ప్రధాన మంత్రి కార్యాలయం

తొమ్మిదో జి20 పార్లమెంటరీ స్పీకర్స్ సమిట్ (పి20) ని అక్టోబరు 13 వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

Posted On: 12 OCT 2023 11:23AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తొమ్మిదో జి20 పార్లమెంటరీ స్పీకర్స్ సమిట్ (పి20) ని 2023 అక్టోబరు 13 వ తేదీ నాడు ఉదయం పూట సుమారు 11 గంటల వేళ లో న్యూ ఢిల్లీ లోని యశోభూమి లో ప్రారంభించనున్నారు. భారతదేశం జి20 కి భారతదేశం అధ్యక్షత ను వహిస్తూ ఉండగా భారతదేశం పార్లమెంటు ఈ శిఖర సమ్మేళనాన్ని ఏర్పాటు చేసింది.

 

 

జి20 కి భారతదేశం అధ్యక్షత వహిస్తూ ఉన్న తరుణం లో ఎంచుకొన్న ఇతివృత్తానికి అనుగుణం గా ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు లకై పార్లమెంటు’’ అనేది తొమ్మిదో పి20 సమిట్ తాలూకు ఇతివృత్తం గా ఉంది. ఈ కార్యక్రమం లో జి20 సభ్యత్వ దేశాల మరియు ఆహ్వానిత దేశాల పార్లమెంటు ల స్పీకర్ లు పాలుపంచుకోనున్నారు. 2023 సెప్టెంబరు 9 వ -10 వ తేదీ లలో జరిగిన న్యూ ఢిల్లీ జి20 లీడర్స్ సమిట్ లో జి20 యొక్క సభ్యత్వదేశం గా ఆఫ్రికన్ యూనియన్ అయిన తరువాత జరుగుతూ ఉన్నటువంటి ఈ పి20 సమిట్ లో మొట్టమొదటిసారి గా పాన్-ఆఫ్రికన్ పార్లమెంటు పాలుపంచుకోనున్నది.

 

 

పి20 సమిట్ కాలం లో నిర్వహించేటటువంటి ఇతివృత్త ప్రధానమైన సదస్సుల లో ఈ క్రింది నాలుగు అంశాల పై శ్రద్ధ వహించడం జరుగుతుంది. ఆ అంశాలు ఏవేవి అంటే వాటి లో సార్వజనిక డిజిటల్ వేదికల మాధ్యం ద్వారా ప్రజల జీవనం లో మార్పు ను తీసుకు రావడం; మహిళ లు నాయకత్వ స్థానం లో నిలచి ఉండే అభివృద్ధి ని సాధించడం; ఎస్ డిజి స్ ను త్వరిత గతి న అందుకోవడం మరియు స్థిర ప్రాతిపదిక న శక్తి సంబంధి మార్పు ను తీసుకు రావడం వంటివి భాగం గా ఉన్నాయి.

 

 

ప్రకృతి తో సద్భావన కలిగి ఉంటూ, పచ్చదనాని కి మరియు స్థిర భవిష్యత్తు కు ప్రాధాన్యాన్ని ఇస్తూ తీసుకోదగిన కార్యక్రమం పై చర్చోపచర్చలు చేయడం కోసం 2023 అక్టోబరు 12 వ తేదీ నాడు లైఫ్ స్ట‌యిల్ ఫార్ ఎన్ వైరన్ మంట్ (ఎల్ఐఎఫ్ఇ) అంశం పై శిఖర సమ్మేళనాని కి ముందుగానే ఒక పార్లమెంటరీ ఫోరమ్ ను కూడా నిర్వహించడం జరుగుతుంది.

 

 

***

 



(Release ID: 1967076) Visitor Counter : 71