ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన


“కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారులు”;

“శివశక్తి ప్రదేశం ఒకటి చంద్రుడిపై ఉంది.. మరొకటి కాశీలో ఉంది”;

“కాశీలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నమూనా మహాదేవునికి అంకితం”;

“క్రీడా మౌలిక సదుపాయాలు యువ ఆటగాళ్ల ప్రతిభకు పదును
పెట్టడమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజమిస్తాయి”;

“ఆటలాడేవారే అభివృద్ధి సాధిస్తారన్నది నేడు జాతి మనోభావన”;

“పాఠశాల నుంచి ఒలింపిక్‌ పోడియం దాకా
జట్టు సభ్యుడిలా ఆటగాళ్ల వెంట ప్రభుత్వం”;

“గ్రామాలు.. చిన్న పట్టణాల యువత నేడు జాతి గర్వించేలా చేస్తున్నారు”;

“జాతి వికాసానికి క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణ అవశ్యం”

Posted On: 23 SEP 2023 3:10PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగరంలోని గంజారి పరిధిలోగల రాజాతాలాబ్‌ ప్రాంతంలో రూ.450 కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక స్టేడియం రూపుదిద్దుకోనుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ- వార‌ణాసిని మ‌రోసారి సంద‌ర్శించే అవ‌కాశం లభించినందుకు ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ నగర సందర్శనలోని ఆనందానుభూతి మాట‌ల్లో చెప్ప‌లేనిద‌ని వ్యాఖ్యానించారు. గత నెల 23న చంద్రునిపై ‘శివశక్తి’ ప్రదేశానికి చంద్రయాన్‌ ద్వారా భారత్‌ చేరుకున్న సరిగ్గా నెల తర్వాత ఈ నెలలే అదే తేదీన కాశీని సందర్శిస్తున్నానని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. “శివశక్తి ప్రదేశం ఒకటి చంద్రునిపై ఉంటే.. మరొకటి ఇక్కడ కాశీ నగరంలో ఉంది” అని చంద్రయాన్ మహత్తర విన్యాసంపై ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ ప్రధాని వ్యాఖ్యానించారు.

   క్రికెట్‌ స్టేడియం నిర్మాణ ప్రదేశం గురించి మాట్లాడుతూ- వింధ్యవాసిని మాత ఆలయానికి వెళ్లే మార్గం కూడలిలోగల ఈ వేదిక ప్రాముఖ్యాన్ని గుర్తుచేశారు. అలాగే ఇది శ్రీ రాజ్ నారాయణ్ జన్మించిన మోతీకోట్ గ్రామానికి సమీపంలో ఉన్నదని పేర్కొన్నారు.  తరప్రదేశ్‌లని వ మహాదేవునికి అంకితం చేయబడిన ఈ అంతర్జాతీయ స్టేడియం కాశీ పౌరులకు గర్వకారణం కాగలదని చెప్పారు. భవిష్యత్తులో ఎన్నో గొప్ప క్రికెట్‌ సమరాలకు ఈ స్టేడియం వేదికవుతుందని పేర్కొన్నారు. అలాగే ఈ మైదానంలో యువ క్రీడాకారులు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ పొందే వీలుంటుందని తెలిపారు. “ఇది కాశీ పౌరులకు ఎనలేని ప్రయోజనం చేకూరుస్తుంది” అని వివరించారు. క్రికెట్ ద్వారా ప్రపంచం భారత్‌తో ముడిపడి ఉందని, ఇవాళ అనేక కొత్త దేశాలు క్రికెట్ క్రీడకు ప్రాధాన్యమిస్తున్నాయని చెప్పారు. అందువల్ల రాబోయే రోజుల్లో క్రికెట్‌ పోటీలు అధిక సంఖ్యలో జరుగుతాయని ప్రధాని అన్నారు. తద్వారా క్రీడా మైదానాలకు పెరిగే డిమాండ్‌ను ఈ అంతర్జాతీయ స్టేడియం తీర్చగలదన్నారు. దీన్ని నిర్మించడంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

   ఈ స్థాయిలో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంవల్ల క్రీడలపై సానుకూల ప్రభావంతోపాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికీ అవకాశం ఉంటుందని ప్రధాని నొక్కిచెప్పారు. అంతేకాకుండా ఇటువంటివి అధిక సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తాయని, తదనుగుణంగా ఈ ప్రాంతంలోని హోటళ్లు, తినుబండారాల దుకాణాలు, రిక్షా-ఆటోరిక్షాలవారు, పడవలు నడిపేవారు తదితరులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే క్రీడా శిక్షణ-నిర్వహణ సంస్థలపై సానుకూల ప్రభావం ఉంటుందని, యువతరం క్రీడారంగంలో ప్రవేశించడంతోపాటు అంకుర సంస్థల ఏర్పాటుకు ఇది వీలు కల్పిస్తుందని చెప్పారు. మరోవైపు ఫిజియోథెరపీ కోర్సులకూ అవకాశం ఉంటుందని, మొత్తంమీద వారణాసి నగరం రాబోయే రోజుల్లో ఓ కొత్త క్రీడా పరిశ్రమ కేంద్రంగా రూపొందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

   క్రీడలపై తల్లిదండ్రుల దృక్పథంలో మార్పును ప్రధాని ప్రస్తావించారు. “ఆటలాడేవాడే అభివృద్ధి సాధిస్తాడన్నది నేడు దేశం మనోభావనగా మారింది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల తాను మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌ గిరిజన గ్రామం సందర్శించడాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అక్కడి యువత ఫుట్‌బాల్‌ ఆటంటే ప్రాణమిస్తారని వారితో సంభాషించిన సందర్భంగా అర్థమైందన్నారు. అలాగే వారు తమ గ్రామం ‘మినీ బ్రెజిల్‌’ అని సగర్వంగా చెబుతుంటారని పేర్కొన్నారు. క్రీడలపై కాశీ  లో మార్పును కూడా ప్రధాని వివరించారు. ఈ నగర యువతకు ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాల కల్పనకు తాను కృషి చేస్తున్నానని చెప్పారు. ఇందులో భాగంగానే ఈ స్టేడియం నిర్మాణంసహా రూ.400 కోట్లతో సిగ్రా స్టేడియంలో 50కిపైగా క్రీడల నిర్వహణకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇది దివ్యాంగ హిత తొలి బహుళ అంతస్తుల క్రీడా సదుపాయమని, కొత్త నిర్మాణంతోపాటు పాతవాటిని కూడా మెరుగుపరుస్తున్నామని ప్రధాని తెలిపారు.

   యువతరం భవిష్యత్తు నేడు శరీర దార్ఢ్యం, ఉపాధి, క్రీడలతో ముడిపడి ఉందన్నారు. దీనికి అనుగుణంగా మారిన క్రీడా విధానం వల్ల భారతదేశం ఇటీవల ఎన్నో క్రీడా విజయాలు సాధించిందని ప్రధాని గుర్తుచేశారు. దేశంలో 9 ఏళ్ల కిందటితో పోలిస్తే ఈ ఏడాది క్రీడా బడ్జెట్‌ మూడింతలు పెరిగిందని తెలిపారు. ‘క్రీడా భారతం’ (ఖేలో ఇండియా) కార్యక్రమం బడ్జెట్ కూడా నిరుటితో పోలిస్తే ఈసారి దాదాపు 70 శాతం పెరిగిందని వెల్లడించారు. “పాఠశాల నుంచి ఒలింపిక్స్‌ పోడియం దాకా ఒక జట్టు సభ్యుడిలా ప్రభుత్వం క్రీడాకారుల వెంట నడుస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే క్రీడాల్లో పెరుగుతున్న బాలికల ప్రాతినిధ్యం, ‘టాప్స్‌’ పథకం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో గత సంవత్సరాల మొత్తం పతకాలతో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక పతకాలు కైవసం చేసుకుని భారత్‌ కొత్త రికార్డు సృష్టించిందని ప్రధాని హర్షం ప్రకటించారు. రాబోయే ఆసియా క్రీడ‌ల్లో పాల్గొనబోయే క్రీడాకారుల‌కు ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు.

   ప్రతి గ్రామం-నగరంసహా దేశం నలుమూలలా అపార క్రీడా ప్రతిభ నిబిడీకృతమై ఉందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. చిరుప్రాయంలోనే ఆ ప్రతిభను గుర్తించి వారి నైపుణ్యానికి మెరుగులు దిద్దాల్సిన అవసరాన్ని రీ తలు పెం అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. “గ్రామాలు, చిన్న పట్టణాల నుంచి వచ్చిన యువత నేడు జాతికి గర్వకారణంగా నిలుస్తున్నారు” అని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఇలాంటి వారికి మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు స్థానిక ప్రతిభను గుర్తించి, వారు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా ప్రభుత్వం కృషికి క్రీడా భారతం’ ఒక నిదర్శనమని ఆయన ఉదాహరించారు. ఈ కార్యక్రమంలో క్రీడారంగ దిగ్గజాలు పలువురు పాలుపంచుకోవడాన్ని ప్ర‌ధానమంత్రి అభినందించారు. కాశీ నగరంపై వారికిగల ప్రేమాభిమానాలు, భక్తిశ్రద్ధలపై కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

   “దేశంలో నవ్య ప్రతిభకు సానబెట్డడంలో నిపుణులైన క్రీడా శిక్షకులు, అత్యుత్తమ శిక్షణ సౌకర్యాలు కూడా ఎంతో ముఖ్యం” అని ప్రధాని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణించిన పూర్వ క్రీడా దిగ్గజాలు ఈ బాధ్యతను స్వీకరించేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. కొన్నేళ్లుగా యువతను వివిధ క్రీడాపోటీల ద్వారా అనుసంధానిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. కొత్త క్రీడా సౌకర్యాలతో గ్రామీణ, చిన్న నగరాల క్రీడాకారులకు అవకాశాలు అందివస్తాయని చెప్పారు. మరోవైపు ‘క్రీడా భారతం’ కింద మౌలిక సదుపాయాల కల్పనతో బాలికలు ప్రయోజనం పొందుతుండటంపై ప్రధాని హర్షం వెలిబుచ్చారు.  షపిం

   కొత్త జాతీయ విద్యా విధానంలో క్రీడలను పాఠ్యేతర కార్యకలాపంగా కాకుండా పాఠ్యాంశాల్లో భాగంగా మార్చినట్లు ప్రధాని తెలిపారు. అలాగే దేశంలో తొలి క్రీడా విశ్వవిద్యాలయం మణిపూర్‌లో ఏర్పాటైందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోనూ రూ.వేల కోట్లతో క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణ చేపట్టినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా గోరఖ్‌పూర్‌లో క్రీడా కళాశాల విస్తరణసహా మీరట్‌లో మేజర్ ధ్యాన్‌చంద్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటును గుర్తుచేశారు.

   “దేశాభివృద్ధికి క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణ కూడా అత్యావశ్యకం” అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. అంతర్జాతీయ క్రీడాపోటీల నిర్వహణలో ప్రపంచంలోని అనేక నగరాలు పేరు పొందాయని, మన దేశానికీ అటువంటి సామర్థ్యం దిశగా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎంతయినా అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాశీ నగరంలో రూపొందే స్టేడియం కేవలం ఇటుకలు-కాంక్రీటు  ్యావశ్యంనిర్మాణంగా కాకుండా భవిష్యత్‌ భారతానికి చిహ్నంగా మారాలనే సంకల్పానికి సాక్షిగా నిలవగలదని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. కాశీలో అన్ని అభివృద్ధి కార్య‌క్ర‌మాలు సజావుగా సాగుతుండటంపై ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. “మీ భాగస్వామ్యం లేనిదే కాశీలో ఏదీ సాకారం కాదు. మీ మద్దతు, ఆశీస్సులతోనే ఈ నగరాభివృద్ధిలో కొత్త అధ్యాయాలకు మేం శ్రీకారం చుడుతూంటాం” అని ప్రజలకు గుర్తుచేస్తూ  ప్రధాని తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ‘బిసిసిఐ’ అధ్యక్షుడు శ్రీ రోజర్ బిన్నీతోపాటు కార్యదర్శి శ్రీ రాజీవ్ శుక్లా, ఉపాధ్యక్షుడు శ్రీ జే షాసహా సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్, మదన్ లాల్, గుండప్ప విశ్వనాథ్, గోపాల్ శర్మ,  సచిన్ టెండూల్కర్ వంటి మాజీ క్రికెట్ దిగ్గజాలు, రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   దేశంలో ప్రపంచ స్థాయి ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రధానమంత్రి దూరదృష్టికి అనుగుణంగా   ్ర వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సిద్ధం కానుంది. ఈ మేరకు వారణాసి నగరంలోని గంజరి పరిధిలోగల రాజాతాలాబ్ ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.450 కోట్లతో దీన్ని నిర్మిస్తారు. ఈ స్టేడియం నేపథ్యం, వాస్తుశిల్పం పరమశివుని రూపం, ఆహార్యం ప్రేరణగా రూపొందించబడింది. ఈ మేరకు పైకప్పు భాగాలు శివుని శిఖలోని చంద్రవంక ఆకారంలో, విద్యుద్దీపాలు ఆయన చేతిలోని త్రిశూలాకారంలో, ఆసన ఏర్పాట్లు ఘాట్ మెట్ల తీరున రూపొందుతాయి. ముఖద్వారంలో బిల్వపత్ర ఆకారపు లోహపు షీట్లతో డిజైన్‌ చేయబడ్డాయి. ఈ స్టేడియంలో 30,000 మంది ప్రేక్షకులు కూర్చునే సౌకర్యం ఉంటుంది.

 

***

DS/TS



(Release ID: 1960132) Visitor Counter : 143