ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన ఆరోగ్య సేవలను కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా సమీక్షించారు
భక్తులకు వైద్య సంరక్షణ మరియు ఆరోగ్య సౌకర్యాల కోసం జే అండ్ కే కి అన్నివిధాల మద్దతును అందిస్తుంది
యాత్రలో భక్తులందరికీ అత్యుత్తమ ఆరోగ్య సేవలు మరియు వైద్య సదుపాయాలు అందేలా చూస్తాం: డాక్టర్ మన్సుఖ్ మాండవియా
బాల్తాల్ & చందన్వారిలో 24*7 గంటలు పనిచేసే 100 పడకల ఆసుపత్రులు స్థాపించబడ్డాయి
వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తల బృందాన్ని నియమించారు
Posted On:
27 JUN 2023 4:29PM by PIB Hyderabad
అమర్‌నాథ్ యాత్రలో పాల్గొనే భక్తులకు ఆరోగ్య సేవలు మరియు తగిన నాణ్యమైన ఆరోగ్య సౌకర్యాల ఏర్పాటుపై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు డీ జీ హెచ్ ఎస్ సీనియర్ అధికారులతో సమీక్షించారు.
బేస్ క్యాంపులో మరియు మార్గమధ్యంలో అందిస్తున్న వైద్యం మరియు ఇతర ఆరోగ్య సదుపాయాల గురించి ఆయనకు వివరించారు. యాత్రికులకు అవసరమైన ఆరోగ్య సౌకర్యాలు మరియు వైద్య సేవలను అందించడానికి జమ్మూ మరియు కాశ్మీర్ యూ టీ కి మద్దతు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రి అధికారులను ఆదేశించారు. యాత్రలో భక్తులకు అత్యుత్తమ ఆరోగ్య సేవలు, వైద్య సదుపాయాలు అందేలా చూస్తామని తద్వారా వారు మంచి ఆరోగ్యం మరియు శారీరక స్థితిలో ఉంటారని మంత్రి తెలిపారు.
అమర్‌నాథ్ యాత్ర భౌగోళిక వాతావరణ సవాళ్ల పరంగా ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాలకు సంబంధించిన సమస్యల పరంగా అసాధారణమైనది. కేంద్ర ఆరోగ్య మంత్రి నిర్దేశించిన ప్రకారం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ యూ టీ ప్రభుత్వానికి సహాయం చేస్తోంది. జే అండ్ కే యాత్ర కోసం ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లతో తగిన ఆరోగ్య సంరక్షణ పెంచడానికి అవసరాలను అంచనా వేసే ప్రయత్నంలో ఉంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బేస్ క్యాంప్ వద్ద వైద్య సదుపాయాలను అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది.
బాల్తాల్ & చందన్వారిలో 100 పడకల ఆసుపత్రుల ఏర్పాటు
డీ ఆర్ డీ ఓ ద్వారా రెండు యాక్సిస్ రూట్లలో బాల్టాల్ మరియు చందన్వారిలో రెండు 100 పడకల ఆసుపత్రుల స్థాపనకు ఎం ఓ హెచ్ ఎఫ్ డబ్లూ పూర్తిగా నిధులు సమకూర్చింది. ఈ ఆసుపత్రుల్లో యాత్ర కోసం నియమించబడిన సిబ్బందికి వసతి సౌకర్యాలు ఉంటాయి. ఈ ఆసుపత్రుల్లో ల్యాబ్ సౌకర్యాలు, రేడియో డయాగ్నసిస్, గైనకాలజికల్, ఐసియులు, హైపర్‌బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌లతో సహా రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం అన్ని సౌకర్యాలు ఉంటాయి.
ఈ ఆసుపత్రులు 24x7 పని చేస్తాయి మరియు స్వతంత్ర ట్రామా యూనిట్‌తో పాటు నిపుణులైన వైద్యులచే నిర్వహించబడతాయి.
ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల డిప్యుటేషన్
డీ జీ హెచ్ ఎస్ (ఎం ఓ హెచ్ ఎఫ్ డబ్లూ ) 11 రాష్ట్రాలు/యుటిలు మరియు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నుండి నామినేషన్లను అభ్యర్థించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను కూడా నియమించింది. ఈ బృందాలు 4 బ్యాచ్‌లు/షిఫ్టులలో నియమించబడతాయి. డిప్యుటేషన్ కోసం ఎంపిక చేయబడిన వైద్యులు/పారామెడిక్స్ యొక్క సామర్థ్య పెంపుదల ఎం ఓ హెచ్ ఎఫ్ డబ్లూ ద్వారా అధిక ఎత్తు కారణంగా వచ్చే అనారోగ్యం మరియు అత్యవసర పరిస్థితుల నిర్వహణపై ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివి నుండి ఒక బృందం యూ టీ తో సమన్వయం చేస్తుంది. ఈ సంవత్సరం యాత్రకు సంసిద్ధతను సమీక్షించడానికి డీ టీ ఈ జీ హెచ్ ఎస్ ప్రస్తుత స్థానిక వైద్య మౌలిక సదుపాయాలు/ సౌకర్యాలు మరియు తాత్కాలిక ఆసుపత్రుల వాస్తవ క్షేత్ర స్థాయి అంచనాను నిర్వహిస్తోంది.
వెబ్ పోర్టల్/ ఐ టీ అప్లికేషన్
మెరుగైన అత్యవసర సంసిద్ధత, వ్యాధుల నమూనాపై అవగాహన మరియు ఆరోగ్య సంబంధిత సమస్యలపై నిఘా కోసం, సమీకృత వ్యాధి నిఘా కార్యక్రమం (IDSP)- ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫాం ద్వారా యాత్ర కోసం అనుకూలీకరించిన ప్రారంభించబడిన నిజ-సమయ డేటా సేకరణ కోసం వెబ్ మాడ్యూల్ ను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) పోర్టల్ అభివృద్ధి చేస్తోంది.
అవగాహన సూచనలు సలహాలు
యాత్రికులలో అవగాహనను పెంపొందించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేయవలసినవి చేయకూడనివి అంశాలను సులభ రూపంలో సలహాలను రూపొందించింది. అధిక ఎత్తులో ఉన్న అత్యవసర పరిస్థితుల వైద్య నిర్వహణ కోసం వైద్య నిర్వహణ కోసం నిర్వహణ విధానాలను కూడా సిద్ధం చేసింది.
***
(Release ID: 1935755)
Visitor Counter : 155