ప్రధాన మంత్రి కార్యాలయం
దేశం లో ప్రతి ఒక్క ప్రాంతం లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆచరణ లోకి తీసుకువచ్చే నిబద్ధత ను పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి
Posted On:
02 AUG 2023 9:43PM by PIB Hyderabad
దేశం నలుమూలలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆచరణ లోకి తీసుకువచ్చే విషయం లో నిబద్ధత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అనేక జిల్లాల లో మూడు లక్షల కు పైగా 5జి సైట్స్ ను స్థాపించడం లో సాధించినటువంటి సాఫల్యం మన ఈ సాంకేతిక విజ్ఞాన సంబంధి ప్రయాణం లో ఒక మైలురాయి అనదగ్గ కార్యసిద్ధి అని ఆయన అన్నారు.
ప్రపంచం లో రెండో అతి పెద్దది అయినటువంటి 5జి ఇకో సిస్టమ్ ను గురించి ఎలక్ట్రానిక్స్ మరియు సాంకేతిక విజ్ఞానం శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘డిజిటల్ కనెక్టివిటి లో భారతదేశం దూసుకుపోతున్నది. అనేక జిల్లాల లో మూడు లక్షల కు పైచిలుకు 5జి సైట్స్ ను స్థాపించడం లో సాధించినటువంటి సాఫల్యం మన సాంకేతిక విజ్ఞాన సంబంధి ప్రయాణం లో ఒక మైలురాయి ని సూచిస్తున్నది. ఇంత వేగం గా 5జి ని ప్రవేశపెట్టడం దేశం లోని ప్రతి ఒక్క ప్రాంతాని కి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా ప్రజల జీవనం లో పరివర్తన ను తీసుకురావాలన్న మరియు ప్రగతి కి జోరును అందించాలన్న మన నిబద్ధత ను చాటిచెబుతున్నది.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 1945369)
Visitor Counter : 142
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam