బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు మంత్రిత్వ శాఖ బొగ్గు వాయుకరణం ప్రోత్సహించేందుకు రూ.6000 కోట్ల విలువైన ప్రాజెక్టులతో కూడిన సమగ్ర పథకాన్ని పరిశీలిస్తోంది.


2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్‌పై దృష్టి

పరిశీలనలో ఉన్న గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్‌లకు జీ ఎస్ టీ పరిహారం సెస్ తిరిగి చెల్లింపు

Posted On: 14 JUL 2023 12:20PM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ బొగ్గు గ్యాసిఫికేషన్ శక్తిని వినియోగించుకోవడంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తూ 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రతిపాదనతో, బొగ్గు మంత్రిత్వ శాఖ దేశ పురోగతిని ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిపాదనలో సహజ వనరులను ఉపయోగించుకునే మరియు బొగ్గు గ్యాసిఫికేషన్ యొక్క ఆర్థిక మరియు సాంకేతిక సాధ్యతను ప్రదర్శించే సమగ్ర చర్యలు వున్నాయి. ఈ చొరవ ఇతర రంగాలను ఉత్తేజపరిచేటడం ద్వారా దేశ భవిష్యత్తు ఇంధన అవసరాలను తీర్చడానికి ఉపకరిస్తుంది.

 

భారతదేశంలో గ్యాసిఫికేషన్ టెక్నాలజీని స్వీకరించడం వల్ల బొగ్గు రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి, సహజ వాయువు, మిథనాల్, అమ్మోనియా మరియు ఇతర ముఖ్యమైన ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. ప్రస్తుతం, భారతదేశం దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి దాదాపు 50% సహజ వాయువును, మొత్తం మిథనాల్ వినియోగంలో 90% పైగా మరియు మొత్తం అమ్మోనియా వినియోగంలో 13-15% దిగుమతి చేసుకుంటోంది. ఆత్మనిర్భర్‌గా మారాలనే భారతదేశ దృష్టికి ఇది  దోహదపడుతుంది అలాగే ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.  2030 నాటికి బొగ్గు గ్యాసిఫికేషన్ అమలు తో దిగుమతులను తగ్గించడం ద్వారా దేశ అభివృద్ధికి గణనీయమైన కృషి చేస్తుందని అంచనా. ఈ చొరవ కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మరియు సుస్థిరమైన పద్ధతులను పెంపొందించడం ద్వారా పర్యావరణం పై కర్భన భారాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంది, మన ప్రపంచ ఒప్పందాల అమలుకు పచ్చటి భవిష్యత్తు కు దోహదం చేస్తుంది.

 

బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు మంత్రిత్వ శాఖ వినూత్న చర్యలు తీసుకుంటోంది. ఈ లక్ష్యానికి అనుగుణంగా, బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రైవేట్ రంగానికి 6,000 కోట్ల రూపాయలతో  మంత్రిత్వ శాఖ ఒక సమగ్ర పథకాన్ని పరిశీలిస్తోంది.

 

బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ పథకం కోసం సంస్థల ఎంపిక పోటీ మరియు పారదర్శక బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా నిర్వహించబడుతుంది. ఇంకా, ప్రభుత్వం అర్హతగల ప్రభుత్వ పీ ఎస్ యూ లకు బడ్జెట్ మద్దతును అందించడం అలాగే బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రైవేట్ రంగం చేపట్టేందుకు వీలు కల్పించే  విధానాల గురించి ఆలోచిస్తోంది. మొదటి విభాగంలో, ప్రభుత్వ పీ ఎస్ యూలకు ప్రభుత్వం మద్దతునిస్తుంది. రెండవ విభాగం ప్రైవేట్ రంగం మరియు ప్రభుత్వ పీ ఎస్ యూలు రెండింటికీ మద్దతునిస్తుంది, ప్రతి ప్రాజెక్ట్‌కు బడ్జెట్ కేటాయింపు మంజూరు చేయబడింది. నీతి ఆయోగ్‌తో సంప్రదించి రూపొందించిన ప్రమాణాలతో, ఈ సెగ్మెంట్ కింద కనీసం ఒక ప్రాజెక్ట్ ఎంపిక సుంకం ఆధారిత బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా నిర్ణయించబడుతుంది. చివరగా, మూడవ విభాగంలో స్వదేశీ సాంకేతికత మరియు/లేదా చిన్న-స్థాయి సంస్థలు ఉత్పత్తి-ఆధారిత గ్యాసిఫికేషన్ ప్లాంట్‌లను ఉపయోగించి ప్రదర్శన ప్రాజెక్టులకు బడ్జెట్ మద్దతును అందించడం ఉంటుంది.

 

పైన పేర్కొన్న పథకంతో పాటు, వాణిజ్య కార్యాచరణ తేదీ  తర్వాత 10 సంవత్సరాల కాలానికి గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులలో ఉపయోగించే బొగ్గుపై వస్తువులు మరియు సేవల పన్ను (జీ ఎస్ టీ) పరిహారం సెస్‌ను తిరిగి చెల్లించే ప్రోత్సాహాన్ని కూడా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. జీ ఎస్ టీ

పరిహారం సెస్ ఎఫ్ వై 27 తర్వాత పొడిగించబడింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేయడంలో సంస్థల అశక్తతతను భర్తీ చేయడం ఈ ప్రోత్సాహకం లక్ష్యం.

 

అంతేకాకుండా, కోల్ ఇండియా లిమిటెడ్ బొగ్గు క్షేత్రాలలో ఉపరితల బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంలో సహకార ప్రయత్నాలను మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తుంది. అక్టోబరు 2022లో, బీ హెచ్ ఈ ఎల్ మరియు సీ ఐ ఎల్ మధ్య అవగాహన ఒప్పందం, అలాగే ఐ ఓ సీ ఎల్, గైల్ మరియు సీ ఐ ఎల్ మధ్య ఒక అవగాహన ఒప్పందంతో సహా వ్యూహాత్మక ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఈ సహకారాలు ఎస్ సీ జీ ప్రాజెక్ట్‌ల అమలులో సహకారం మరియు నైపుణ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

 

సీ ఐ ఎల్ బోర్డు ఈ సీ ఎల్, ఎం సీ ఎల్ మరియు డబ్ల్యు సీ ఎల్ల మూడు ప్రాజెక్ట్‌లకు ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికలను ఆమోదించింది. స్థల సర్వే, భూ పరిశీలన మరియు నీటి లభ్యత అధ్యయనాలు వంటి ముందస్తు ప్రాజెక్ట్ కార్యకలాపాల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. సంబంధిత ప్రాజెక్ట్‌ల కోసం సవివరమైన సాధ్యాసాధ్యాల నివేదిక తయారీకి అవసరమైన స్థిర ధరలకు చేరుకోవడానికి టెండరింగ్ కార్యకలాపాలు కూడా చేపట్టబడుతున్నాయి. పై జాయింట్ వెంచర్ల ఏర్పాటుకు సీ ఐ ఎల్ బోర్డు 'సూత్రప్రాయ' ఆమోదం కూడా ఇచ్చింది. ప్రస్తుతం, జాయింట్ వెంచర్ ఒప్పందానికి సంబంధించిన చర్చలు మరియు ఖరారు పురోగతిలో ఉన్నాయి.

 

బొగ్గు మంత్రిత్వ శాఖ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది, బొగ్గును వివిధ విలువైన ఉత్పత్తులుగా మార్చడానికి అపారమైన సామర్ధ్యం దీనితో ఒనగూరే అవకాశం ఉంది. ప్రతిపాదిత పథకం మరియు ప్రోత్సాహకాలు ప్రభుత్వ పీ ఎస్ యూ లు మరియు ప్రైవేట్ రంగాన్ని ఆకర్షించడానికి రూపొందించబడ్డాయి, బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలో ఆవిష్కరణలు, పెట్టుబడులు మరియు సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి.

***


(Release ID: 1939658) Visitor Counter : 186