ప్రధాన మంత్రి కార్యాలయం
జూన్ 27 వ తేదీ నాడు మధ్య ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధానమంత్రి
వందే భారత్ ఎక్స్ప్రెస్ లు అయిదింటి కి రాణి కమలాపతి రైల్ వే స్టేశన్ లో ప్రారంభ సూచక జెండాల నుచూపెట్టనున్న ప్రధాన మంత్రి
భోపాల్ (రాణికమలాపతి)-ఇందౌర్ , భోపాల్ (రాణి కమలాపతి)-జబల్ పుర్, రాంచీ-పట్ నా, ధారవాడ-బెంగళూరు మరియు గోవా (మడ్ గాఁవ్)-ముంబయి ల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ల ను ప్రవేశపెట్టడం జరుగుతుంది
మొట్ట మొదటి సారిగా వందే భారత్ రైలు సదుపాయాన్నిఅందుకోనున్న గోవా, బిహార్ మరియు ఝార్ ఖండ్ లు
ప్రయాణికుల కు ప్రపంచ శ్రేణి అనుభూతి ని అందించడం తో పాటు పర్యటన కు కూడా ప్రోత్సాహాన్ని అందించనున్న రైళ్లు
Posted On:
26 JUN 2023 12:50PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూన్ 27 వ తేదీ నాడు మధ్య ప్రదేశ్ ను సందర్శించనున్నారు.
ప్రధాన మంత్రి ఉదయం పూట దాదాపు గా 10:30 గంటల కు, రాణి కమలాపతి రైల్ వే స్టేశన్ కు చేరుకొని వందే భారత్ రైళ్ళు అయిదింటి కి ప్రారంభ సూచకం గా ఆకుపచ్చటి జెండా ను చూపుతారు. ఆ అయిదు రైళ్లు ఏవేవి అంటే వాటిలో భోపాల్ (రాణి కమలాపతి)-ఇందౌర్ వందే భారత్, భోపాల్ (రాణి కమలాపతి)-జబల్ పుర్ వందే భారత్, రాంచీ-పట్ నా వందే భారత్, ధారవాడ-బెంగళూరు వందే భారత్ మరియు గోవా (మడ్ గాఁవ్)-ముంబయి వందే భారత్ లు ఉన్నాయి.
భోపాల్ (రాణి కమలాపతి)-ఇందౌర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు మధ్య ప్రదేశ్ లోని రెండు ముఖ్య నగరాల మధ్య సులభతరమైనటువంటి మరియు వేగవంతం అయినటువంటి ప్రయాణానికి వీలు కల్పించనుంది. అంతేకాక ఆ ప్రాంతం లో సాంస్కృతిక, పర్యటక మరియు ధార్మిక స్థలాల కు కనెక్టివిటీ ని మెరుగుపరచనుంది.
భోపాల్ (రాణి కమలాపతి)-జబల్ పుర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు మహాకౌశల్ ప్రాంతం (జబల్ పుర్)ను మధ్య ప్రదేశ్ లోని కేంద్రీయ ప్రాంతం (భోపాల్)తో కలుపుతుంది. అంతేకాక, ఆ ప్రాంతం లో పర్యటక ప్రదేశాల కు మెరుగైనటువంటి కనెక్టివిటీ తాలూకు ప్రయోజనం కూడాను ప్రాప్తించనుంది.
రాంచీ-పట్ నా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఝార్ ఖండ్ కు మరియు బిహార్ కు ఒకటో వందే భారత్ రైలు కానున్నది. ఇది పట్ నా కు మరియు రాంచీ కి మధ్య కనెక్టివిటీ ని వృద్ధి చెందింపచేసే ఈ రైలు పర్యటకుల కు, విద్యార్థుల కు మరియు వ్యాపారస్తుల కు ఒక వరప్రసాదం గా మారగలుగుతుంది.
ధారవాడ-బెంగళూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ కర్నాటక లోని ముఖ్య నగరాలు అయినటువంటి ధారవాడ, హుబ్బళ్లి లను రాష్ట్ర రాజధాని నగరం బెంగళూరు తో కలుపుతుంది. దీని తో పర్యటకుల కు, విద్యార్థుల కు మరియు వ్యాపారస్తుల కు గొప్ప లాభం కలుగుతుంది.
గోవా (మడ్ గాఁవ్)-ముంబయి వందే భారత్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ గోవా లో ఒకటో వందే భారత్ ఎక్స్ ప్రెస్ కానుంది. అది ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ నుండి గోవా లోని మడ్ గాఁవ్ స్టేశన్ మధ్య నడుస్తుంది; మరి ఈ రైలు గోవాలోను, మహారాష్ట్ర లోను పర్యటన రంగాని కి ఊతాన్ని అందించే దిశ లో తోడ్పాటు ను అందించనుంది.
***
(Release ID: 1935387)
Visitor Counter : 187
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam