ప్రధాన మంత్రి కార్యాలయం
స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్లో కాంస్యం సాధించిన అభయ్-అనాహత్ సింగ్ల జంటకు ప్రధాని అభినందన
Posted On:
04 OCT 2023 7:15PM by PIB Hyderabad
ఆసియా క్రీడల స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత క్రీడాకారులు అభయ్ సింగ్, అనాహత్ సింగ్‌ల జోడీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు కాంస్య పతకం సాధించిపెట్టిన అభయ్‌సింగ్, అనాహత్ సింగ్ @abhaysinghk98 @Anahat_Singh13లకు నా అభినందనలు! ఇది నిజంగా ఎంతో అద్భుత ప్రతిభా ప్రదర్శన. భవిష్యత్తులోనూ మీరు మరిన్ని విలువైన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1964505)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam