ప్రధాన మంత్రి కార్యాలయం

రాజస్థాన్లోని చిత్తోడ్గఢ్లో సావరియా సేఠ్ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని.. పూజలు నిర్వహించిన ప్రధానమంత్రి

Posted On: 02 OCT 2023 4:33PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌లో సావరియా సేఠ్‌ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని, పూజలు నిర్వహించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

““చిత్తోడ్‌గఢ్‌లోని చరిత్రాత్మక శ్రీ సావరియా సేఠ్ ఆలయంలో దైవ దర్శనం, పూజలతో నేను నిలువెల్లా పులకించాను. ఈ సందర్భంగా రాజస్థాన్‌లోని నా కుటుంబ సభ్యులైన ప్రజలందరి జీవితాల్లో సంతోష, సౌభాగ్యాలు నిండాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS(Release ID: 1963357) Visitor Counter : 91