ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
భాషాపరమైన ఆర్థిక సాధికారతకు గళాన్ని సిద్ధం చేస్తూ , సమ్మిళిత విజన్ కోసం చేతులు కలిపిన భాషిణి (డిఐబిడి), ఆర్ బిఐహెచ్
Posted On:
04 OCT 2023 3:24PM by PIB Hyderabad
భారతదేశం వంటి వైవిధ్యమైన దేశంలో, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్ బిఐహెచ్), డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (డిఐబిడి) భాషిణి మధ్య భాగస్వామ్యం ఆర్థిక సేవల విషయంలో ఉన్న భాషా పరమైన అడ్డంకులను తొలగించడం లక్ష్యంగా పెట్టుకుంది. తమ సమిష్టి ప్రయత్నాల ద్వారా, భాషా సమ్మిళితతను పెంపొందించే వినూత్న పరిష్కారాలను అన్వేషించడానికి , అభివృద్ధి చేయడానికి ఈ రెండూ సిద్ధంగా ఉన్నాయి.
ఆర్థిక సేవల రంగం (ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్) లో భాషా సమ్మిళిత ఆవశ్యకతను గుర్తించిన డిఐబిడి, ఆర్ బి ఐహెచ్ లు ఇప్పటికే గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ సందర్భంగా అవగాహన ఒప్పందం (ఎం ఒ యు)పై సంతకాలు చేశాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థానిక భాషల్లో కమ్యూనికేషన్ కు వీలు కల్పించడం ద్వారా ఆర్థిక సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. డిజిటల్ ఫైనాన్షియల్ సేవల పరిధిని వారి మాతృభాషల్లో వినియోగదారులకు విస్తరించడం, అంతిమంగా అందరికీ అంతరాయం లేని బ్యాంకింగ్ అనుభవాల కోసం కృషి చేయడం దీని ప్రధాన లక్ష్యం.
ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ లో డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ సి ఇ ఒ అమితాబ్ నాగ్ ఈ ప్రయత్నంలో మాధ్యమంగా గళ (వాయిస్) సామర్థ్యాన్ని ప్రముఖంగా వివరించారు. వాయిస్ ను మాధ్యమంగా ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక సమ్మిళితతను, ఆర్థిక సాధికారతను, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించవచ్చని ఆయన ఉద్ఘాటించారు. భాషా అనువాదం, వాయిస్ ప్రాసెసింగ్ లో సామర్థ్యాలున్న భాషిణి ఈ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా, భారతదేశ ఆర్థిక సేవల రంగంలో భాషా అడ్డంకులను విచ్ఛిన్నం చేయడానికి కొత్త మార్గాలను కనుగొనడానికి తాము కలిసి పని చేస్తామని, ప్రతి ఒక్కరికీ వారు మాట్లాడే భాషతో సంబంధం లేకుండా ఆర్థిక సేవలను మరింత అందుబాటులో ఉండేలా వినియోగదారు స్నేహపూర్వకంగా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
డిజిటల్ యుగంలో నమ్మకం, వేగం, సౌలభ్యం ప్రాముఖ్యతను ఆర్ బి ఐహెచ్ సి ఇ ఒ రాజేశ్ బన్సాల్ నొక్కి చెప్పారు. "వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ డిజిటల్ ప్రపంచంలో, మూడు స్తంభాలు సృజనాత్మకత, నమ్మకం, వేగం , సౌలభ్యా నికి మార్గనిర్దేశం చేస్తాయి: డిజిటల్ పరిష్కారాలు వేగం , సౌలభ్యాన్ని అందిస్తాయి, కానీ వినియోగదారుని విశ్వాసం పొందడం ముఖ్యం. వినియోగదారుల మాతృభాషలో ఆర్థిక సేవలను అందించడం వల్ల డిజిటల్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ పై వారికి విశ్వాసం పెరుగుతుంది. మన ఉమ్మడి సామర్థ్యాలతో, ఆర్థిక సేవల రంగంలో ఉన్న భాషా అడ్డంకులను అధిగమించగలమని మేము విశ్వసిస్తున్నాము. భాష ఇకపై అడ్డంకిగా ఉండని సమ్మిళిత ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి కలిసికట్టుగా కృషి చేస్తాం” అన్నారు.
మారుతున్న ఫిన్ టెక్ రంగం, పెరిగిన స్మార్ట్ ఫోన్ వ్యాప్తి, డేటా వినియోగ వ్యయాలు తగ్గిన నేపథ్యంలో ఈ భాగస్వామ్యం ఆవిర్భవించింది. ముఖ్యమైన ప్రారంభ దశగా, భాషిణి బహుళ భాషల్లో ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్ కోసం పబ్లిక్ టెక్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ వేదిక ఆర్థిక సంస్థల ద్వారా క్రెడిట్ డెలివరీని క్రమబద్ధీకరించడం , పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది, ఇది మరింత ఆర్థిక సమ్మిళితానికి గణనీయంగా దోహదం చేస్తుంది.
ఈ పురోగతులు దేశ ఆర్థిక సమ్మిళిత ప్రయత్నాలను ముందుకు నడిపినప్పటికీ, నిర్దిష్ట రంగాలు , జనాభా విభాగాలు సాధారణ ఆర్థిక రంగం అంచుల్లో ఉన్నాయి. ఈ భాగస్వామ్యం వారిని స్థిరమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థలో ఏకీకృతం చేసే దిశగా ఒక కీలక అడుగును సూచిస్తుంది.
డిబిఐడి గురించి
డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ అనేది డిజిటల్ ఇండియా కార్పొరేషన్, సెక్షన్ 8 కంపెనీ, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక విభాగం. భాషా అడ్డంకులను అధిగమించే ఉద్దేశ్యంతో దాతలు, భాగస్వామ్య సంస్థలు , పౌరుల వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థను ప్రారంభించడానికి సహజ భాషా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, తద్వారా ఆత్మనిర్భర్ భారత్ లో డిజిటల్ చేరిక, డిజిటల్ సాధికారతను నిర్ధారించడం భాషిణి దార్శనికత. మరింత చదవడం కోసం www.bhashini.gov.in ని సందర్శించండి లేదా ceo-dibd@digitalindia.gov.in కు మెయిల్ చేయండి.
ఆర్ బిఐహెచ్ గురించి
రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్ బి ఐహెచ్) - రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) l పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ - ఒక బిలియన్ భారతీయులకు వివాద రహిత ఫైనాన్స్ ను ప్రారంభించడానికి పనిచేసే సంస్థ. ఆర్ బిఐహెచ్ పర్యావరణ వ్యవస్థలో ఎనేబుల్, ఫెసిలిటేటర్ గా పనిచేస్తుంది, ఆర్థిక రంగం అంతటా సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ,వేగవంతం చేయడానికి ఆర్థిక, సాంకేతిక ,విద్యా సంస్థల నుండి సభ్యులను ఏకతాటిపైకి తెస్తుంది. ఆలోచనల మార్పిడిని సులభతరం చేసే, ప్రోటోటైప్ ల పరిశోధన - అభివృద్ధికి మద్దతు ఇచ్చే బలమైన పర్యావరణ వ్యవస్థతో, ఆర్ బిఐహెచ్ భారతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక ఆవిష్కరణలో భారతదేశాన్ని ముందంజలో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరింత తెలుసుకోవడానికి, www.rbihub.in సందర్శించండి లేదా Communications@rbihub.in ద్వారా మాకు రాయండి.
***
(Release ID: 1964159)
Visitor Counter : 164