ప్రధాన మంత్రి కార్యాలయం
అమరవీరుడు భగత్ సింగ్ జయంతి నేపథ్యంలో ప్రధాని సంస్మరణ
प्रविष्टि तिथि:
28 SEP 2023 9:36AM by PIB Hyderabad
అమరవీరుడు భగత్ సింగ్ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయనపై తన మనోభావాలను ఒక వీడియో ద్వారా ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనను సంస్కరించుకుంటున్నాను. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగం, తానెంచుకున్న మార్గంపై ప్రదర్శించిన అంకితభావం తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. సాహసానికి ఆదర్శంగా, భారత నిరంతర పోరాటశీలత, న్యాయం, స్వేచ్ఛకు చిహ్నంగా ఆయన చిరస్మరణీయుడు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1962106)
आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam