వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ రంగం ప్రముఖులు, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేసే వ్యక్తులకు వర్తించే అదనపు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం


ప్రభావితం చేసే విధంగా మాట్లాడే ముందు సర్టిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్లు, ఆరోగ్యం, సంరక్షణ నిపుణులు తమ అర్హతలను ధృవీకరించాల్సి ఉంటుంది.

తమను తాము ఆరోగ్య నిపుణులుగా మెడికల్ ప్రాక్టీషనర్లుగా చెప్పుకునే ప్రముఖులు, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేసే స్పష్టమైన నిరాకరణను అందించాలి

Posted On: 10 AUG 2023 2:03PM by PIB Hyderabad

ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ రంగం ప్రముఖులు, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేసే వ్యక్తులకు వర్తించే   అదనపు మార్గదర్శకాలను వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న వినియోగదారుల వ్యవహారాల శాఖ విడుదల చేసింది. తప్పుదోవ పట్టించే విధంగా విడుదల అవుతున్న  నిరోధానికి జారీ చేసిన 2022 జూన్ 9న జారీ చేసిన మార్గదర్శకాలకు అదనంగా వినియోగదారుల వ్యవహారాల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. 2023 జనవరి 20న విడుదల చేసిన  "ఎండార్స్‌మెంట్ నో-హౌస్!" గైడ్ బుక్‌లెట్ స్థానంలో నూతన మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి. 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) సహా అన్నిసంబంధిత వర్గాలతో సవివరంగా చర్చించిన తర్వాత ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ రంగం ప్రముఖులు, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేసే వ్యక్తులకు వర్తించే  అదనపు మార్గదర్శకాలను వినియోగదారుల వ్యవహారాల శాఖ సిద్ధం చేసింది. 

ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలకు అనుకూలంగా సాగుతున్న ప్రచారం పారదర్శకంగా సాగే విధంగా చూసి, తప్పుదోవ పట్టించే ప్రకటనలు,నిరాధారమైన ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో మార్గదర్శకాలు రూపొందాయి. నూతన  మార్గదర్శకాల ప్రకారం, సమాచారాన్ని పంచుకున్నప్పుడు, ఉత్పత్తులు లేదా సేవలను ప్రమోట్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా ఆరోగ్య సంబంధిత క్లెయిమ్‌లు చేస్తున్నప్పుడు, గుర్తింపు పొందిన సంస్థల నుండి ధృవీకరణ పత్రాలు కలిగి ఉన్న ధృవీకరించబడిన వైద్య అభ్యాసకులు, ఆరోగ్యం,ఫిట్‌నెస్ నిపుణులు తప్పనిసరిగా తాము  ధృవీకరించబడిన ఆరోగ్య/ఫిట్‌నెస్ నిపుణులు మరియు వైద్య అభ్యాసకులు అని తెలియజేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేస్తున్నప్పుడు ఉత్పత్తులు, సేవలు, కార్యక్రమాలతో తమకు సంబంధం లేదని ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ రంగం ప్రముఖులు, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేసే వ్యక్తులు స్పష్టంగా ప్రకటించాల్సి ఉంటుంది. తమ ప్రచారాలు ప్రజలు వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్స కోసం  ప్రత్యామ్నాయంగా చూడకూడదని ప్రేక్షకులు అర్థం చేసుకునేలా ప్రవర్తించాల్సి ఉంటుంది.  

ఆహార పదార్థాలు , న్యూట్రాస్యూటికల్స్, వ్యాధి నివారణ, చికిత్స లేదా నివారణ, వైద్య పరిస్థితులు, రికవరీ పద్ధతులు లేదా రోగనిరోధక శక్తిని పెంచడం మొదలైన వాటితో సహా ఆరోగ్య ప్రయోజనాలు వంటి అంశాలపై మాట్లాడేటప్పుడు లేదా అనుకూల ప్రచారం  చేస్తున్నప్పుడు ఈ బహిర్గతం లేదా నిరాకరణ అవసరం. ఈ బహిర్గతం లేదా నిరాకరణ  ఎండార్స్‌మెంట్‌లు, ప్రమోషన్‌లు లేదా ఆరోగ్య సంబంధిత ప్రకటనలు ప్రసారం అవుతున్న సమయంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. .

'నీరు తాగండి దప్పిక తీర్చుకోండి ', 'క్రమంగా వ్యాయామం చేయండి మరియు శారీరకంగా చురుకుగా ఉండండి', 'కూర్చోవడం టీవీ చూసే సమయాన్ని తగ్గించడండి' 'తగినంత మంచి నిద్ర పొందండి', 'త్వరగా కోలుకోవడానికి పసుపు పాలు త్రాగండి',   UV కిరణాల రక్షణ పొందడానికి  ప్రతిరోజూ సన్‌స్క్రీన్ ఉపయోగించండి'  'మెరుగైన పెరుగుదల కోసం జుట్టుకు నూనె రాయండి'లాంటి సాధారణ ప్రకటనలు,   నిర్దిష్ట ఉత్పత్తులు లేదా సేవలతో సంబంధం కలిగి ఉండని లేదా నిర్దిష్ట ఆరోగ్య పరిస్థితులు లేదా ఫలితాలు లక్ష్యంగా చేసుకోని వెలువడే ప్రకటనలు   ఈ నిబంధనల పరిధిలోకి రావు. 

 తమను తాము ఆరోగ్య నిపుణులు లేదా మెడికల్ ప్రాక్టీషనర్లుగా చూపించుకుంటూ  ప్రచారం నిర్వహించే  ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ రంగం ప్రముఖులు, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేసే వ్యక్తులు  వారి వ్యక్తిగత అభిప్రాయాలు మరియు వృత్తిపరమైన సలహాల మధ్య  తేడాను స్పష్టంగా  గుర్తించి,  నిరూపితమైన వాస్తవాలు లేకుండా నిర్దిష్ట ఆరోగ్య ప్రచారాలు  చేయదానికి దూరంగా ఉండాలని మార్గదర్శకాలు పేర్కొన్నాయి.  వృత్తిపరమైన వైద్య సలహా, ఉత్పత్తులు లేదా సేవల గురించి పూర్తి సమాచారం కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించే విధంగా  ప్రేక్షకులను ప్రోత్సహించాలని మార్గదర్శకాల్లో సిఫార్సు చేశారు. .

వినియోగదారుల వ్యవహారాల శాఖ మార్గదర్శకాల అమలును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంది.  అమలు చేస్తుంది. ఉల్లంఘనలకు వినియోగదారుల రక్షణ చట్టం 2019 మరియు చట్టంలోని ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తారు. 

 వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి మరియు సరసమైన, పారదర్శక మార్కెట్‌ను ప్రోత్సహించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ కృషి చేస్తోంది.  పెరుగుతున్న ప్రభావవంతమైన డిజిటల్ నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు  పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడి, వినియోగదారుల ప్రయోజనాలను రక్షిస్తాయి. 

కొత్త మార్గదర్శకాలపై మరింత సమాచారం కోసం,

https://consumeraffairs.nic.in/sites/default/files/fileuploads/latestnews/Additional%20Influencer%20Guidelines%20for%20Health%20and%20Wellness%20Celebrities%2C%20Influencers%20Influencers%20Influencers  సందర్శించండి:

 

***


(Release ID: 1947491) Visitor Counter : 243