ప్రధాన మంత్రి కార్యాలయం
స్వామి వివేకానంద గారి ని ఆయన పుణ్యతిథి సందర్భం లోస్మరించుకొన్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
04 JUL 2023 6:29PM by PIB Hyderabad
స్వామి వివేకానంద గారి ని ఆయన పుణ్య తిథి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు. సేవ, మానవత్వం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం అనేటటువంటి ఆయన యొక్క ఆదర్శాలు ఒక బలమైన మరియు చైతన్య భరితం అయిన భారతదేశాన్ని నిర్మించే దిశ లో మనకు ప్రేరణ ను మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే ఉంటాయి అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మహనీయుడు స్వామి వివేకానంద గారి ని ఆయన పుణ్య తిథి సందర్భం లో స్మరించుకొంటున్నాను. సేవ, మానవత్వం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం అనేటటువంటి ఆయన యొక్క ఆదర్శాలు మనకు ఒక బలమైనటువంటి మరియు చైతన్యభరితం అయినటువంటి భారతదేశాన్ని నిర్మించే దిశ లో ప్రేరణ తో పాటు మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే ఉంటాయి. మనం ఏకత్వం తో కూడిన మరియు సోదరత్వం తో కూడిన ఆయన యొక్క దార్శనికత ను సాకారం చేయడం కోసం మన నిబద్ధత ను ఈ రోజు న పునరుద్ఘాటించుదాం’.’ అని పేర్కొన్నారు.
*******
DS/ST
(रिलीज़ आईडी: 1937465)
आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam