ప్రధాన మంత్రి కార్యాలయం

అక్టోబరు 12వతేదీ న ఉత్తరాఖండ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి


పార్వతీ కుండ్ లో దర్శనం మరియు పూజ లలోపాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి గుంజీ గ్రామాన్ని సందర్శించనున్నారు;ఆయన సైన్యం, ఐటిబిపి మరియుబిఆర్ఒ ల సిబ్బంది తో పాటు స్థానికుల తో సంభాషిస్తారు

జాగేశ్వర్ ధామ్ లో దర్శనం మరియు పూజ లలో ప్రధానమంత్రి పాలుపంచుకొంటారు 

సుమారు 4,200 కోట్ల రూపాయల విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను పిథౌరాగఢ్ లో ప్రధానమంత్రి ప్రారంభించి వాటిని దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటుగా కొన్నిప్రాజెక్టుల కు శంకుస్థాపన సైతం చేయనున్నారు

Posted On: 10 OCT 2023 7:38PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 అక్టోబరు 12 వ తేదీ న ఉత్తరాఖండ్ ను సందర్శించనున్నారు.

ప్రధాన మంత్రి ఉదయం పూట దాదాపు గా 8:30 గంటల వేళ కు పిథౌరాగడ్ జిల్లా కు చేరుకొని, అక్కడ పార్వతీ కుండ్ లో దర్శనం మరియు పూజ కార్యక్రమాల లో పాలుపంచుకొంటారు. ప్రధాన మంత్రి ఆ క్షేత్రం లో పవిత్రమైన ఆది కైలాస్ యొక్క ఆశీస్సుల ను అభిలషించనున్నారు. ఆ క్షేత్రం తన ఆధ్యాత్మిక ప్రాముఖ్యం మరియు ప్రాకృతిక శోభ కు గాను ప్రసిద్ధం అయింది.

ప్రధాన మంత్రి సుమారు ఉదయం 9:30 గంటల కు గుంజీ గ్రామాని కి చేరుకొంటారు, అక్కడ ఆయన స్థానిక ప్రజల తో మాట్లాడుతారు. స్థానిక కళలు మరియు ఉత్పాదనల తో ఏర్పాటైన ఒక ప్రదర్శన ను కూడ ఆయన సందర్శిస్తారు. సైన్య సిబ్బంది తోనూ, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటిబిపి) మరియు బార్డర్ రోడ్ స్ ఆర్గనైజేశన్ (బిఆర్ఒ) ల సిబ్బంది తోనూ ఆయన సంభాషించనున్నారు.

మధ్యాహ్నం 12 గంటల వేళ కు ప్రధాన మంత్రి అల్మోడా జిల్లా జాగేశ్వర్ ను చేరుకొని, జాగేశ్వర్ ధామ్ లో దర్శనం మరియు పూజ కార్యక్రమాల లో పాలుపంచుకొంటారు. రమారమి 6200 అడుగుల ఎత్తున నెలకొన్న జాగేశ్వర్ ధామ్ లో రాళ్ల తో నిర్మించినటువంటి సుమారు 224 ఆలయాలు ఉన్నాయి.

ఆ తరువాత ప్రధాన మంత్రి మధ్యాహ్నం దాదాపు గా 2:30 గంటల కు పిథౌరాగఢ్ ను చేరుకొని, గ్రామీణ అభివృద్ధి, రహదారులు, విద్యుత్తు, సేద్యపు నీరు, త్రాగునీరు, తోట పంటలు, విద్య, ఆరోగ్యం మరియు విపత్తుల నిర్వహణ తదితర రంగాల తో ముడిపడ్డటువంటి సుమారు 4200 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రారంభం, దేశ ప్రజల కు అంకితం చేయడం లతో పాటుగా ఆయా ప్రాజెక్టుల కు శంకుస్థాపన కూడ చేస్తారు.

ప్రధాన మంత్రి ప్రారంభించనున్న మరియు దేశ ప్రజల కు అంకితం చేయనున్న ప్రాజెక్టుల లో ఏయే ప్రాజెక్టులు ఉన్నాయి అంటే వాటి లో పిఎమ్ జిఎస్ వై లో భాగం గా నిర్మాణం జరిగిన 76 గ్రామీణ రహదారులు మరియు 25 వంతెన లు; తొమ్మిది జిల్లాల లో బిడిఒ కార్యాలయాల కు చెందిన 15 భవనాలు; సెంట్రల్ రోడ్ ఫండ్ లో భాగం గా నిర్మాణం జరిగినటువంటి కౌసానీ బాగేశ్వర్ రోడ్డు, ధారీ-దౌబా-గిరిఛీనా రోడ్డు మరియు నగ్ లా-కిచ్ఛా రోడ్డు ల ఉన్నతీకరణ; జాతీయ రహదారుల లో అంటే అల్మోడా పెట్ శాల్ - పనువానౌలా - దన్యా (ఎన్ హెచ్ 309బి), ఇంకా టనక్ పుర్ - చల్థీ (ఎన్ హెచ్ 125) లపై రెండు రహదారుల ఉన్నతీకరణ; త్రాగునీటి కి సంబంధించిన మూడు ప్రాజెక్టు లు.. వీటి లో 38 పంపింగ్ డ్రింకింగ్ వాటర్ స్కీము లు, 419 గురుత్వాకర్షణ ఆధారితమైన నీటి సరఫరా పథకాల కు తోడు మూడు ట్యూబ్ వెల్స్ ఆధారిత నీటి సరఫరా పథకాలు భాగం గా ఉన్నాయి; పిథౌరాగఢ్ లో థర్ కోట్ మానవనిర్మిత సరస్సు; 132 కెవి సామర్థ్యం కలిగిన పిథౌరాగఢ్ -లోహ్ ఘాట్ ( చంపావత్) పవర్ ట్రాన్స్ మిశన్ లైను; ఉత్తరాఖండ్ లో 39 వంతెన లు మరియు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం అందజేసినటువంటి ఉత్తరాఖండ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు లో భాగం గా ఉన్నటువంటి ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ మేనిజ్ మంట్ ఆథారిటి (యుఎస్ డిఎమ్ఎ) వంటివి కూడా ఈ ప్రాజెక్టుల లో భాగం గా ఉన్నాయి.

శంకుస్థాపన కు నోచుకొనే ప్రాజెక్టుల లో 21,398 పాలీ-హౌస్ నిర్మాణానికి ఉద్దేశించిన ఒక పథకం ఉంది, ఇది పూలు మరియు కూరగాయల ఉత్పత్తి ని పెంచడంలో, వాటి నాణ్యత ను మెరుగు పరచడం లో సహాయపడనుంది. ఆపిల్ సాగు కు సంబంధించిన ఒక పథకం, జాతీయ రహదారుల ఉన్నతీకరణ లో భాగం అయిన అయిదు ప్రాజెక్టు లు, రాష్ట్రం లో విపత్తుల వేళ చేపట్టే చర్యల లో భాగం గా వంతెన ల నిర్మాణం; దెహ్ రాదూన్ లో గల స్టేట్ ఇమర్ జన్సి ఆపరేశన్ సెంటర్ యొక్క ఉన్నతీకరణ, నైనీతాల్ లోని బలియానాలా లో కొండచరియ లు విరిగి పడడాన్ని అడ్డుకొనేందుకు ఉద్దేశించిన కార్యక్రమాలకు తోడు మంటలు, ఆరోగ్యం మరియు అడవుల కు సంబంధించినటువంటి ఇతర మౌలిక సదుపాయాల మెరుగుదల సంబంధి కార్యాలు, రాష్ట్రవ్యాప్తం గా 20 మాడల్ డిగ్రీ కాలేజీల లో వసతి గృహాలు మరియు కంప్యూటర్ లాబ్స్ యొక్క అభివృద్ధి పనులు; అల్మోడా లోని సోమేశ్వర్ లో 100 పడకల తో ఉండే సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్; చంపావత్ లో 50 పడకల సామర్థ్యాన్ని కలిగి ఉండేటటువంటి హాస్పిటల్ బ్లాకు; నైనీతాల్ లోని హల్ద్ వానీ స్టేడియమ్ లో ఏస్ట్రోటర్ఫ్ హాకీ గ్రౌండు; రుద్రపుర్ లో వెలోడ్రోమ్ స్టేడియమ్; ఇంకా జాగేశ్వర్ దామ్ (అల్మోడా), హాట్ కాలికా (పిథౌరాగఢ్) మరియు నైనీతాల్ లోని నైనా దేవీ ఆలయాలు సహా పలు ఆలయాల లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన మానస్ ఖండ్ మందిర్ మాల మిశన్ స్కీము వంటివి భాగం గా ఉన్నాయి.

 

***



(Release ID: 1966647) Visitor Counter : 81