హోం మంత్రిత్వ శాఖ
"మాదకద్రవ్యాల రవాణా & జాతీయ భద్రత" అంశంపై సోమవారం న్యూదిల్లీలో జరిగే ప్రాంతీయ సదస్సుకు అధ్యక్షత వహించనున్న కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా
సదస్సు సందర్భంగా, అన్ని రాష్ట్రాల ఏఎన్‌టీఎఫ్‌ల సహకారంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 1,44,000 కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేయనున్న ఎన్‌సీబీ
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో మాదకద్రవ్య రహిత భారతదేశాన్ని సృష్టించేందుకు ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం
2022 జూన్ 01 నుంచి 2023 జులై 15 వరకు, వివిధ రాష్ట్రాల్లో దాదాపు రూ.9,580 కోట్ల విలువైన 8,76,554 కిలోల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న NCB, ANTFల ప్రాంతీయ బృందాలు; లక్ష్యం కంటే ఇది 11 రెట్లు ఎక్కువ
సోమవారం నాటి మాదకద్రవ్యాల విధ్వంసంతో కలిపి ఒక్క ఏడాదిలో ధ్వంసం చేసిన మాదకద్రవ్యాలు పరిమాణం 10 లక్షల కిలోలకు చేరుకుంటుంది, దాని విలువ రూ.12 వేల కోట్లు
మాదకద్రవ్య రహిత భారతదేశం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసేందుకు, ఇనుమడించిన ఉత్సాహంతో చురుగ్గా కొనసాగుతున్న మాదకద్రవ్యాల విధ్వంస కార్యక్రమం
Posted On:
16 JUL 2023 2:39PM by PIB Hyderabad
"మాదకద్రవ్యాల రవాణా & జాతీయ భద్రత" అంశంపై సోమవారం న్యూదిల్లీలో జరిగే ప్రాంతీయ సదస్సుకు కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు. సదస్సు సందర్భంగా, అన్ని రాష్ట్రాల ఏఎన్‌టీఎఫ్‌ల సహకారంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 1,44,000 కిలోల మాదకద్రవ్యాలను ఎన్‌సీబీ ధ్వంసం చేస్తుంది. ధ్వంసం చేయబోయే మాదకద్రవ్యాల్లో, ఎన్‌సీబీ హైదరాబాద్ కేంద్రం 6590 కిలోలు, ఇండోర్ కేంద్రం 822 కిలోలు, జమ్ము కేంద్రం 356 కిలోలు ధ్వంసం చేస్తాయి. దీంతో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ చట్ట సంస్థలు మొత్తం 1,44,122 కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేయనున్నాయి. ఇందులో, అసోంలో 1,486 కిలోలు, చండీగఢ్‌లో 229 కిలోలు, గోవాలో 25 కిలోలు, గుజరాత్‌లో 4,277 కిలోలు, హరియాణాలో 2,458 కిలోలు, జమ్ము&కశ్మీర్‌లో 4,069 కిలోలు, మధ్యప్రదేశ్‌లో 1,03,884 కిలోలు, మహారాష్ట్రలో 159 కిలోలు, త్రిపురలో 1,803 కిలోలు, ఉత్తరప్రదేశ్‌లో 4,049 కిలోలు ఉన్నాయి.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో, మాదకద్రవ్య రహిత భారతదేశాన్ని సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తోంది. 2022 జూన్ 01 నుంచి 2023 జులై 15 వరకు, NCB, ANTF రాష్ట్ర బృందాలు దాదాపు రూ.9,580 కోట్ల విలువైన 8,76,554 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇది, లక్ష్యం కంటే 11 రెట్లు ఎక్కువ. సోమవారం నాటి మాదకద్రవ్యాల విధ్వంసంతో కలిపి, ఒక్క ఏడాదిలో ధ్వంసం చేసిన మాదకద్రవ్యాల పరిమాణం దాదాపు 10 లక్షల కిలోలకు చేరుకుంటుంది, దాని విలువ దాదాపు రూ.12,000 కోట్లు. మాదకద్రవ్య రహిత భారతదేశం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసేందుకు, మాదకద్రవ్యాల ధ్వంసం కార్యక్రమం ఇనుమడించిన ఉత్సాహంతో చురుగ్గా కొనసాగుతోంది.
*****
(Release ID: 1940089)
Visitor Counter : 189