సహకార మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలో జూలై 14న "ఎఫ్‌పిఓల ద్వారా పిఏసిఎస్ లను బలోపేతం" అనే అంశంపై ఏర్పాటైన ఒక రోజు మెగా సదస్సును ప్రారంభించనున్నకేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా


రైతు ఉత్పత్తి సంస్థల (ఎఫ్‌పిఓ) ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను (పిఏసిఎస్) బలోపేతం చేయడానికి గల అవకాశాలను చర్చించనున్న మెగా సదస్సు

" సహకారం ద్వారా సమృద్ధి" సాధించాలి అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా శ్రీ అమిత్ షా కృషితో ఇటీవల సహకార రంగంలో 1100 ఎఫ్‌పిఓ లను కొత్తగా ఏర్పాటుచేయాలని నిర్ణయించిన కేంద్రం

క్లస్టర్ ఆధారిత వ్యాపార సంస్థలను (సిబిబిఓ) ప్రోత్సహించి ఎఫ్‌పిఓల సామర్ధ్యం పెంపుదలఖ్ కోసం ఒక్కో ఎఫ్‌పిఓ కి 25 లక్షలు ఆర్థిక సహకారం

వ్యవసాయాన్నిలాభావంతం చేయడం, జీవనోపాధిని పెంపొందించడం, వ్యవసాయంపై ఆధారపడిన వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలోఎఫ్‌పిఓ లు కీలక పాత్ర పోషిస్తాయి.

చిన్న, సన్నకారు రైతులు/ ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులకు మెరుగైన ధరలను పొందేందుకు, రవాణా ఖర్చును తగ్గించడానికి , మొత్తం ఉత్పాదకతను పెంచడంలో సహాయపడనున్న ఎఫ్‌పిఓ

Posted On: 10 JUL 2023 2:57PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో  జూలై 14న "ఎఫ్‌పిఓల ద్వారా   పిఏసిఎస్ లను బలోపేతం" అనే అంశంపై ఏర్పాటైన ఒక రోజు మెగా సదస్సును కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభిస్తారు. రైతు ఉత్పత్తి సంస్థల  (ఎఫ్‌పిఓ) ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను (పిఏసిఎస్) బలోపేతం చేయడానికి గల అవకాశాలను మెగా సదస్సులో చర్చిస్తారు.  

సదస్సులో ఈ రంగానికి చెందిన నిపుణులు, దేశవ్యాప్తంగా ఉన్న ఎఫ్‌పిఓ లకు చెందిన ప్రతినిధులు   పాల్గొంటారు. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సహకారంతో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NCDC) ఈ మెగా సదస్సును  నిర్వహిస్తోంది.

ఎఫ్‌పిఓ లో రైతులు సభ్యులుగా ఉంటారు. వనరులను సమీకరించడం, రైతుల  బేరసారాల శక్తిని ఎక్కువ చేసి ఉత్పత్తికి ఎక్కువ ధర పొందడానికి ఎఫ్‌పిఓ సహకరిస్తుంది." సహకారం ద్వారా సమృద్ధి" సాధించాలి అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా  శ్రీ అమిత్ షా కృషితో ఇటీవల సహకార రంగంలో 1100 ఎఫ్‌పిఓ లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

సహకార మంత్రిత్వ శాఖ నుంచి అందిన ప్రతిపాదన మేరకు  వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల ఎన్సిడీసీ కి అదనపు బ్లాకులను కేటాయించి సహకార రంగంలో 1100 ఎఫ్‌పిఓ ల   ఏర్పాటుకు సహకరించింది.  ఈ పథకం కింద పిఏసిఎస్ ల పనితీరు మెరుగుపడేలా చూసి   సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన సహకారం అందిస్తారు.  చిన్న  సన్నకారు రైతుల సంక్షేమం లక్ష్యంగా పథకం అమలు జరుగుతోంది. 

ఎఫ్‌పిఓ పథకం కింద ప్రతి ఎఫ్‌పిఓ   కి రూ.33 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు. ఎఫ్‌పిఓలను ప్రోత్సహించి, వాటి పని తీరు మెరుగుపడేలా చూసేందుకు  క్లస్టర్ ఆధారిత వ్యాపార సంస్థల తరగతి ఒక్కో   ఎఫ్‌పిఓ  కి 25 లక్షలు రూపాయల ఆర్థిక సహకారం అందుతుంది. 

వ్యవసాయాన్ని స్థిరంగా సాగించడానికి,  జీవనోపాధి అవకాశాలు ఎక్కువ చేయడం, వ్యవసాయంపై ఆధారపడిన జీవిస్తున్న వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచంలో ఎఫ్‌పిఓలు కీలక పాత్ర పోషిస్తున్నాయి చిన్న, సన్నకారు రైతులు/ ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులకు  మెరుగైన ధరను పొందేందుకు, రవాణా ఖర్చు తగ్గించడానికి,మొత్తం ఉత్పాదకతను పెంచడంలో ఎఫ్‌పిఓ ల పాత్ర కీలకంగా ఉంటుంది. 

ఎఫ్‌పిఓ పథకం పరిధిలోకి పిఏసిఎస్ లను తీసుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు అమలు చేస్తోంది. దీనివల్ల రైతులు తమ వ్యాపార కార్యకలాపాలు విస్తరించడానికి అవకాశం కలుగుతుంది. వ్యవసాయానికి అవసరమైన ముడి సరుకుల సేకరణ,  వ్యవసాయ పరికరాల సేకరణ, ప్రాసెసింగ్ , గ్రేడింగ్, ప్యాకింగ్ లాంటి కార్యక్రమాలు అమలు చేసి  విలువ జోడింపు కార్యక్రమాలు సమర్ధంగా చేపట్టడానికి అవకాశం కలుగుతుంది.

పిఏసిఎస్ లలో  దాదాపు 13 కోట్ల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు,  స్వల్పకాలిక రుణాలు, విత్తనాలు, ఎరువులు మొదలైన కార్యక్రమాలను పిఏసిఎస్ లు అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 86% కంటే ఎక్కువ మంది  చిన్న ,సన్నకారు రైతులు ఉన్నారు. 

చిన్న, సన్నకారు  రైతులకు మెరుగైన సాంకేతికత,రుణ పరపతి అందించడం,నాణ్యమైన  విత్తనాలు సరఫరా చేసి ఉత్పత్తుల నాణ్యత ఎక్కువ చేసి రైతులకు మార్కెట్ అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం  పిఏసిఎస్ లో సభ్యత్వం ఉన్న రైతులు  ఎఫ్‌పిఓ లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రోత్సాహం అందిస్తూ చర్యలు అమలు చేస్తోంది.  దీనిలో భాగంగా  కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్‌పిఓలు) ఏర్పాటు చేయడానికి  కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 

 ఉత్పత్తి,ఉత్పాదకత పెంచడాని,పంట అనంతర సౌకర్యాలు కల్పించడం, సహకార సంఘాల ఏర్పాటు, సహకార సంఘాలను ప్రోత్సహించడం, సహకార సంస్థలకు అవసరమైన ఆర్థిక సహకారం అందించడం లాంటి కార్యక్రమాలను  సహకార మంత్రిత్వ శాఖ పరిధిలో చట్టబద్ధంగా ఏర్పాటైన  నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్  అమలు చేస్తోంది 2022-23 ఆర్థిక సంవత్సరంలో  వ్యవసాయ ప్రాసెసింగ్, బలహీన వర్గాలు, సహకార సంఘాల కంప్యూటరీకరణ, సర్వీస్, క్రెడిట్ యూత్ కోఆపరేటివ్‌ల ఏర్పాటు లాంటి కార్యక్రమాల అమలు కోసం   నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్41,031.39 కోట్ల రూపాయలు సమకూర్చింది.

 

*****



(Release ID: 1938450) Visitor Counter : 164