రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్/ఇండియా (యూఎస్ ఎయిడ్ /ఇండియా)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న భారత రైల్వే


పరిశుద్ధ ఇంధన వినియోగం, ఇంధన వినియోగ సామర్థ్యం పెంపుదలపై ఒప్పందం ద్వారా కృషి చేయనున్న యూఎస్ ఎయిడ్, భారతీయ రైల్వే శాఖ

శూన్య కర్బన ఉద్గారాల విడుదల లక్ష్యాన్ని సాధించి కాలుష్య నివారణ కోసం కృషి చేస్తున్న రైల్వే శాఖకు సహకరించనున్న ఒప్పందం

Posted On: 23 JUN 2023 9:49AM by PIB Hyderabad

2030 నాటికి శూన్య కర్బన విడుదల లక్ష్యంగా భారత రైల్వే శాఖ కృషి చేస్తోంది. వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి వ్యూహాత్మకంగా పని చేస్తున్న రైల్వే శాఖ లక్ష్య సాధన కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా  పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, ఇంధన సామర్థ్యం పెంపుదల కోసం యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్/ఇండియా ( యూఎస్ ఎయిడ్ /ఇండియా) తో రైల్వే శాఖ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2023 జూన్ 14న యూఎస్ ఎయిడ్ /ఇండియా, రైల్వే శాఖ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒప్పందంపై రైల్వే బోర్డు చైర్మన్,సీఈఓ  శ్రీ నవీన్ గులాటీ సమక్షంలో   రైల్వే బోర్డు సభ్యుడు  (ట్రాక్షన్ అండ్ రోలింగ్ స్టాక్),  యూఎస్ ఎయిడ్ /ఇండియా డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ ఇసాబెల్ కోల్‌మన్ సంతకాలు చేశారు. 

అమెరికా ప్రభుత్వానికి చెందిన  చెందిన యూఎస్ ఎయిడ్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి అంశాలకు సహకారం అందిస్తోంది. ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయం, వాణిజ్యం, స్వచ్ఛ ఇంధనం, వాతావరణ మార్పుల తగ్గింపు, అనుసరణ, ప్రపంచ ఆరోగ్యం, ప్రజాస్వామ్యం , సంఘర్షణ నివారణ , నిర్వహణ,   మానవతా దృక్పధంతో సహాయం అందించేందుకు అంతర్జాతీయంగా కార్యక్రమాలు అమలు చేస్తోంది.

అవగాహన ఒప్పందం కింద భారతీయ రైల్వేలకు యూఎస్ ఎయిడ్  సాంకేతిక సహాయం, కార్యక్రమాల అమలుకు  తోడ్పాటు అందిస్తుంది. ఈ కింది అంశాలపై యూఎస్ ఎయిడ్, భారతీయ రైల్వేలు కలిసి పనిచేస్తాయి.: 

ఎ)భారతీయ రైల్వేలకు స్వచ్ఛ ఇంధనంతో సహా ధీర్ఘకాలిక ఇంధన ప్రణాళిక.

బి.)రైల్వే శాఖకు చెందిన భవనాల కోసం కోసం శక్తి సామర్థ్య విధానం , కార్యాచరణ ప్రణాళిక అభివృద్ధి 

సి) భారతీయ రైల్వే నికర-సున్నా లక్ష్యాన్నిసాధించడానికి స్వచ్ఛమైన ఇంధన సేకరణ కోసం ప్రణాళిక.

డి) నియంత్రణ, అమలు సమస్యల పరిష్కారానికి  పరిష్కరించడానికి సాంకేతిక సహకారం 

ఈ) పునరుత్పాదక ఇంధన వనరుల కోసం వ్యవస్థ రూపకల్పన, బిడ్ల కోసం విధానం అభివృద్ధి. 

ఎఫ్) ఇ-మొబిలిటీ వినియోగంలో  భారతీయ రైల్వేలకు సహకారం అందించడం 

జి) గుర్తించిన రంగాల్లో సామర్ధ్య పెంపుదల కోసం కార్యక్రమాలు నిర్వహించి  క్షేత్రస్థాయి పర్యటన / అధ్యయన యాత్ర నిర్వహణ  (దేశీయ/అంతర్జాతీయ)తో 

యూఎస్ ఎయిడ్ తో కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల , 2030 నాటికి నికర జీరో కార్బన్ ఉద్గారాల విడుదల లక్షాన్ని సాధించడానికి భారతీయ రైల్వేలకు అవకాశం కలుగుతుంది.

 

***


(Release ID: 1934790) Visitor Counter : 161