గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మే, 2023లో 6.4% పెరిగిన మొత్తం ఖ‌నిజ ఉత్ప‌త్తి


ఏప్రిల్‌-మే 2022-2023లో 5.8%కి చేరుకున్న సంచిత వృద్ధి

సానుకూల వృద్ధిని సూచించిన ప‌ది ముఖ్య ఖ‌నిజాలు

Posted On: 25 JUL 2023 12:35PM by PIB Hyderabad

 మే నెల 2023 (ఆధారంః 2011-12 =100) మైనింగ్ & క్వారీ రంగంలో ఖ‌నిజ ఉత్ప‌త్తి సూచీ 128.1గా ఉన్న‌ది. ఇది మే 2022లో గ‌ణాంకాల‌తో పోలిస్తే 6.4% అధికం. ఇండియ‌న్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబిఎం) తాత్కాలిక గ‌ణాంకాల ప్ర‌కారం ఏప్రిల్‌- మే, 2022-23 కాలంలో సంచిత వృద్ధి, అంత‌కు ముందు ఏడాదిలో ఇదే కాలంలో పోలిస్తే 5.8% ఎక్కువ‌. 
మే నెల 2023లో ముఖ్య‌మైన ఖ‌నీజాల ఉత్ప‌త్తి ఈ విధంగా ఉంది - బొగ్గు 762 ల‌క్ష‌లు, లిగ్నైట్ 35 ల‌క్ష‌లు, పెట్రోలియం (ముడి) 25 ల‌క్ష‌లు, ఇనుము ధాతువు 253 ల‌క్ష‌లు, సున్న‌పు రాయి 387 ల‌క్ష‌ల ట‌న్నుల చొప్పున ఉండ‌గా, స‌హ‌జ వాయువు (వినియోగించిన‌) 2838 క్యూబిక్ మీట‌ర్లు, బాక్సైట్ 2386000, క్రోమైట్ 372000, సాంద్ర తామ్రం 9000,  సాంద్ర సీసం 33000, మాంగ‌నీస్ ధాతువు 329000, సాంద్ర త‌గ‌రం 133000, ఫాస్ఫ‌రేట్ 14000, మాగ్నెసైట్ 11000 ట‌న్నుల చొప్పున‌, బంగారం 97 కేజీలుగా ఉంది. 
మే 2022తో పోలిస్తే మే 2023లో సానుకూల వృద్ధి సాధించిన ఖనిజాల‌లో - మాంగ‌నీసు ధాతువు (40.4%)చ మాగ్న‌సైట్ (28.2%), సాంద్ర తామ్రం (24.4%), క్రోమైట్ (16.3%), సున్న‌పు రాయి (10.1%), సాంద్ర సీసం (9.7%), బొగ్గు (7%), బాక్సైట్ (4.8%), సాంద్ర త‌గ‌రం (2.9%) ఉన్నాయి. అదే స‌మ‌యంలో, ప్ర‌తికూల లేక తిరోగ‌మ‌న వృద్ధి చూపించిన ముఖ్య ఖ‌నిజాల‌లో స‌హ‌జ‌వాయువు (యు) (0.3%), పెట్రోలియం (ముడి) (-1.9%), పాస్ఫొరేట్ (-6.3%),లిగ్నైట్ (-17.7%) ఉన్నాయి. 

 

***


(Release ID: 1942646) Visitor Counter : 140