ప్రధాన మంత్రి కార్యాలయం
అమెరికా అధ్యక్షుడు బిడెన్ ను కలిసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి ప్రెసిడెంట్ బిడెన్ దార్శనికత, చిత్తశుద్ధిని అభినందించిన ప్రధానమంత్రి.
ప్రధానమంత్రి చరిత్రాత్మక అమెరికా పర్యటన అనంతరం తీసుకున్ననిర్ణయాల అమలు పురోగతిని ప్రశంసించిన
నేతలు.
ఐసెట్, రక్షణ, అంతరిక్షం, ఇతర రంగాలలో నిరంతర పురోగతిని ఇరువురు నాయకులు ప్రశంసించారు.
చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువం వద్ద చంద్రయాన్ 3 చరిత్రాత్మక లాండింగ్ పట్ల ఇండియాకు అభినందనలు తెలిపిన ప్రెసిడెంట్ బిడెన్.
ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్న ఇరువురు నేతలు.
ఇండియా జి20 అధ్యక్షతకు అమెరికా నిరంతరం మద్దతు నిస్తుండడంపట్ల క్రుతజ్నతలుతెలిపిన ప్రధానమంత్రి.
Posted On:
08 SEP 2023 11:31PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు , హిజ్ ఎక్సలెన్సీ , జోసెఫ్ ఆర్.బిడెన్ ను ఈరోజు న్యూఢిల్లీలో కలుసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బిడెన్ తొలిసారిగా అధ్యక్ష హోదాలో ఇండియాలో పర్యటిస్తున్నారు. సెప్టెంబర్ 9-10 తేదీలలో న్యూఢిల్లీలో జరుగుతున్న జి 20 శిఖరాగ్ర సమ్మేళనంలో ఆయన పాల్గొంటున్నారు.
ఇండియా- అమెరికా సమగ్ర, అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో అధ్యక్షుడు బిడెన్ దార్శనికత, చిత్తశుద్ధిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఉమ్మడి ప్రజాస్వామిక విలువలు, వ్యూహాత్మక సమ్మిళితత్వం, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాల ఆదారంగా రూపుదిద్దుకున్నవని అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2023 జూన్ లో జరిపిన చరిత్రాత్మక అమెరికా పర్యటన అనంతరం, ఫలితాలతో కూడిన వివిధ కార్యక్రమాల అమలు విషయంలో సాధించిన పురోగతిని ఇరువురు నాయకులు ప్రశంసించారు. అలాగే ఇండియా, అమెరికా చొరవ కింద చేపట్టిన కీలక ఆధునిక సాంకేతికత కింద చేపట్టిన చర్యలను కూడా వారు అభినందించారు.
ద్వైపాక్షిక సహకారంలో నిరంతర వేగాన్ని అలాగే రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, ఆరోగ్యం, పరిశోధన, ఆవిష్కరణలు, సంస్క్రుతి, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలను ఇరువురు నాయకులు స్వాగతించారు.
చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో చంద్రయాన్ 3 సురక్షితంగా దిగడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి, అమెరికా అధ్యక్షుడు బిడెన్ అభినందనలు తెలిపారు. ఇరుదేశాలమధ్య అంతరిక్షరంగంలో సహకారం మరింత పెంపొందుతుండడాన్ని బిడెన్ ప్రస్తావించారు.
ఇరువురు నాయకులు జాతీయ , అంతర్జాతీయంతో పాటు పలు అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇండియా- అమెరికా భాగస్వామ్యం ఇరుదేశాల ప్రజలకే కాక, ప్రపంచానికే మంచిదని వారు అభిప్రాయపడ్డారు.
ఇండియా జి20 అధ్యక్షత విజయవంతానికి అమెరికా నిరంతర మద్దతు నివ్వడం పట్ల అధ్యక్షుడు బిడెన్ కు ప్రధానమంత్రి క్రుతజ్నతలు తెలిపారు.
****
(Release ID: 1955823)
Visitor Counter : 189
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam