ప్రధాన మంత్రి కార్యాలయం

పార్లమెంటుసభ్యుల సాంస్కృతిక కార్యక్రమం  అనేది ప్రతిభ ను కనబరచేందుకు మరియు సాంస్కృతిక ఉత్సవం లోపాలుపంచుకొనేందుకు ఒక మంచి కార్యక్రమం గా ఉంది: ప్రధాన మంత్రి

Posted On: 02 SEP 2023 8:34PM by PIB Hyderabad

పార్లమెంటు సభ్యుల సాంస్కృతిక కార్యక్రమం అనేది వేరు వేరు పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రజల కు సాంస్కృతిక ఉత్సవం లో పాల్గొనేందుకు మరియు వారిలోని ప్రతిభ ను కనబరిచేందుకు ఉద్దేశించిన ఓ మంచి కార్యక్రమం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దీని లో పాలుపంచుకొన్నవారందరిని ప్రోత్సహించవలసింది గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికి విజ్ఞప్తి చేశారు.

ప్రధాన మంత్రి ‘X’ మాధ్యం లో నమోదు చేసిన ఒక ట్వీట్ లో -

‘‘పార్లమెంటు సభ్యుల సాంస్కృతిక కార్యక్రమం అనేది ఒక మంచి కార్యక్రమం గా ఉంది. దీని ద్వారా, వేరు వేరు పార్లమెంటరీ నియోజక వర్గాల కు చెందిన వారి కి వారి యొక్క ప్రతిభ ను చాటేందుకు మరియు సాంస్కృతిక ఉత్సవం లో భాగం పంచుకొనేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం భాజపా పార్లమెంటు సభ్యులు దీనిని నిర్వహించడం లో అమిత ఉత్సాహం తో తలమునుకలు గా ఉన్నారు. ఈ వరుస లో నేను సైతం నా యొక్క నియోజకవర్గమైన కాశీ లో వినమ్రపూర్వకమైనటువంటి ఓ ప్రయాస కు నడుంకట్టాను. దీనిలో పాలుపంచుకొంటున్న వారి ఉత్సాహాన్ని తప్పక పెంపు చేయవలసింది గా మీ అందరి కి నేను మనవి చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 (Release ID: 1955018) Visitor Counter : 101