గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రచారం 3.0 కింద 341 పరిశుభ్రత కార్యకలాపాలు అమలు చేస్తున్న గనుల మంత్రిత్వ శాఖ

Posted On: 06 OCT 2023 10:17AM by PIB Hyderabad

 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, క్షేత్ర కార్యాలయాలు  ప్రభుత్వ కార్యాలయాలలో పరిశుభ్రతను పెంపొందించడానికి, పనితీరు మెరుగు పరచడానికి  ప్రత్యేక ప్రచారం 3.0 కింద గనుల మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది. ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహణపై  సెప్టెంబర్ 30న  గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి  అన్ని క్షేత్ర కార్యాలయాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు.   వివిధ కేటగిరీల కింద లక్ష్యాలను నిర్ణయించిన కార్యదర్శి  పరిశుభ్రత చేపట్టడానికి అవసరమైన ప్రాంతాలను గుర్తించారు.  కార్యాలయాల్లో రికార్డు నిర్వహణ,కార్యాలయ పనితీరు మెరుగు పరచడానికి కార్యక్రమంలో ప్రాధాన్యత ఇవ్వాలి గనుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.  గనుల మంత్రిత్వ శాఖ, శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న  కేంద్రాల్లో   ప్రత్యేక ప్రచారం 3.0 కింద  341 పరిశుభ్రత కార్యకలాపాలను నిర్వహించాలని నిర్ణయించారు. 

8 అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాన్ని అమలు చేయాలని  మంత్రిత్వ శాఖ, శాఖ  ఆధ్వర్యంలో పనిచేస్తున్న  సంస్థలు నిర్ణయించాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గనుల మంత్రిత్వ శాఖ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. . . పర్యావరణానికి తిరిగి ఇవ్వడం అనే ఇతివృత్తాన్ని ముందుకు తీసుకువెళ్లడం, ప్రచారంలో మంత్రిత్వ శాఖ కొత్త కార్యక్రమాలు చేపట్టింది.

ప్రత్యేక ప్రచారం 3.0 కార్యక్రమంలో భాగంగా  గనుల మంత్రిత్వ శాఖ శాస్త్రి భవన్ ప్రధాన ద్వారం, కారిడార్‌లతో సహా కార్యాలయ ప్రాంగణాల రూపురేఖలు మార్చడానికి మంత్రిత్వ శాఖ కార్యక్రమాలు చేపట్టింది.  ఇంధన పొదుపు చర్యలో భాగంగా గనుల మంత్రిత్వ శాఖలోని అన్ని కార్యాలయాలలో  పాత పరికరాలను తొలగిస్తోంది.  స్టాండులు  ఫ్లెక్సీల ద్వారా కాకుండా  డిజిటల్ స్క్రీన్‌తో కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి చర్యలు అమలు చేస్తున్నారు. 

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా  దేశవ్యాప్తంగా 15 జియో-హెరిటేజ్ సైట్‌లలో వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంది.  ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ,  త్రిపుర లో పరిశుభ్రత కార్యక్రమం అమలు చేయడానికి  జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 15 ప్రాంతాలను గుర్తించింది. . దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన  భౌగోళిక క్షేత్ర పరిశోధనల సమయంలో సేకరించిన పాత శిల నమూనాలను ఉపయోగించి  CHQ క్యాంపస్‌లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా  రాతి శిల్పాలు  సిద్ధం చేస్తుంది.

వివిధ కార్యాలయాల్లో అనేక నూతన,వినూత్న కార్యకలాపాలు అమలు జరుగుతున్నాయి. భువనేశ్వర్‌లోని నాల్కో నగర్ టౌన్‌షిప్‌లో వర్మీ-కంపోస్ట్ ప్లాంట్‌ను నేషనల్ అల్యూమినియం కంపెనీ పునరుద్ధరించి ఔషధ మొక్కల ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తోంది.   దమంజోడి,అంగుల్ యూనిట్లలో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ఔషధ మొక్కల తోటలు అభివృద్ధి చేస్తోంది.

హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో  అనేక వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వర్షం నీటిని నిల్వ చేయడం, నీటి వనరులను శుభ్రపరచడం, పక్షులకు ఆహారం అందించడం లాంటి కార్యక్రమాలు  హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో   ప్రత్యేక ప్రచారం 3.0 కింద అమలు జరుగుతున్నాయి. 

 'మూలం నుండి ఘన వ్యర్థాల విభజన' ను ప్రోత్సహించడానికి  నీలం, ఆకుపచ్చ రంగు బకెట్‌లను మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కన్సల్టెన్సీ లిమిటెడ్ ఏర్పాటు చేసింది.  సేంద్రియ ఎరువులను ప్రోత్సహించేందుకు కంపోజిట్ పిట్‌లను కూడా మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కన్సల్టెన్సీ లిమిటెడ్ నిర్మిస్తోంది.

కంపోస్ట్ పిట్‌లను ఏర్పాటు చేయడం, ఔషధ మొక్కల తోటను నిర్మించడం, మొక్కలు పెంచడం లాంటి కార్యక్రమాలు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్నాయి. 

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ , జవహర్‌లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్‌మెంట్ అండ్ డిజైన్ సెంటర్ వంటి ఇతర యూనిట్లు కూడా  శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

 

***


(Release ID: 1964955) Visitor Counter : 79