ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అవాస్తవాలు - వాస్తవాలు
యాంటీ-టీబీ ఔషధాల కొరత ఉన్నాయని చెబుతున్న మీడియా నివేదికలు తప్పుడు సమాచారం, తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి
సెంట్రల్ వేర్‌హౌస్‌ల నుండి పెరిఫెరల్ ఆరోగ్య సంస్థల వరకు వివిధ స్థాయిలలో స్టాక్ పొజిషన్‌లను మూల్యాంకనం చేయడానికి
కేంద్రం ముందస్తుగా క్రమపద్ధతిన అంచనాలను నిర్వహిస్తుంది.
Posted On:
26 SEP 2023 12:37PM by PIB Hyderabad
భారతదేశంలో యాంటీ-టీబీ ఔషధాల కొరత ఉందని, జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం (ఎన్టిఈపి) క్రింద అటువంటి ఔషధాల ప్రభావాన్ని ప్రశ్నిస్తూ కొన్ని మీడియా నివేదికలు వచ్చాయి. యాంటీ-టీబీ మందుల స్టాక్‌లో లభ్యతపై ఎటువంటి నిర్దిష్ట సమాచారం లేకుండా ఇటువంటి నివేదికలు అస్పష్టంగా మరియు తప్పుగా ఉన్నాయి.
డ్రగ్ సెన్సిటివ్ క్షయవ్యాధి చికిత్సలో 4 ఎఫ్డిసి (ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్, ఇథాంబుటోల్, పైరజినామైడ్) రెండు నెలల పాటు అందుబాటులో ఉన్న నాలుగు ఔషధాలు, 3 ఎఫ్డిసి ( ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్, ఇథాంబుటోల్) వంటి రెండు నెలల మూడు మందులు అందుబాటులో ఉంటాయి. ఈ ఔషధాలన్నీ ఆరు నెలలు మరియు అంతకంటే ఎక్కువ నిల్వలతో అందుబాటులో ఉన్నాయి.
మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ చికిత్స నియమావళిలో సాధారణంగా నాలుగు నెలల 7 మందులు (బెడాక్విలిన్, లెవోఫ్లోక్సాసిన్, క్లోఫాజిమైన్, ఐసోనియాజిడ్, ఇథాంబుటోల్, పైరజినామైడ్ మరియు ఇథియోనామైడ్) ఐదు నెలల పాటు 4 మందులు (లెవోఫ్లోక్సాసిన్, క్లోఫాజిమైన్ మరియు పైరాజిన్‌బుటామైడ్) ఉంటాయి. డ్రగ్ రెసిస్టెంట్ టిబి ఉన్నవారిలో దాదాపు 30% మందికి సైక్లోసెరిన్ మరియు లైన్‌జోలిడ్ అవసరం.
ఎన్టిఈపి కింద కేంద్ర స్థాయిలో టీబీ నివారణ మందులు, ఇతర మెటీరియల్‌ల సేకరణ, నిల్వ, స్టాక్ నిర్వహణ, ఇన్-టైమ్ పంపిణీ జరుగుతోంది. అరుదైన పరిస్థితుల్లో, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద బడ్జెట్‌ను ఉపయోగించడం ద్వారా పరిమిత కాలానికి స్థానికంగా కొన్ని మందులను సేకరించాలని రాష్ట్రాలను కోరడం జరిగింది. తద్వారా వ్యక్తిగత రోగి సంరక్షణ ప్రభావితం కాదు. మహారాష్ట్ర ఇప్పటికే సైక్లోసెరిన్ టాబ్లెట్లను కేంద్రీయంగా కొనుగోలు చేసింది. కొన్ని రాష్ట్రాలు జిల్లాలకు సేకరణను అప్పగించాయి; తదనుగుణంగా, జిల్లాలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కొనుగోలు చేసాయి.
సంబంధిత మీడియా నివేదికలలో హైలైట్ చేయబడిన మహారాష్ట్ర రాష్ట్రంలో టీబీ నివారణ ఔషధాల నిల్వ స్థితి క్రింది విధంగా ఉంది (మూలం: Ni-kshay Aushadhi)
ఔషధం పేరు
|
24.09.2023 నాటికి మహారాష్ట్రలో అందుబాటులో ఉన్న (UOM- CAPS/TABS) నిల్వలు
|
Cycloserine – 250 mg
|
6,34,940
|
Linezolid – 600 mg
|
86,443
|
Delamanid - 50 mg
|
1,53,784
|
Clofazimine-100mg
|
79,926
|
Moxifloxacin - 400 mg
|
4,56,137
|
Pyridoxine
|
7,06,413
|
క్షేత్రస్థాయిలో యాంటీ టీబీ మందుల కొరత లేదు. ని-క్షయ్ ఔషధి ప్రకారం 26 సెప్టెంబర్ 2023 నాటికి జాతీయ స్థాయిలో ఈ ఔషధాల ప్రస్తుత స్టాక్ క్రింది విధంగా ఉంది:
ఔషధం పేరు
|
24.09.2023 నాటికి ఎన్టీఈపి (UOM- CAPS/TABS) కింద జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న నిల్వలు
|
Cycloserine -250 mg
|
14,79,857
|
Linezolid – 600 mg
|
9,95,779
|
Delamanid - 50 mg
|
11,37,802
|
Levofloxacin – 250 mg
|
28,85,176
|
Levofloxacin – 500 mg
|
33,27,130
|
Clofazimine - 100 mg
|
12,86,360
|
Moxifloxacin - 400 mg
|
2,72,49,866
|
Pyridoxine
|
2,72,99,242
|
అలాగే, ఎన్టీఈపి క్రింద మోక్సిఫ్లోక్సాసిన్ 400ఎంజి, పిరిడాక్సిన్ 15 నెలల కంటే ఎక్కువ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అలాగే, డెలామానిడ్ 50 మి.గ్రా, క్లోఫాజిమైన్ 100 మి.గ్రా ఆగస్టు 2023లో సేకరించబడ్డాయి. అన్ని రాష్ట్రాలు, యూటీలకు సరఫరా అయ్యాయి. అంతేకాకుండా, అదనంగా 8 లక్షల క్యూటీ డెలామానిడ్ 50 ఎంజి మాత్రల సరఫరా కోసం 23.09.2023న పి.ఓ జారీ చేయబడింది.
పైన పేర్కొన్న స్టాక్‌లతో పాటు, ఆగస్టు 2023లో లైన్‌జోలిడ్-600 మి.గ్రా, సైక్లోసెరిన్-250 మి.గ్రా సరఫరా కోసం కొనుగోలు ఆర్డర్‌లు జారీ అయ్యాయి. ఈ మందులు రాష్ట్రాలకు పంపడం జరుగుతోంది.
ఈ అవసరమైన టీబీ నివారణ ఔషధాల లభ్యతను నిర్ధారించడానికి ముఖ్యమైన ప్రయత్నాలు జరిగాయి. సెంట్రల్ వేర్‌హౌస్‌ల నుండి పెరిఫెరల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌ల వరకు వివిధ స్థాయిలలో స్టాక్ పొజిషన్‌లను మూల్యాంకనం చేయడానికి రెగ్యులర్ అసెస్‌మెంట్‌లు నిర్వహిస్తున్నారు.
అందువల్ల, మీడియా నివేదికలలో పేర్కొన్న సమాచారం అస్పష్టంగా, తప్పుడు సమాచారం అందించేలా ఉండడమే కాదు, దేశంలో అందుబాటులో ఉన్న టీబీ నివారణ ఔషధాల సరైన చిత్రాన్ని ప్రతిబింబించడం లేదు.
***
(Release ID: 1961700)
Visitor Counter : 139