హోం మంత్రిత్వ శాఖ

తన లోక్‌సభ నియోజకవర్గం గాంధీనగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలను గేమింగ్ జోన్‌కు తీసుకెళ్లిన కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా


ఎంపీగా నా లోక్‌సభ నియోజకవర్గంలోని అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలకు సంపన్న కుటుంబాల పిల్లలకు అందే అన్ని సౌకర్యాలు, సంతోషాలు అందేలా చూడాలనేదే నా ప్రయత్నం

ఇందుకోసం వారికి మంచి విద్య, పౌష్టికాహారంతోపాటు ఆటవస్తువుల పంపిణీ, గేమింగ్ జోన్లకు తీసుకెళ్లి వినోదం పంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నాను.

పిల్లల ఈ ఆనందం మరియు ఉత్సాహాన్ని చూసి నేను చాలా ఆనందపడ్డాను

Posted On: 14 OCT 2023 5:18PM by PIB Hyderabad

కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు తన లోక్‌సభ నియోజకవర్గం గాంధీనగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలను గేమింగ్ జోన్‌కు తీసుకెళ్లారు. దీనిపై సామాజిక మధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన శ్రీ అమిత్ షా “ఈరోజు నా లోక్‌సభ నియోజకవర్గంలోని అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలను గేమింగ్ జోన్‌కి తీసుకెళ్లాను. పిల్లలు తమకు ఇష్టమైన ఆటలను ఆడుతూ ఆనందించారు”. అని తెలిపారు.

కేంద్ర హోం మరియు సహకార మంత్రి మాట్లాడుతూ “ఒక ఎంపీగా నా లోక్‌సభ నియోజకవర్గంలోని అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలకు సంపన్న కుటుంబాల పిల్లలకు లభించే అన్ని సౌకర్యాలు మరియు ఆనందాన్ని అందజేయడం నా ప్రయత్నం. ఇందుకోసం వారికి మంచి విద్య, పౌష్టికాహారంతోపాటు ఆటవస్తువుల పంపిణీ, గేమింగ్ జోన్లకు తీసుకెళ్లి వినోదం పంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నాను. పిల్లల ఈ ఆనందం మరియు ఉత్సాహాన్ని చూసి నేను చాలా ఆనందపడ్డాను." అని తెలిపారు.

 

***(Release ID: 1967955) Visitor Counter : 50