ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల మహిళా టేబుల్ టెన్నిస్ డబుల్స్లో కాంస్యం సాధించిన ఐహికా ముఖర్జీ.. సుతీర్థ ముఖర్జీలకు ప్రధానమంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
02 OCT 2023 9:28PM by PIB Hyderabad
ఆసియా క్రీడల మహిళా టేబుల్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్న భారత జంట ఐహికా ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఆసియా క్రీడలలో భారత మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్ జట్టు పతకం సాధించడం ఇదే తొలిసారి.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“కాంస్య పతకం విజేతలుగా నిలిచిన ఐహికా ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీల జంటకు విజయాభినందనలు. ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో భారత మహిళల జట్టు పతకం సాధించడం ఇదే తొలిసారి కాబట్టి ఇదో ప్రత్యేక సందర్భం. ఈ విజయంలో వారు చూపిన ప్రతిభ, అంకితభావం, జట్టు కృషి అందరికీ ఆదర్శప్రాయం” అని ప్రధానమంత్రి కొనియాడారు.
***
DS
(रिलीज़ आईडी: 1963468)
आगंतुक पटल : 143
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam