సహకార మంత్రిత్వ శాఖ
దేశంలోని సహకార సంఘాలన్నింటినీ బలోపేతం చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వం, మార్గదర్శకత్వంలో పలు చర్యలు తీసుకున్న కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రాలయాలు, 13 రాష్ట్రాలలోని పని చేస్తున్న 1,851 వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకులు (ఎఆర్‌డిబిలు) రిజిస్ట్రార్లను సాధికారం చేసేందుకు కంప్యూటరీకరించాలన్న ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్న కేంద్ర హోం, సహాకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
దేశంలోని పిఎసిఎస్‌ల కంప్యూటీకరణ పథకం తరహాలో, జాతీయ ఏకీకృత సాఫ్ట్‌వేర్ & కేంద్ర రిజిస్ట్రార్ ద్వారా 13 రాష్ట్రాలలోని 1,851 యూనిట్ల వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకుల (ఎఆర్‌డిబిలు) కంప్యూటీకరణ
కేంద్ర రిజిస్ట్రార్ మాదిరిగానే అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో సహకార రిజిస్ట్రార్ కార్యాలయాల కంప్యూటరీకరణ
ఈ పథకం విజయవంతమైన అమలు కోసం పని చేసేందుకు మొత్తం రూ. 225.09 కోట్ల అంచనా వ్యయం కేంద్ర ప్రాజెక్టు పర్యవేక్షణ యూనిట్ (పిఎంయు) ఏర్పాటు
ఈ పథకం అమలు వల్ల రాష్ట్రాలలో సహకార విభాగాలు, వ్యవసాయ & గ్రామీణాభివృద్ధి బ్యాంకుల కార్యాలయాల సేవలను త్వరితగతిన అందుకునేందుకే కాక పారదర్శకతను తీసుకువచ్చి, ఈ కార్యాలయాలు ఏకరూపంలో పని చేయడం వల్ల సమయాన్ని ఆదా చేస్త
Posted On:
08 OCT 2023 3:44PM by PIB Hyderabad
దేశంలోని సహకార సంఘాలన్నింటినీ బలోపేతం చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వం, మార్గదర్శకత్వంలో కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పలు చర్యలు తీసుకున్నారు. మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రాలయాలు, 13 రాష్ట్రాలలోని పని చేస్తున్న 1,851 వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకులు (ఎఆర్‌డిబిలు) రిజిస్ట్రార్లను సాధికారం చేసేందుకు కంప్యూటరీకరించాలన్న ముఖ్యమైన నిర్ణయాన్ని ఈ క్రమంలో కేంద్ర హోం, సహాకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తీసుకున్నారు.
దేశంలోని ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు (ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ - పిఎసిఎస్) కంప్యూటీకరణ పథకం తరహాలో,జాతీయ ఏకీకృత సాఫ్ట్‌వేర్ & కేంద్ర రిజిస్ట్రార్ ద్వారా 13 రాష్ట్రాలలోని 1,851 యూనిట్ల వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకుల (ఎఆర్‌డిబిలు) కంప్యూటీకరణ కోసం కేంద్ర ప్రాయోజిత పథకాన్ని ఆమోదించారు. కేంద్ర రిజిస్ట్రార్ మాదిరిగానే అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో సహకార రిజిస్ట్రార్ కార్యాలయాల కంప్యూటరీకరించడానికి ఆమోదించారు.
ఈ పథకం విజయవంతమైన అమలు కోసం పని చేసేందుకు కేంద్ర ప్రాజెక్టు పర్యవేక్షణ యూనిట్ (పిఎంయు)ను ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకం మొత్తం అంచనా వ్యయం రూ. 225.09 కోట్లు.
ఈ పథకం అమలు వల్ల రాష్ట్రాలలో సహకార విభాగాలు, వ్యవసాయ & గ్రామీణాభివృద్ధి బ్యాంకుల కార్యాలయాల సేవలను త్వరితగతిన అందుకునేందుకే కాక పారదర్శకతను తీసుకువచ్చి, ఈ కార్యాలయాలు ఏకరూపంలో పని చేయడం వల్ల మరింత సమర్ధవంతంగా సేవలను అందిస్తూ, సమయాన్ని ఆదా చేయగలుగుతారు.
***
(Release ID: 1965826)
Visitor Counter : 186