లో అభివృద్ధి పరచడం జరుగుతున్నది. మరి ఇది ప్రపంచం లో సర్వశ్రేష్ఠమైన వ్యవస్థల కు తులతూగ నుంది. ఇది దేశం లో సురక్షితమైనటువంటి, విశ్వసనీయమైనటువంటి మరియు ఆధునికమైనటువంటి ఇంటర్ సిటీ కమ్యూటింగ్ సాల్యూశన్స్ ను అందుబాటు లోకి తీసుకు రానుంది. పిఎమ్ గతి శక్తి నేశనల్ మాస్టర్ ప్లాన్ కు అనుగుణం గా, ఆర్ఆర్ టిఎస్ నెట్ వర్క్ లో రైల్ వే స్టేశన్ లు, మెట్రో స్టేశన్ లు, బస్సు సర్వీసు లు మొదలైనటువంటి వాటి ని కలుపుకొని విస్తృతమైన మల్టి మాడల్ కనెక్టివిటి కి అవకాశాలు ఉంటాయి. ఈ తరహా పరివర్తన పూర్వకమైన ప్రాంతీయ గతిశీల ఉపాయాలు ఆ ప్రాంతం లో ఆర్థిక కార్యకలాపాల ను ప్రోత్సహించనున్నాయి; ఉపాధి, విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల లో అవకాశాలు అందుబాటు లోకి రావడాన్ని ఈ వ్యవస్థ మెరుగు పరచనుంది; అలాగే, వాహనాల సంబంధి రద్దీని మరియు వాయు కాలుష్యాన్ని చాలావరకు తగ్గించడం లో సహాయకారి కానుంది.

 

 

బెంగళూరు మెట్రో

బైయప్పనహళ్ళి ని కృష్ణరాజపుర తో, కెంగేరీ ని చల్లఘట్ట తో కలిపే రెండు మెట్రో మార్గాలను ప్రధాన మంత్రి దేశ ప్రజల కు ఆధికారికం గా అంకితం చేయనున్నారు. ఆధికారిక ప్రారంభోత్సవానికై వేచి ఉండకుండానే ఈ రెండు మెట్రో మార్గాల ను సార్వజనిక సేవ కై 2023 అక్టోబరు 9 వ తేదీ నుండి తెరవడం జరిగింది.

 

 

***



(Release ID: 1968945) Visitor Counter : 188