ప్రధాన మంత్రి కార్యాలయం

డిజిటల్ హెల్థ్ సదుపాయాలను ప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 05 AUG 2023 9:29AM by PIB Hyderabad

డిజిటల్ హెల్థ్ సదుపాయాల ద్వారా కోట్ల కొద్దీ ప్రజల కు ప్రయోజనాలు సమృద్ధం గా లభిస్తుండడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమిత సంతృప్తి ని వ్యక్తం చేశారు.

 

అసాంక్రామిక వ్యాధుల సంబంధి జాతీయ కార్యక్రమం లో భాగం గా ఎన్ సిడి పోర్టల్ మాధ్యం ద్వారా 5 కోట్ల కు పైచిలుకు ఆయుష్మాన్ భారత్ హెల్థ్ అకౌంట్స్ (ఎ బి హెచ్ ఎ ) తెరవడమైందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవియా ఒక ట్వీట్ లో తెలిపారు.

 

కేంద్ర మంత్రి ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

"చాలా మంచి సమాచారం. దేశ వ్యాప్తంగా ఉన్న మన పేద సోదరులు, పేద సోదరీమణులకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు లభించాలి. ఇదే మా ప్రాధాన్యంగా ఉంది. డిజిటల్ రూపు ను సంతరించుకొంటున్న ఈ సౌకర్యాల తో కొట్ల కొద్దీ మంది కి వీటి ప్రయోజనం చాలినంత గా లభిస్తుండడం అత్యంత సంతృప్తి ని కలిగించే విషయం." అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

 

***

DS/ST



(Release ID: 1946152) Visitor Counter : 104