రైల్వే మంత్రిత్వ శాఖ
-భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి ఐదు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి.
-రాణి కమలాపతి – జబల్ పూర్, రాణి కమలాపతి- ఇండోర్, గోవా (మడ్గాన్)-ముంబాయి, రాంచి-పట్నా, ధార్వాడ్-బెంగళూరు మధ్య ఈ వందే భారత్ రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు మధ్యప్రదేశ్, గోవా, జార్ఖండ్, బీహార్, మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాల రాజధానులను కలుపుతాయి.
-ప్రస్తుతం దేశంలో 23 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.
-ఈ రైళ్లు ప్రస్తుత వేగవంతమైన రైళ్లతో పోల్చిచూసినపుడు , కొన్ని గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
-వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు, ప్రపంచ శ్రేణి అనుభవాన్ని అందివ్వడేమ కాక, పర్యాటక రంగానికి ఊతం ఇవ్వనుంది.
Posted On:
27 JUN 2023 4:11PM by PIB Hyderabad
భారతీయ రైల్వేలకు ఈ రోజు చరిత్రాత్మక దినం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రాణి కమలాపతి స్టేషన్ నుంచి 5 కొత్త , ఉన్నతీకరించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వేలు, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, ప్రజాప్రతినిధులు, పలువురు ముఖ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సౌకర్యవంతమైన ప్రయాణానికి, వీలు కల్పించే ఈ ఐదు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు, రాణి కమలాపతి- జబల్ పూర్, రాణి కమలాపతి- ఇండోర్, గోవా (మడ్గాన్)- ముంబాయి, రాంచి-పాట్నా, ధార్వాడ్- బెంగళూరు ల మధ్య నడుస్తాయి. ఈ రోజు ప్రారంభమైన వందే భారత్ రైళ్లు వివిధ రాష్ట్ర రాజధానులు ,ఇతర ముఖ్య పట్టణాల మధ్య అనుసంధానతను పెంచడంతో పాటు, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. అలాగే సౌకర్యవంతమైన ప్రయాణానికి వీలు కల్పిస్తాయి. ఈ వందేభారత్ రైళ్లు, నవభారత సందేశమైన వికసిత్ భారత్ నినాదాన్ని దేశం నలుమూలలకూ తీసుకువెళుతున్నదని అన్నారు.
రాణి కమలాతపతి- జబల్పూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్:
రాణి కమలాపతి- జబల్పూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు రాణి కమలాపతి రైల్వే స్టేషన్ లో బయలుదేరి అదే రోజు జబల్పూర్ స్టేషన్ కు అదే రోజు చేరుతుంది. ఈ రైలు మార్గమధ్యమంలో నరసింగ్పూర్, పిపారియ, నర్మదాపురం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. వందేభారత్ రైళ్లను నడపడంతో మధ్యప్రదేశ్ సాంస్క్రుతిక రాజధాని అయిన జబల్ పూర్ కు , రాష్ట్ర రాజధాని అయిన భోపాల్కు అనుసంధానత పెరిగింది. దీనితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న పలు పర్యాటక ప్రదేశాలు, మొత్తంగా ఈ ప్రాంత అభివ్రుద్ధికి వీలు కలుగుతోంది.
రాణి కమలాపతి- ఇండోర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ :
భోపాల్ – ఇండోర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు, భోపాల్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు బయలుదేరి, అదేరోజు ఇండోర్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ రైలు మార్గమధ్యంలో ఉజ్జయిని రైల్వేస్టేషన్ లో ఆగుతుంది.. వందేభారత్ రైలును రాణి కమలాపతి నుంచి ఇండోర్ కు నడపడం వల్ల, రెండు నగరాల మధ్య వేగవంతంగా ప్రయాణించడానికి వీలు కలుగుతుంది, ఈ ప్రాంతాలలోని సాంస్క్రుతిక, పర్యాటక ప్రాంతాలను ఇది అనుసంధానం చేస్తుంది. వందే భారత్ రైలు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన, మెరుగైన ప్రయాణ అనుభవాన్నిస్తుంది.
గోవా (మడ్గావ్)- ముంబాయి వందే భారత్ ఎక్స్ ప్రెస్ :
గోవా (మడ్గావ్)- ముంబాయి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు, ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి బయలుదేరి అదే రోజు మడ్గావ్ స్టేషన్ కు చేరుకుంటుంది. మధ్యలో ఇది దాదర్, ఠానే, పాన్వెల్, ఖేడ్, రత్నగిరి, కంకావలి, తివిమ్ రైల్వేస్టేషన్ల లో ఆగుతుంది.అధునాతన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు వేగంతోపాటు , కొంకణ్ ప్రాంత ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండనుంది. ఇది ఈ ప్రాంతంలో పర్యాటక రంగ అభివ్రుద్ధికి దోహదపడనుంది. కొత్త వందే భారత్ రైలు ఈ మార్గంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించడంతోపాటు, పర్యాటకులకు అనువుగా ఉండనుంది.
రాంచి- పాట్నా వందేభారత్ ఎక్స్ ప్రెస్ :
రాంచి – పాట్నా ల మధ్య కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పాట్నా నుంచి బయలుదేరి, అదే రోజు రాంచి కి చేరుకుంటుంది. ఇది గయ, కోడర్మ, హజారిబాగ్, బార్కాకనల, మెస్రే రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఖనిజవనరులు పుష్కలంగా ఉన్న రాంచీ ఖనిజపరిశ్రమలకు అనువైన ప్రదేశం. ఈ రైలు స్థానిక వ్యాపారులకు, ట్రేడర్లకు, పాట్నాతో సత్వర అనుసంధానతను కల్పిస్తుంది.
ధార్వాడ్ – బెంగళూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ :
ధార్వాడ్ – బెంగళూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కె.ఎస్.ఆర్ బెంగళూరు సిటీలో బయలుదేరి, అదే రోజు ధార్వాడ్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఇది మధ్యలో యశ్వంత్ పూర్, దావణగేరె, హుబ్బలి రైల్వేస్టేషన్లలో ఆగుతుంది.కర్ణాటకలో , ధార్వాడ్ – బెంగళూరు వందే భారత్ రైలు విద్యాకాశీ ధార్వాడ్, వాణిజ్య నగరి, హుబ్బలి, బెంగళూరు లను కలుపుతుంది. అలాగే వందేభారత్ రైలు, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటకలకు అనుసంధానత కల్పిస్తుంది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అత్యంత సౌకర్యవంతమైన సదుపాయాలను కల్పిస్తుంది. ప్రయాణికులకు ఇది ప్రపంచశ్రేణి ప్రయాణ అనుభవాన్నిస్తుంది. ఇందులో అధునాతన రక్షణ సాంకేతికత ఉంది. ప్రతి రైలులో బోగీలు గంటకు 160 కిలోమీటర్ల ఆపరేషనల్ వేగంతో పూర్తి స్థాయి సస్పెండెడ్ ట్రాక్షన్ కలిగి ఉంటుంది. అధునాతన సప్సెన్షన్ వ్యవస్థ వల్ల ప్రయాణికులు సౌకర్యవంతమైన ప్రయాణం చేయగలుగుతారు.వందే భారత్ రైళ్ల వల్ల భారతీయ రైల్వేల గ్రీన్ ఫుట్ ప్రింట్ పెరుగుతుంది. వీటి ద్వారా 30 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. వీటికి అధునాతన విద్యుత్ పునరుత్పత్తి వ్యవస్థ ఉంది.
***
(Release ID: 1935758)
Visitor Counter : 123