ప్రధాన మంత్రి కార్యాలయం
గాజా లో అల్ అహ్లీ ఆసుపత్రి లో పెద్ద సంఖ్య లో పౌరులు మరణించినందుకు దు:ఖాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
18 OCT 2023 1:48PM by PIB Hyderabad
గాజా లో అల్ అహ్ లీ ఆసుపత్రి లో పౌరులు పెద్ద సంఖ్య లో చనిపోయిన ఘటన జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా పునఃస్వస్థులు అవ్వాలని ప్రార్థించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని పోస్ట్ చేస్తూ, అందులో -
‘‘గాజా లో అల్ అహ్ లీ ఆసుప్రతి లో శోచనీయమైన రీతి న ప్రాణనష్టం జరిగిందని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి కి లోనయ్యాను. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల వారి కి ఇదే ప్రగాఢ సంతాపం. గాయపడ్డ వ్యక్తులు త్వరగా పునఃస్వస్థులు అవ్వాలని ప్రార్థిస్తున్నాం.
ప్రస్తుత సంఘర్షణ లో పౌరులు హతులు కావడమో, క్షతగాత్రులు కావడమో జరిగిన ఘటన లు చాలా గంభీరమైనటువంటివి గాను, నిరంతరం ఆందోళనను కలిగించేటటువంటివిగాను ఉన్నాయి. ఈ ఘటన తో ప్రమేయం ఉన్న వారిని బాధ్యుల ను చేసే తీరాలి.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1968933)
आगंतुक पटल : 125
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam