ప్రధాన మంత్రి కార్యాలయం
తుర్కియే అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం
Posted On:
10 SEP 2023 8:03PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గణతంత్ర తుర్కియే దేశాధ్యక్షుడు గౌరవనీయ రిసెప్ తయ్యిప్ ఎర్డొగాన్‌తో 2023 సెప్టెంబరు 10న ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ-భద్రత, పౌర విమానయానం, నౌకాయానం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికిగల అవకాశాలపై వారిద్దరూ చర్చించారు.
భారత జి-20 అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడంపై ప్రధానమంత్రిని అధ్యక్షులు ఎర్డొగాన్ అభినందించారు. తుర్కియేలో 2023 ఫిబ్రవరి నాటి భూకంప విపత్కర పరిస్థితుల్లో ‘ఆపరేషన్ దోస్త్’ కింద తమకు భారత్ తక్షణ సాయం అందించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కావడంపై అభినందిస్తూ, ఆదిత్య ఎల్-1 ప్రయోగం కూడా సఫలం కావాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.
*****
(Release ID: 1956207)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam