ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈజిప్ట్ ప్రధాని సారధ్యంలోని మంత్రిమండలిలో ‘భారత విభాగం’ తో ప్రధాని మోదీ భేటీ

Posted On: 25 JUN 2023 5:13AM by PIB Hyderabad

అధికారిక పర్యటన మీద కైరో చేరుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ 2023 జూన్ 24 న  ఈజిప్ట్ మంత్రిమండలి లోని ‘భారత  విభాగం’ తో భేటీ  అయ్యారు.  2023 రిపబ్లిక్ డే కి ఈజిప్ట్ ఉపాధ్యక్షుడు ఆబ్డెల్ ఫత్తా ఎల్ సిసి  ముఖ్య అతగీతిగా హాజరైన సమయంలో ఈ ఏడాది ఆరంభంలో ఈ విభాగం ఏర్పాటైంది. ఈ భారత విభాగానికి ఈజిప్ట్ ప్రధాని ముస్తఫా మాద్ బౌలీ నాయకత్వం వహిస్తున్నారు.

ప్రధాని ముస్తఫా మాద్ బౌలీ, ఆయన మంత్రివర్గ సహచరులు ఈ భారత విభాగం చేపడుతున్న కార్యకలాపాలను సోదాహరణంగా వివరించారు. కొత్త రంగాలలో సహకారం కోరుతూ ప్రతిపాదించారు. భారతదేశం నుంచి అందుతున్న సానుకూల స్పందన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్- ఈజిప్ట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు భవిష్యత్తులో మరిన్ని రంగాలలో బలపడాలని కోరుకున్నారు.

భారత్ విభాగం ఏర్పాటును ప్రధాని అభినందించారు. సంపూర్ణ పాలన భావన వల్ల భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈజిప్ట్ తో కలిసి మరింత సాన్నిహిత్యంతో పరస్పర ప్రయోజనాలతో కూడుకున్న అంశాల మీద ముందుకు వెళ్ళటానికి సంసిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
 

వాణిజ్యం, పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, హరిత హైడ్రోజెన్, ఐటీ, డిజిటల్ చెల్లింపులం వేదికలు, ఫార్మా రంగాలలో సహకారాన్ని మరింత పతిష్ఠపరచుకోవటం మీద చర్చలు జరిగాయి.

ఈజిప్ట్ ప్రధాని ముస్తఫా మాద్ బౌలీ తో బాటు ఏడుగురు కాబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులు ఈ  సమావేశంలో  పాల్గొన్నారు:

డాక్టర్ మహమ్మద్ సహకార ఎల్ మరకాయాబీ, విద్యుత్, పునరుత్పాదక విద్యుత్ శాఖామంత్రి
శ్రీ సమేహ్ షౌక్రీ, విదేశీ వ్యవహారాల శాఖామంత్రి

డాక్టర్ హలా అల్ సైద్, ప్రణాళికా, ఆర్థికాభివృద్ధి శాఖామంత్రి
డాక్టర్ రానియా అల్ మషాత్ , అంతర్జాతీయ సహకార శాఖా మంత్రి
డాక్టర్ మహమ్మద్ మాయిత్, ఆర్థిక శాఖామంత్రి
డాక్టర్ అమర్ తలాత్, కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్  టెక్నాలజీ శాఖామంత్రి  
ఇంజనీర్ అహ్మద్ సమీర్, పరిశ్రమలు, వాణిజ్య శాఖామంత్రి

 

***


(Release ID: 1935323) Visitor Counter : 137