హోం మంత్రిత్వ శాఖ
ఎన్.ఎఫ్.టిలు, కృత్రి మ మేథ, మెటావర్స్ కాలంలో నేర నియంత్రణ, భద్రతకు సంబంధించిన జి 20 సమావేశాన్ని హర్యానాలోని గుర్గాంలో
దేశంలోని ఏడు ప్రముఖ విద్యాసంస్థల నుంచి సైబర్ వలంటీర్ స్క్వాడ్లను ప్రారంభించనున్న శ్రీ అమిత్ షా.
సదస్సుకు సంబంధించిన మెడల్ ను కూడా ఆవిష్కరించనున్న మంత్రి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గనిర్దేశంలో సైబర్ భద్రత కలిగిన భారత దేశాన్ని నిర్మించడం,
కేంద్ర హోంమంత్రిత్వశాఖ అత్యంత ప్రాధాన్యతాంశాలుగా చేపట్టినవాటిలో ఒకటి.
2023 జూలై13,14 తేదీలలో రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో జి.20 దేశాల నుంచి ,
9 ప్రత్యేక ఆహ్వానిత దేశాల నుంచి ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థలు, ఇండియా ,ప్రపంచంలోని వివిధ దేశాల
నుంచి సాంకేతిక నిపుణులు, డొమైన్ నిపుణులు
సుమారు 900 మంది ఈ సమావేశాలలో పాల్గొంటారు.
సురక్షితమైన సైబర్ వాతావరణాన్ని కల్పించేందుకు అంతర్జాతీయయ భాగస్వామ్యానికి ఈ సదస్సు వీలు కల్పిస్తుంది. అలాగే సైబర్ భద్రతకు సంబంధించి వ్యక్తమౌతున్న ఆందోళనలను ప్రాధాన్యతాంశంగా చేపట్టడానికి ఇది వీలు కల్పిస్తోంది. అధునాతన ఆలోచనలకు, విజ్ఞానమార్పిడికి, ప్రపంచవ్యాప్తంగా దార్శనికులతో నెట్వర్క్ కావడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.ఈ సదస్సు సందర్భంగా ఆరు టెక్ని
Posted On:
11 JUL 2023 5:11PM by PIB Hyderabad
ఎన్.ఎఫ్.టిలు, కృత్రి మ మేథ, మెటావర్స్ కాలంలో నేర నియంత్రణ, భద్రతకు సంబంధించిన జి 20 సమావేశాన్ని హర్యానాలోని గుర్గాంలో
2023 జూలై 13 న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించనున్నారు. దేశంలోని ఏడు ప్రముఖ విద్యాసంస్థల నుంచి సైబర్ వలంటీర్ స్క్వాడ్లను శ్రీ అమిత్ షా ప్రారంభించనున్నారు.
సదస్సుకు సంబంధించిన మెడల్ ను కూడా ఆయన ఆవిష్కరిస్తారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గనిర్దేశంలో
సైబర్ భద్రత కలిగిన భారత దేశాన్ని నిర్మించడం, కేంద్ర హోంమంత్రిత్వశాఖ అత్యంత ప్రాధాన్యతాంశాలుగా చేపట్టినవాటిలో ఒకటి.
జూలై13,14 తేదీలలో రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో జి.20 దేశాల నుంచి , 9 ప్రత్యేక ఆహ్వానిత దేశాల నుంచి ప్రతినిధులు,
అంతర్జాతీయ సంస్థలు, ఇండియా ,ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సాంకేతిక నిపుణులు, డొమైన్ నిపుణులు సుమారు 900 మంది ఈ సమావేశాలలో పాల్గొంటారు.
సురక్షితమైన సైబర్ వాతావరణాన్ని కల్పించేందుకు అంతర్జాతీయయ భాగస్వామ్యానికి ఈ సదస్సు వీలు కల్పిస్తుంది. అలాగే సైబర్ భద్రతకు సంబంధించి వ్యక్తమౌతున్న ఆందోళనలను ప్రాధాన్యతాంశంగా చేపట్టడానికి ఇది వీలు కల్పిస్తోంది.
అధునాతన ఆలోచనలకు, విజ్ఞానమార్పిడికి, ప్రపంచవ్యాప్తంగా దార్శనికులతో నెట్వర్క్ కావడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఈ సదస్సు సందర్భంగా ఆరు టెక్నికల్ సెషన్లు, ఎగ్జిబిషన్లు ఉంటాయి.
ఇందులో ఐసిటి రంగంలోని ఆయా సంస్థలు తయారు చేసే జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులను ప్రదర్శించడానికి వీలు కలుగుతుంది..ఈ సదస్సులో సైబర్ భద్రత, సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలు, ముఖ్యంగా నాన్ ఫంగిబుల్ టోకెన్స్ (ఎన్.ఎఫ్.టి), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), మెటా వర్స్ కాలంలో సైబర్ నేరాల అదుపునకు తీసుకోవలసిన చర్యలపై సమావేశంలో దృష్టిపెడతారు.
అంతర్జాతీయంగా భద్రతా పరమైన అంశాలలో సైబర్ భద్రత ఒక కీలకమైన అంశంగా మారింది. ఆర్ధిక, భౌగోళిక,రాజకీయ అంశాలు ఇందులో ముడిపడి ఉండడంతో దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టవలసి ఉంది.
జి 20 వేదిక సైబర్ భద్రతపై మరింత దృష్టిపెడుతుండడంతో ఇది కీలక సమాచార మౌలికసదుపాయాలు, డిజిటల్ పబ్లిక్ ప్లాట్ఫారంల భధ్రత, సమగ్రతకు తోడ్పడనుంది.
జి 20 ఫోరంలో సైబర్ భద్రత, సైబర్ నేర నియంత్రణకు సంబంధించిన చర్చలు, సమాచార సేకరణ ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేయడానికి ఉపకరిస్తాయి.
ఎన్.ఎఫ్.టిలు, ఎఐలు, మెటావర్స్ కాలంలో నేర నియంత్రణ, భద్రతకు జి 20 సదస్సు మంచి వేదిక కానుంది. ఇందులో ఈ రంగాలకు సంబంధించిన ఆధునిక ఆలోచనలు పంచుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఈ రంగాలలో కృషి చేస్తున్న దార్శనికకులతో కలసి పనిచేయడానికి,
వీలుకలుగుతుంది. అంతర్జాతీయంగా పేరున్న సైబర్ నిపుణులు, ప్రముఖ ఉపన్యాసకులు, న్యాయరంగ నిపుణులు, విద్యారంగానికి చెందిన వారు, శిక్షణ సంస్థలు, ఆర్ధిక సంస్థలు, ఫిన్టెక్, సోషల్ మీడియా ఇంటర్మీడియరీలు,
ఐసిటి,సైబర్ ఫోరెన్సిక్, రెగ్యులేటర్లు,స్టార్టప్లు, ఒటిటి సర్వీసు ప్రొవైడర్లు, ఈ కామర్స్ కంపెనీలు, ఇతర రంగాలకు చెందిన వారు ఈ సదస్సులో పాల్గొంటారు.
అలాగే వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖు, సంస్థలు, ఏజెన్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పాలనాధికారులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి డిజిపిలు కూడా ఇందులో పాల్గొంటారు.
2023 జూలై 13న ప్లీనరీ సమావేశంతో ప్రారంభమౌతుంది. ఆ తర్వాత సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కింది అంశాలపై ఆరు టెక్నికల్ సెషన్ లు ఉంటాయి.
1.ఇంటర్నెట్ గవర్నెన్స్ – జాతీయ బాధ్యత, గ్లోబల్ కామన్స్
2. డిజిటైజేషన్ ముమ్మరంగా పెరిగిన దశలో డిపిఐ సమకూర్చుకోవడం,డిజైన్, నిర్మాణం,పాలసీలు,సన్నద్ధత
3. విస్తారిత వాస్తవికత, మెటావర్స్, భవిష్యత్ డిజిటల్ యాజమాన్యం–న్యాయ, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్
4. కృత్రిమ మేథ: బాధ్యతాయుత వినియోగం, సవాళ్లు, అవకాశాలు
5. లోపాల సవరణ : క్రిప్టో కరెన్సీ, డార్క్నెట్ రంగంలో సవాళ్లు
6. ఐసిటిని నేరపూరిత కార్యకలాపాలకు వాడకుండా నిరోధం: ఈరంగంలో అంతర్జాతీయ సహకారానికి ఫ్రేమ్వర్క్
ఈ సదస్సుతోపాటు, ఐసిటి రంగంలో పనిచేస్తున్న వివిధ సంస్థలు, పరిశ్రమలు రూపొందించిన జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తారు. ఈ
ఈ సమావేశం ముగింపు ఉత్సవంతో పూర్తి అవుతుంది. ఈ ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ప్రసంగిస్తారు.
ఈ సదస్సును కేంద్ర హోంమంత్రిత్వశాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, జాతీయ భద్రతా సెక్రటేరియట్, డిపార్టమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. దీనితోపాటు ఇంటర్పోల్, డ్రగ్స్,నేరాలపై ఐక్యరాజ్య సమితి కార్యాలయం, రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ, డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు, అమృతా విశ్వవిద్యాలయం వంటివి ఈ సదస్సుకు ఇతర భాగస్వామ్య సంస్థలుగా ఉన్నాయి.
***
(Release ID: 1938834)
Visitor Counter : 221