ప్రధాన మంత్రి కార్యాలయం
ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా అధ్యక్షుడిని కలుసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
10 SEP 2023 7:51PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా అధ్యక్షుడు హిజ్ ఎక్సలెన్సీ బొలా అహ్మదఖ్ టినుబును , న్యూఢిల్లీలో జరుగుతున్న జి 20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా సెప్టెంబర్ 10,2023న కలుసుకున్నారు.
జి 20 అధ్యక్ష బాధ్యతలను ఇండియా విజయవంతంగా నిర్వహించడం పట్ల నైజీరియా అధ్యక్షుడు టింబూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభినందించారు. జి 20 లో ఆఫ్రికన్ యూనియన్ కు
శాశ్వత సభ్యత్వం ఇచ్చినందుకు, వర్ధమాన దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళుతున్నందుకు, ప్రధానమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ద్వైపాక్షిక సహకారం,వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, వ్యవసాయం, చిరుధాన్యాలు, ఆర్థిక సాంకేతికత, సామర్థ్యాల నిర్మాణం వంటి అంశాలకు సంబంధించి పలు విస్తృత అంశాలపై ఇరువురు నాయకులు ఫలప్రదమైన చర్చలు జరిపారు.
***
(रिलीज़ आईडी: 1956216)
आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam