ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్ లోని దతియాలో రోడ్డు ప్రమాద మృతులకు ప్రధాని నివాళి


ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఎక్స్ గ్రేషియా ప్రకటన

प्रविष्टि तिथि: 28 JUN 2023 8:08PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటం పట్ల ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు

ప్రధాని కార్యాలయం ఇలా ట్వీట్ చేసింది : 

"దతియా లో జరిగిన రోడ్డు ప్రమాదం హృదయ విదారకం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక అధికారులు తగిన సహాయ చర్యలు చేపడతారని భావిస్తున్నా: ప్రధాని మోదీ "

“ ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ప్రధాన మంత్రి జాతీయ  సహాయ నిధి నుంచి ఎక్స్ గ్రేషియా ఇవ్వబడుతుంది. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 అందజేస్తారు. ”

 

*******

DS/ST


(रिलीज़ आईडी: 1936202) आगंतुक पटल : 146
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam