సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని మెహసానాలో దూద్‌సాగర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న శ్రీ మోతీభాయ్ ఆర్ చౌదరి సాగర్ సైనిక్ స్కూల్‌ నిర్మాణానికి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేసిన కేంద్ర హోం ,సహకార మంత్రి శ్రీ అమిత్ షా


కేవలం ఉత్తర గుజరాత్‌లోని పిల్లలు మాత్రమే కాకుండా దేశం అన్ని ప్రాంతాలకు చెందిన పిల్లలు సైన్యంలో చేరేందుకు ఈ సైనిక్ స్కూల్ అవకాశం కల్పిస్తుంది

శ్రీ మోతీ భాయ్ చౌదరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజా జీవితం , వ్యక్తిత్వం గురించి క్షేత్ర స్థాయిలో పనిచ్ చేయాలి--శ్రీ షా

శ్రీ మోతీ భాయ్ ఆర్. చౌదరి గత కొన్ని దశాబ్దాలుగా గాంధీనగర్‌లోని చౌదరి వర్గానికి కి చెందిన పశువుల పెంపకం దారులకు ముఖ్యంగా మహిళలకు జీవనోపాధిని కల్పించడం ద్వారా దూద్‌సాగర్ డెయిరీ పేరుకు సార్థకత తెచ్చారు.. శ్రీ షా

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తన 9 సంవ‌త్స‌రాల‌ పాలనలో దేశంలో భద్రత సాధించి అభివృద్ధి పధంలో దేశాన్ని నడుపుతూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌త‌దేశాన్ని గ‌ర్వించేలా చేశారు.. శ్రీ షా

సహకార ఉద్యమం తో అత్యంత వెనుకబడిన పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచి మోదీ ప్రభుత్వం దేశాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసింది.. శ్రీ షా

స‌హ‌కార సంస్థ‌లు, కార్పోరేట్ సంస్థలు , ప్ర‌భుత్వేతర సంస్ధ‌ల సహకారంతో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారు.

పీపీపీ విధానంలో దేశంలో 100 సైనిక్ పాఠ

Posted On: 04 JUL 2023 4:10PM by PIB Hyderabad

గుజరాత్‌లోని మెహసానాలో దూద్‌సాగర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న శ్రీ మోతీభాయ్ ఆర్ చౌదరి సాగర్ సైనిక్ స్కూల్‌ నిర్మాణానికి  కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ అమిత్ షా   గత కొన్ని దశాబ్దాలుగా గాంధీనగర్‌లోని చౌదరి వర్గానికి కి చెందిన పశువుల పెంపకం దారులకు ముఖ్యంగా మహిళలకు   జీవనోపాధి కల్పించడం ద్వారా దూద్‌సాగర్ డెయిరీ పేరుకు శ్రీ మోతీ భాయ్ ఆర్. చౌదరి సార్థకత తెచ్చారని అన్నారు. శ్రీ మోతీభాయ్ నాయకత్వంలో  దూద్‌సాగర్ డెయిరీ సమస్యలను అధిగమించి అభివృద్ధి సాధించింది అని  శ్రీ షా అన్నారు.  శ్రీ త్రిభువన్‌భాయ్ పటేల్ మార్గదర్శకత్వం, శ్రీ మోతీభాయ్ సహకారంతో ఉత్తర గుజరాత్‌లోని మూడు జిల్లాలు - బనస్కాంత, సబర్‌కాంత మరియు మెహసానాలో పాల ఉత్పత్తి ప్రారంభమైందని ఆయన చెప్పారు. ఒక ఆదర్శ కార్యకర్త  ప్రజా జీవితంలో ఎలా ఉండాలో, అతని వ్యక్తిత్వం ఎలా ఉండాలో మోతీ భాయ్ చౌదరి జీవితాన్ని చూసి  నేర్చుకోవాలని శ్రీ షా అన్నారు.

ఈ రోజు భూమి పూజ జరిగిన మోతీభాయ్ చౌదరి సాగర్ సైనిక్ స్కూల్‌ వల్ల కేవలం  ఉత్తర గుజరాత్‌లోని పిల్లలు మాత్రమే కాకుండా దేశం అన్ని ప్రాంతాలకు చెందిన పిల్లలు  సైన్యంలో చేరేందుకు అవకాశం కల్పిస్తుందని  కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఈ పాఠశాలలో చదివి సైన్యంలోకి వెళ్లే పిల్లలు దేశభక్తి, దేశ రక్షణ కోసం తమ జీవితాలను  అంకితం చేస్తారని, ప్రజా  జీవనంలో కొనసాగేవారు   పాఠశాలలో అలవరచుకున్న దేశభక్తి సంస్కృతి విలువల స్పూర్తితో  జీవించి  మంచి పౌరులుగా మారుతారని శ్రీ షా అన్నారు. 

దేశాన్ని సురక్షితంగా ఉంచి అభివృద్ధి పధంలో నడిపించడానికి గత 9 సంవత్సరాలుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృషి చేసి విజయం సాధించారని శ్రీ షా అన్నారు. మోదీ పాలనలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం పొందిందన్నారు.  గత  ప్రభుత్వాలు ఎవరితో సంబంధం లేకుండా తమకు తామే అభివృద్ధి పనులు అమలు చేయడంతో  అభివృద్ధిలో వేగం తగ్గిందన్నారు. అయితే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్ని వర్గాలను అభివృద్ధిలో భాగస్వామ్యులను చేయడంతో అభివృద్ధి వేగం పుంజుకుంది అని  శ్రీ షా  వివరించారు. సహకార సంస్థలు, కార్పొరేట్ సంస్థలు,  ప్రభుత్వేతర సంస్థల సహకారంతో శ్రీ మోదీ దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని శ్రీ షా అన్నారు. పీపీపీ విధానంలో  దేశంలో 100 సైనిక్ పాఠశాలలు  ఏర్పాటు చేయాలని ప్రధాని పిలుపు ఇచ్చారని తెలిపిన శ్రీ షా  దీనిలో భాగంగా  ఈరోజు ఇక్కడ 20వ సైనిక్ స్కూల్‌కు భూమిపూజ నిర్వహించామన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లో జల విప్లవాన్ని తీసుకొచ్చారని కేంద్ర హోం, సహకార మంత్రి ప్రశంసించారు. శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తర గుజరాత్‌ను అభివృద్ధి చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. శ్రీ మోదీ వివిధ పథకాలు అమలు చేసి  నర్మదా, మహిసాగర్ నీటిని ఉత్తర గుజరాత్‌కు తీసుకువచ్చారని ఆయన అన్నారు. ఉత్తర గుజరాత్‌లో నీటిమట్టం పెంచేందుకు సుజలాం సుఫ్లామ్ యోజన పని చేసిందన్నారు. దీని ద్వారా రైతులు వ్యవసాయంలో లబ్ధి పొందారని, పశువుల పెంపకందారుల  సమస్యలు పరిష్కారమయ్యాయని శ్రీ షా చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి   శ్రీ నరేంద్ర మోదీ కృషి చేశారని ఆయన చెప్పారు. 

శ్రీ మోతీభాయ్ ఆర్ చౌదరి సాగర్ సైనిక్ స్కూల్‌ విజ్ఞానం, భద్రత, శౌర్యం, దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తుందని, ఎంతో మంది యువత జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుంది అన్న ఆశాభావాన్ని  శ్రీ అమిత్ షా వ్యక్తం చేశారు. 2022-23 సంవత్సరంలో 50 మంది, 2023-24 లో 55 మంది క్యారెట్ల ఎంపిక జరిగిందన్నారు.  పాఠశాలలో చదువుతున్న యువత కఠోరమైన దినచర్యను పాటిస్తూ భారతమాత సేవకు తమను తాము సిద్ధం చేసుకుని భారతదేశాన్ని పటిష్టంగా తీర్చిదిద్దుతారు అని శ్రీ షా అన్నారు.  

మోతీ భాయ్ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి 'శబ్ద్ మోతీ' పుస్తకాన్ని  ఈ రోజు శ్రీ అమిత్ షా విడుదల చేశారు. మోతీ భాయ్ జీవితం యువత, యుక్త వయస్కులకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమని అన్నారు. మెహసానా డెయిరీ అభివృద్ధి పథంలో  ముందుకు సాగుతూ  దాదాపు 5 లక్షల మంది రైతులకు జీవనాధారంగా మారిందన్నారు. చౌదరి సమాజ్‌, చౌదరి సమాజ్‌, ఠాకోర్‌ సమాజ్‌ మహిళలను కూడా మెహసానా డెయిరీ ఏకం చేసిందన్నారు. మెహసానా డెయిరీ వ్యవస్థాపకుడు శ్రీ మాన్‌సింగ్ సమాజంలోని అనేక వర్గాలకు చెందిన ప్రజలు  పాడి పరిశ్రమ నుండి జీవనోపాధి పొందాలని భావించారని శ్రీ షా అన్నారు. శ్రీ మాన్‌సింగ్    ఆశయాన్ని నెరవేర్చే విధంగా  నేడు జరుగుతుందని ఆయన అన్నారు. మాన్‌సింగ్ భాయ్ డైరీ , ఫుడ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ టెక్నాలజీ నుంచి  ఉత్తీర్ణులైన అనేక  మంది యువకులు గుజరాత్‌లోనే కాకుండా భారతదేశం అంతటా డెయిరీ టెక్నాలజీ రంగంలో ఉన్నత పదవుల్లో పని చేస్తున్నారని శ్రీ షా అన్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకార మంత్రిత్వ శాఖను స్థాపించి ప్రజలకు “సహకార్ సే సమృద్ధి” అనే మంత్రాన్ని అందించారని శ్రీ అమిత్ షా అన్నారు. అత్యంత నిరుపేదలు, పేద ప్రజలందరికీ సహకార ఉద్యమంతో, దేశాభివృద్ధికి అనుసంధానం చేయడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మోదీ ప్రభుత్వం  పెంచిందని అన్నారు. రానున్న రోజుల్లో దేశ డెయిరీ రంగంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరుగుతాయన్నారు.

***


(Release ID: 1937305) Visitor Counter : 175