ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశ పురోగతి కోసం ప్రగతి సాధనలో మహిళల నేతృత్వం అవసరం: స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి

Posted On: 15 AUG 2023 2:02PM by PIB Hyderabad

   భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవాళ ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా- దేశం పురోగమించాలంటే అభివృద్ధి కోసం సాగే కృషికి మహిళలు సారథ్యం వహించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఈ క్రమంలో దేశంలోని పౌర విమానయాన రంగంలో మహిళా పైలట్లు అత్యధిక సంఖ్యలో ఉండటం భారత్‌కు గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత చంద్రయాన్ మిషన్‌కు మహిళా శాస్త్రవేత్తలు కూడా నాయకత్వం వహిస్తుండటాన్ని ఆయన ప్రస్తావించారు.

   మహిళల నేతృత్వంలో అభివృద్ధి అంశాన్ని తాను జి20 కూటమి ముందుంచానని, సభ్య దేశాలు దాని ప్రాముఖ్యాన్ని గుర్తించి ఆమోదిస్తున్నాయని ప్రధాని చెప్పారు. ఇక ‘మహిళలకు గౌరవం’ గురించి ప్రస్తావిస్తూ- తన విదేశీ పర్యటనలలో్ భాగంగా ఓ దేశంలో ఎదురైన  అనుభవాన్ని ప్రధాని ప్రజలతో పంచుకున్నారు. ఈ మేరకు భారతదేశంలో మహిళలు సైన్స్‌-ఇంజనీరింగ్‌ చదువులు చదువుతున్నారా? అంటూ అక్కడి సీనియర్ మంత్రి ఒకరు ప్రశ్నించారని గుర్తుచేసుకున్నారు. దీనిపై స్పందిస్తూ- “మా దేశంలో నేడు ‘స్టెమ్‌’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) కోర్సులలో అబ్బాయిలకన్నా అమ్మాయిలు అధిక సంఖ్యలో ఉన్నారు” అని బదులిచ్చినట్లు ప్రధాని తెలిపారు. తదనుగుణంగా ప్రపంచం ఇవాళ మన సామర్థ్యం ఎంతటిదో ప్రత్యక్షంగా గమనిస్తున్నదని ఆయన తెలిపారు.

*****

SS/AKS


(Release ID: 1949061) Visitor Counter : 149