అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

అతి తక్కువ వ్యవధిలో 140 అంతరిక్ష అంకుర సంస్థలు పనిచేయడం ప్రారంభించడంతో అంతరిక్ష రంగంలో భారతదేశం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని అంతర్జాతీయ గుర్తింపు పొందింది.. డాక్టర్ జితేంద్ర సింగ్ అంతరిక్ష పరిశోధన కోసం ప్రపంచ దేశాల మధ్య సహకారం, సమన్వయము ముఖ్యం ... డాక్టర్ జితేంద్ర సింగ్


' మానవాళి భవిష్యత్తు, సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధించడానికి, సామాన్య ప్రజల జీవితాలను మెరుగు పరచడానికి అంతరిక్ష సాంకేతికతను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి."డాక్టర్ జితేంద్ర సింగ్

అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కీలకం... డాక్టర్ జితేంద్ర సింగ్

బెంగళూరులో జీ- 20 4వ స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ (SELM)ని ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 06 JUL 2023 12:58PM by PIB Hyderabad

అతి తక్కువ వ్యవధిలో 140 అంతరిక్ష అంకుర సంస్థలు పనిచేయడం ప్రారంభించడంతో అంతరిక్ష రంగంలో  భారతదేశం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని అంతర్జాతీయ గుర్తింపు పొందింది అని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ (స్వతంత్ర బాధ్యత) , పీఎంఓ లో సహాయ మంత్రి, అణుశక్తి, అంతరిక్షం, సిబ్బంది ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.  ప్రపంచం మొత్తం భారతదేశం  సామర్థ్యాలు, అంతరిక్ష సాంకేతికతలో ఆమె సామర్థ్యాన్ని గుర్తించడం ప్రారంభించిందన్నారు. ఈ రోజు బెంగళూరులో జరిగిన  జీ- 20 4వ స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ ప్రారంభ కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలతో అంతరిక్ష రంగంలో భారతదేశం అభివృద్ధి సాధించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు రంగాన్ని అనుమతించడంతో అంతరిక్ష రంగం గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి పధంలో దూసుకు పోతున్నదని మంత్రి అన్నారు.  దేశాలతో పోల్చి చూస్తే భారతదేశంలో తన అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అయితే, ఆలస్యంగా అంతరిక్ష రంగంలోకి ప్రవేశించిన భారతదేశం ప్రపంచ స్థాయి అంతరిక్ష సంస్థలకు సలహాలు, సూచనలు, సమాచారం అందించే స్థాయికి ఎదిగిందన్నారు.   

అంతరిక్ష సాంకేతికతలో అగ్రగామిగా చెప్పుకుంటున్న దేశాలు ప్రస్తుతం భారతదేశం మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తున్నాయని  డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా అంతరిక్ష సంబంధిత ఒప్పందాలు ఎక్కువగా కుదరడం భారతదేశ సామర్ధ్యానికి గుర్తింపు అని మంత్రి వ్యాఖ్యానించారు. 

అంతరిక్ష రంగం అభివృద్ధిలో ప్రైవేటు రంగం పోషిస్తున్న పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు రంగం పాత్ర   "కీలకమైనది" అని పేర్కొన్నారు.

అంతరిక్ష పరిశోధన కోసం ప్రపంచ దేశాల మధ్య సహకారం, సమన్వయము ముఖ్యమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.  అంతరిక్షాన్ని అన్వేషించడానికి అన్ని దేశాలు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో దేశాల మధ్య సహకారం అవసరమన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్పేస్ ఎకానమీ భాగం పెరగాలన్నారు. దీనికోసం అంతరిక్ష వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తున్న దేశాలు కలిసి ఒక కూటమిగా పనిచేయాల్సి ఉంటుందన్నారు.  

' మానవాళి  భవిష్యత్తు, సుస్థిర ఆర్థిక అభివృద్ధి  సాధించడానికి, సామాన్య ప్రజల  జీవితాలను మెరుగు పరచడానికి అంతరిక్ష సాంకేతికతను పూర్తి  స్థాయిలో ఉపయోగించుకోవాలి." అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 

" ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ భాగాన్ని  పెంపొందించడానికి చర్యలు అమలు కావాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుత అవసరం. దీనికోసం అంతరిక్ష వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తున్న దేశాలు కలిసి ఒక  కూటమిగా పనిచేయాల్సి ఉంటుంది. కూటమి ఏర్పాటులో భాగంగా జరుగుతున్న చర్యల్లో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు అయ్యింది.  ‘వసుధైవ కుటుంబం’ సాధన కోసం  “ఒకే భూమి, ఒకే అంతరిక్షం, ఒక భవిష్యత్తు” అనే భారతదేశపు జీ-20 స్ఫూర్తికి అనుగుణంగా సదస్సు ఏర్పాటు అయ్యింది" అని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.  

"అంతరిక్ష సాంకేతికత ఆర్థిక వ్యవస్థ లోని వివిధ మూలస్థంభాలను ఒకే గొడుగు కిందకి తీసుకు వస్తుంది. దీంతో అంతరిక్ష రంగంలో  చేసే పెట్టుబడులు దేశాలు, ఆర్థిక వ్యవస్థల మొత్తం అభివృద్ధిపై సానుకూల  ప్రభావాన్ని చూపుతాయి. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ తదుపరి ట్రిలియన్ డాలర్ల రంగంగా ఉంటుందని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే దశాబ్దాలలో ఆర్థిక వ్యవస్థలో అంతరిక్ష ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ప్రైవేటు రంగానికి అందుబాటులోకి తీసుకురావాలని భారతదేశం నిర్ణయించింది.సమగ్ర అభివృద్ధి సాధించడానికి  ఇతర దేశాలతో కలిసి పనిచేయడానికి   భారతదేశం వివిధ చర్యలు ప్రారంభించింది, ”అని ఆయన అన్నారు.

సమావేశంలో పాల్గొంటున్న ప్రైవేటు సంస్థలు, వివిధ దేశాలకు చెందిన నిపుణులు అందించే సలహాలు, సూచనలు భూగోళంపై సానుకూల ప్రభావాన్ని చూపించే నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరిస్తాయన్న ఆశాభావాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యక్తం చేశారు. 

"జీ-20 దేశాలు, సభ్య దేశాలు  ప్రపంచ జీడీపీ లో 75 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ దేశాలలో ప్రపంచ జనాభాలో 20% మంది నివసిస్తున్నారు.ప్రపంచ వాణిజ్యంలో 75% వాటా  జీ-20 దేశాలు, సభ్య దేశాలు కలిగి ఉన్నాయి. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ  భవిష్యత్తుపై ఎక్కువ  ప్రభావం చూపుతాయి, ”అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 6 దశాబ్దాల చరిత్ర కలిగిన అంతరిక్ష కార్యక్రమంలో భారతదేశం అంతరిక్ష సాంకేతిక  సామర్థ్యాన్ని ప్రదర్శించిందని మంత్రి అన్నారు.

" ప్రస్తుతం అన్ని రంగాలపై అంతరిక్ష రంగం ప్రభావం చూపుతోంది. శాస్త్ర సాంకేతిక రంగం,  టెలికమ్యూనికేషన్, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, విపత్తు హెచ్చరిక  ఉపశమనాలు, వాతావరణ మార్పు, నావిగేషన్, రక్షణ, పరిపాలన  వంటి వాటితో సహా మానవ జీవితంలో అన్ని రంగాలను అంతరిక్ష రంగం ప్రభావితం చేస్తోంది తాకింది" అని ఆయన వివరించారు. 

జాతీయ అంతరిక్ష సంస్థల  అధిపతులు, జీ-20 దేశాలకు చెందిన ప్రముఖ అంతరిక్ష పరిశ్రమల ప్రతినిధులు , జీ-20 దేశాల సీనియర్ దౌత్యవేత్తలు ,ఆహ్వానిత  దేశాలతో పాటు ఇతర ప్రముఖులు రెండు రోజుల సమావేశానికి హాజరవుతున్నారు.

 

***


(Release ID: 1937800) Visitor Counter : 255