మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

'ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల' కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 15 సెప్టెంబర్‌ 2023

Posted On: 13 SEP 2023 11:49AM by PIB Hyderabad

కేంద్ర మహిళ & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఏటా 'ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల'ను (పీఎంఆర్‌బీపీ) ప్రదానం చేస్తుంది. చిన్నారుల్లో శక్తి, సంకల్పం, సామర్థ్యం, జిజ్ఞాస, ఉత్సాహాన్ని నింపడానికి ఈ అవార్డులు ఇస్తుంది.

భారతీయ పౌరుడై, భారతదేశంలో నివసిస్తున్న 18 సంవత్సరాలకు మించని (దరఖాస్తు స్వీకరించే చివరి తేదీ నాటికి) ఏ చిన్నారి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు.

జాతీయ అవార్డుల పోర్టల్ https://awards.gov.inలో నామినేషన్‌ సమర్పించడానికి చివరి తేదీ 15 సెప్టెంబర్‌ 2023.

***



(Release ID: 1956990) Visitor Counter : 116