ప్రధాన మంత్రి కార్యాలయం
ఇరవై అయిదో ఏశియన్ అథ్లెటిక్స్ చాంపియన్ శిప్ 2023 లో27 పతకాల ను గెలిచినందుకు భారతదేశం దళాని కి అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
17 JUL 2023 12:17PM by PIB Hyderabad
ఇరవై అయిదో ఏశియన్ అథ్లెటిక్స్ చాంపియన్ శిప్ 2023 లో అద్భుతమైనటువంటి ప్రదర్శన ను ఇచ్చినందుకు గాను భారతదేశం యొక్క క్రీడాకారులు, క్రీడాకారిణుల దళాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. భారతీయ క్రీడాకారులు, క్రీడాకారిణుల దళం ఈ చాంపియన్ శిప్ లో 27 పతకాల ను చేజిక్కించుకొని విదేశీ గడ్డ మీద జరిగిన ఏదైనా చాంపియన్ శిప్ లో ఇంతవరకు అన్నిటికంటే ఎక్కువ పతకాల ను గెలిచిన కీర్తిప్రమాణాన్ని ఏర్పరచింది.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఇరవై అయిదో ఏశియన్ అథ్లెటిక్స్ చాంపియన్ శిప్ -2023 లో భారతదేశ క్రీడాకారుల దళం యొక్క సర్వో త్కృష్టమైనటువంటి ప్రదర్శన.
మన క్రీడాకారులు, క్రీడాకారిణు లు 27 పతకాల ను గెలిచారు. ఒక విదేశీ గడ్డ మీద ఏదైనా చాంపియన్ శిప్ లో పతకాల పట్టిక లో ఇదే అత్యధికం. ఈ కార్యసిద్ధి కి గాను మన క్రీడాకారులు, క్రీడాకారిణుల కు ఇవే అభినందన లు. దీనితో మన ఛాతీ గర్వం తో ఉప్పొంగిపోయింది.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1940186)
Visitor Counter : 148
Read this release in:
Marathi
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Punjabi
,
Gujarati